
డ్రా చేసిన డబ్బు చేతికి రాకపోతే..?
సెల్ఫ్‌చెక్
ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు చాలా సులభమయ్యాయి. ఖాతా తెరవడంతోబాటే బ్యాంక్ ఎటిఎం కార్డ్ వస్తోంది. అయితే దీని వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మన పని గోవిందా! ఏటిఎం కార్డ్ వాడకంలో అప్రమత్తంగా ఉంటున్నారా?
1. బ్యాంక్ ప్రతి 3 లేదా 6 నెలలకోసారి పంపే స్టేట్‌మెంట్‌ను పరిశీలించి, తేడా ఉంటే వివరణ కోరతారు.
ఎ. కాదు బి. అవును
2. మీ తదనంతరం మీ ఖాతాలో ఉన్న మొత్తం ఎవరికి చెందాలో వారి వివరాలను (నామినీ) తప్పనిసరిగా ఇస్తారు.
ఎ. కాదు బి. అవును
3. పిన్ నెంబర్‌ను వరసగా మూడుసార్లు తప్పుగా కొడితే కార్డ్ బ్లాక్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
ఎ. కాదు బి. అవును
4. ఏటిఎం పిన్‌నెంబర్‌ను 2–3 నెలలకోసారి మార్చడం మంచిదని తెలుసు.
ఎ. కాదు బి. అవును
5. నగదు విత్‌డ్రా చేయడానికి ఏటిఎం కార్డ్‌ను ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని తెలుసు.
ఎ. కాదు బి. అవును
6. తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయవలసి వస్తే మినీ స్టేట్‌మెంట్‌ను చెక్ చేసుకోవడం, వెంటనే ఏటిఎం పిన్ నంబర్‌ను మార్చడం మంచిదని తెలుసు.
ఎ. కాదు బి. అవును
7. ఏటిఎం కార్డ్ పోయినట్లయితే ఆ విషయాన్ని వెంటనే బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లి కార్డును బ్లాక్ చేయిస్తారు.
ఎ. కాదు బి. అవును
8. పిన్ నెంబర్‌ను కొన్ని కొండగుర్తుల సాయంతో గుర్తుంచుకోవడం మినహా కార్డ్ మీద రాయడం సురక్షితం కాదు.
ఎ. కాదు బి. అవును
9. ఒక్కొక్కసారి విత్‌డ్రా చేయబోయిన మొత్తం చేతికి అందకుండానే ఖాతా నుంచి నగదు నిల్వ తగ్గిపోయినట్లుగా చూపిస్తుంటుంది. ఇటువంటప్పుడు మన నగదును బ్యాంకు నుంచి రాబట్టుకోవాలంటే ఆ స్లిప్‌ను జాగ్రత్త చేయడం తప్పనిసరి అని మీకు తెలుసు.
ఎ. కాదు బి. అవును
10.మీకు లాటరీ వచ్చింది అంటూ ఫోన్ చేసి ఏటిఎం కార్డ్ మీద ఉండే సివివి నంబరు అడిగి మోసాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ఎవరికీ సివివి నంబరు చెప్పకూడదని మీకు తెలుసు.
ఎ. కాదు బి. అవును
పై వాటిలో కనీసం ఏడింటికైనా ‘బి’లు వచ్చినట్లయితే మీకు ఎటిఎం కార్డ్ వాడకంపై తగినంత అవగాహన ఉందని చెప్పవచ్చు. 5 లోపుగా వస్తే మీరు ఎటిఎం కార్డ్ వాడకంలో మరిన్ని జాగ్రత్తలు తెలుసుకోవడం మంచిది.