
ఇంటిప్స్
చాలామందికి వంటల్లో క్యాబేజీ వాసన నచ్చదు. క్యాబేజీని ఉడికించేటప్పుడు ఒక బిర్యానీ ఆకు వేస్తే రుచి, వాసన బాగుంటుంది.పొట్టు సులువుగా రావాలంటే వెల్లుల్లి రెబ్బలను పెనం మీద వేడి చేసి, తీయాలి. మొక్కజొన్న గింజలను ఉడికించి, చిటికెడు పంచదార వేసి కలిపితే స్వీట్‌కార్న్ రెడీ. మాంసాహారంలో క్యారెట్ ముక్కలు కూడా వేసి ఉడికించి, తర్వాత తీసేయాలి. మాంసంలో ఉండే అదనపు కొవ్వు క్యారెట్లలోకి చేరిపోతుంది. ఈ క్యారెట్ ముక్కలతో వెజిటబుల్ సూప్ తయారుచేసుకోవచ్చు.