
చిన్న పిల్లల్లో రక్తపోటు అంతగా కనిపించదని మనలో చాలా మంది భావిస్తుంటారు. కానీ దాదాపు 25 శాతం మంది పిల్లల్లో చిన్న వయసులోనే రక్తపోటు (హైబీపీ) కనిపిస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో దాదాపు 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లల్లో 23 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్లు తేలింది. మరో 10 శాతం మంది పిల్లల్లో వారు యుక్తవయసు దశకు రాకముందే ప్రీ–హైబీపీ లక్షణాలు కనిపించాయని తెలిసింది. ఫలితంగా చాలా మంది పిల్లలు చిన్న వయసులోనే గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. హైపర్‌టెన్షన్ రెండు రకాలు. కారణం లేకుండా కనిపించేదాన్ని ప్రైమరీ హైపర్‌టెన్షన్ అంటారు. అయితే ఏదైనా కారణంతో వచ్చేదాన్ని సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు.
చిన్న పిల్లల్లో హైబీపీకి కారణాలు :
ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు... ∙పిల్లలకు స్థూలకాయం ఉండటం ∙క్యాల్షియమ్ జీవక్రియల్లో మార్పులు ∙కుటుంబ చరిత్రలో ఎవరికైనా బీపీ ఉండటం
∙రెనిన్ హార్మోన్‌లో మార్పుల వంటివి ప్రైమరీ హైపర్‌టెన్షన్‌కు కారణం కావచ్చు.
సెకండరీ హైపర్‌టెన్షన్‌కు... ∙పిల్లల్లో కనిపించే హైపర్‌టెన్షన్‌కు చాలావరకు సెకండరీ హైపర్‌టెన్షన్ కారణం. అంటే... ∙మూత్రపిండాల సమస్య
∙ఏదైనా మందులు వాడటం ∙మెదడుకు సంబంధించిన రుగ్మతలు
∙గుండెజబ్బులు ∙గ్రంథులకు సంబంధించిన సమస్యలు ∙రక్తనాళాల సమస్యలు... ఇవన్నీ సెకండరీ బీపీకి కారణాలు
చిన్నపిల్లలకు బీపీ పరీక్షలు... మూడేళ్లు దాటిన పిల్లలకు తప్పనిసరిగా బీపీ చూడాలి. ఇలా చిన్న పిల్లలకు బీపీ చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా బీపీని తెలిపే ఛార్ట్ అయిన సెంటైల్‌ను ఫాలో కావాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారికి మరింత నిశితంగా చూడాలి.
బీపీని తెలిపే ఛార్ట్‌ను సెంటైల్ చార్ట్ అంటారు. ఇందులో కొలత 90 ఉంటే అది బీపీ ఉన్నట్లు కాదు. ఆ రీడింగ్ 95–99 ఉంటే ఆ పిల్లలకు హైపర్‌టెన్షన్ స్టేజ్–1 అని చెప్పవచ్చు. 99 పర్సంటైల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్టేజ్–2గా పరిగణించవచ్చు. ఈ తీవ్రతలను బట్టి అంటే... స్టేజ్–1, స్టేజ్–2లను పరిగణనలోకి తీసుకునే ఏ తీవ్రత ఉన్న పిల్లలకు ఎలాంటి చికిత్స అన్నది నిర్ధారణ చేస్తారు.
లక్షణాలు :
పిల్లల్లో హైబీపీ ఉన్నా దాని లక్షణాలు పెద్దగా బయటకు కనిపించకపోవచ్చు. బీపీ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని లక్షణాలతో అది బయటపడవచ్చు. ఆ లక్షణాలివి...
∙తరచూ తలనొప్పి రావడం ∙కళ్లు తిరగడం ∙రక్తస్రావం ∙కంటిచూపులో మార్పులు ∙ఫిట్స్ రావడం ∙పిల్లలు చికాకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పిల్లల్లో ప్రైమరీ హైపర్‌టెన్షన్ నివారణకు...
∙స్థూలకాయం (ఒబేసిటీ) తగ్గేలా చూడటం ∙కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారం తగ్గించడం ∙నూనె పదార్థాలు, ఉప్పు తగ్గించడం ∙ఏరోబిక్స్ వంటి ఆటల్లో పిల్లలు పాల్గొనేలా చూడటం... ఈ జాగ్రత్తలతో హైబీపీని చాలావరకు నియంత్రించవచ్చు.
చికిత్స : ∙హెపర్‌టెన్షన్‌లో హైబీపీ వచ్చిన కారణాన్ని గుర్తించి దానికి చికిత్స చేయాల్సి ఉంటుంది.
∙స్టేజ్–1లో ఉన్న పిల్లలకు సైతం మందులు లేకుండానే పైన పేర్కొన్న జాగ్రత్తలతో నివారించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment