
అధిక కొవ్వుతో అల్జీమర్స్ ముప్పు
లండన్ : అధిక కొవ్వుతో పలు రకాల అనారోగ్యాలు దరిచేరతాయని వైద్యులు హెచ్చరిస్తుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో మెదుడులో అల్జీమర్ ప్రొటీన్స్ 20 రెట్లు అధికంగా చేరే ముప్పు పొంచి ఉందని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. హై కొలెస్ర్టాల్ డిమెన్షియాకు దారితీస్తుందని ఈ అథ్యయనం హెచ్చరించింది. అల్జీమర్స్‌కు నూతన చికిత్సా విధానాల రూపకల్పనలో తమ అథ్యయనం తోడ్పడుతుందని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల బృందం పేర్కొంది.
మెదుడులో కొవ్వులు పేరుకుపోయే జీన్స్‌ను కొందరు కలిగిఉంటారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మెదడు నుంచి కొవ్వు పేరుకుపోవడాన్ని ఎలా నిరోధించాలన్నది ప్రశ్న కాదని, అల్జీమర్స్ వ్యాధిలో కొలెస్ర్టాల్ పాత్రను నియంత్రించడమేనని అథ్యయన రచయిత, కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైఖేల్ వెండ్రుస్కోలో చెప్పారు. కొలెస్ర్టాల్ ఒక్కటే ఈ వ్యాధులను ప్రేరేపించడం లేదని, వ్యాధి కారకాల్లో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. అధ్యయన వివరాలు నేచర్ కెమిస్ర్టీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment