భళా బుల్లి ప్రోగ్రామ్‌లు | Have Bully Programs | Sakshi
Sakshi News home page

భళా బుల్లి ప్రోగ్రామ్‌లు

Published Tue, Feb 10 2015 11:01 PM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM

భళా  బుల్లి  ప్రోగ్రామ్‌లు

భళా బుల్లి ప్రోగ్రామ్‌లు

నెట్ బ్రౌజింగ్‌లో మనల్ని చికాకుపెట్టే అంశాలేవి?
విచ్చలవిడిగా వచ్చే ప్రకటనలు మొదటివైతే...
అవసరమైన వెబ్‌సైట్‌ను పదేపదే వెతుక్కోవడం రెండోది.
ఈ కామర్స్ వెబ్‌సైట్లు పెరిగిపోయిన నేపథ్యంలో...

ఇంతకీ... ఎక్స్‌టెన్షన్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అన్నదేనా మీ సందేహం... బ్రౌజర్ పైభాగంలో కుడివైపున ఉన్న సెట్టింగ్స్‌ను చూస్తే... అందులో మోర్‌టూల్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఎక్స్‌టెన్షన్స్ ట్యాబ్‌ను క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న అనేక ఎక్స్‌టెన్షన్లు కనిపిస్తాయి. నచ్చినవాటిని ఎంచుకుని క్లిక్ చేయడమే మనం చేయాల్సింది!
 
 
 ఏ వెబ్‌సైట్‌లో ఏది చౌకగా దొరుకుతుందో తెలుసుకోవడం ముచ్చటగా మూడో ఇబ్బంది. మీ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఐతే... కొన్ని ఎక్స్‌టెన్షన్లను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు అనేకం సులువుగా తప్పించుకోవచ్చు.
 
దేశంలో నెట్ వాడకం క్రమేపీ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిపోవడం ఒక కారణమైతే...వాడటంలో ఉన్న సౌలభ్యం రెండో కారణంగా చెప్పుకోవచ్చు. మన బ్రౌజింగ్ అనుభూతిని మరింత సౌకర్యవంతం చేసేందుకు కంపెనీలూ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాయి. చిన్న చిన్న ప్రోగ్రామ్‌ల రూపంలో ఉండే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్ ఈ కోవలోనివే. మిగిలిన బ్రౌజర్ల మాటెలా ఉన్నా... గూగుల్ క్రోమ్‌లోని కొన్ని ఎక్స్‌టెన్షన్స్ మనకు టెన్షన్ తప్పించేస్తాయి. అలాంటి కొన్ని ఎక్స్‌టెన్షన్లు...
 
యాడ్ బ్లాక్: ఫేస్‌బుక్‌తోపాటు వెబ్‌సైట్లలో అటు ఇటూ చేరిపోయి మన దృష్టిని మరల్చే వాణిజ్య ప్రకటనలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్‌వేర్ టూల్. వెబ్‌సైట్లతోపాటు యూట్యూబ్‌కు కూడా దీన్ని వాడుకోవచ్చు. వీడియోలకు ముందు వచ్చే ప్రకటనలను అడ్డుకుంటుంది. ఇప్పటికే దాదాపు కోటిమంది ఈ ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారంటే దీని ప్రాచుర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
పీఎన్‌ఆర్ స్టేటస్: భారతీయ రైల్వే వెబ్‌సైట్ ద్వారా ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నా.. అది కన్ఫర్మ్ అయ్యిందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు తరచూ పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేస్తూంటాము. ప్రతిసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసే పనిలేకుండా ఓ ఎక్స్‌టెన్షన్ ద్వారా కూడా పీఎన్‌ఆర్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. గూగుల్ సెర్చ్‌లో ‘పీఎన్‌ఆర్ స్టేటస్’ అని టైప్ చేస్తే కనిపించే ఓ విడ్జెట్‌లో నేరుగా పీఎన్‌ఆర్ నెంబర్ లేదా ప్రయాణించే వ్యక్తి పేరు లేదా వివరాలు టైప్ చేసి టికెట్ కన్ఫర్మేషన్ ఏ దశలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
 కంపేర్ హట్కే: అమెజాన్‌లోనో.. ఫ్లిప్‌కార్ట్‌లోనో ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఇతర వెబ్‌సైట్లలో ఆ వస్తువు ధర ఎంతుందో తెలుసుకోవడం మనమందరం చేసే పని. కొందరైతే నాలుగైదు వెబ్‌సైట్లలో ధరలు తెలుసుకుంటూ ఉంటారు. అన్ని వెబ్‌సైట్లలో ఆ వస్తువు ధర ఏమిటన్నది ఒకే చోట కనిపించేందుకు పనికొచ్చే ఎక్స్‌టెన్షన్ ఈ ‘కంపేర్ హట్కే’. దాదాపు పది పోర్టల్స్‌లోని ధరల వివరాలను పోల్చి చూసుకోవచ్చు.
 
క్లౌడీ: కంప్యూటర్ లేదా యూఎస్‌బీల్లో డేటా స్టోర్ చేసుకోవడం పాతపద్ధతి. వేర్వేరు వెబ్‌సైట్లు, కంపెనీలు అందిస్తున్న క్లౌడ్ స్టోరేజ్‌లో దాచుకోవడం లేటెస్ట్ ట్రెండ్. కాకపోతే ప్రతి ఫైల్‌నూ ఆ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లౌడీ మీ బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా ఉంటే మాత్రం డ్రాప్‌బాక్స్, ఎవర్‌నోట్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏ సర్వీసుదైనా ఒకేచోటి నుంచి ఫైల్స్ అప్‌లోడ్ చేయవచ్చు. జీమెయిల్ వాడేవారికి పనికొచ్చే ఈ ఎక్స్‌టెన్షన్‌ను వాడుకోవడం ద్వారా భారీ సైజు అటాచ్‌మెంట్లను కూడా పంపుకోవచ్చు.
 
టూమెనీ ట్యాబ్స్: బ్రౌజింగ్ సమయంలో ఒకటికంటే ఎక్కువ ట్యాబ్‌లను వాడటం మనలో చాలామంది చేసే పనే. అయితే ప్రతి అదనపు ట్యాబ్‌తో కంప్యూటర్ ప్రాసెసింగ్ శక్తి తక్కువవుతూ వస్తుంది. బ్రౌజింగ్ వేగమూ తగ్గుతుంది. ఈ చిక్కు నుంచి తప్పించుకునేందుకు టూమెనీ ట్యాబ్స్ పనికొస్తుంది. మీరు చూస్తున్న వెబ్‌సైట్‌ను మాత్రమే యాక్టివ్‌గా ఉంచి, మిగిలినవాటిని డిజేబుల్ చేయడం ద్వారా పనిచేసే ఈ ఎక్స్‌టెన్షన్‌తో ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. వాడి చూడండి మీకే తెలుస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement