క్రియేటివ్ ఇమాజినేషన్ మీలో ఉందా?
సెల్ఫ్ చెక్
రచయితలు, పెయింటర్స్, శాస్త్రవేత్తలు, ఇంజనీర్స్, గాయకులు, నృత్య కళాకారులు, సినిమా దర్శకుల వృత్తిలో కొత్త పంథా ఏర్పాడాలంటే దానిలో ఊహ భాగమై ఉంటుంది. మనిషిలో ఉన్న ప్రత్యేక లక్షణం ఊహ. శక్తివంతమైన ఊహ ద్వారానే మనిషి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. మీలో ఎంత ఊహాశక్తి ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.
1. ప్రపంచంలో అనేక ఆసక్తికర అంశాలున్నాయని మీకు తెలుసు. వాటిని తెలుసుకుంటూ మీలో సృజనను పెంచుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
2. సమస్యను పరిష్కరించటానికి ఒకే పద్ధతిని ఫాలో అవ్వరు. వివిధరకాల మార్గాలను అన్వేషిస్తారు. ఓపెన్ మైండ్‌తో ఉంటారు.
ఎ. అవును బి. కాదు
3. సృజనాత్మకంగా ఉండే వ్యక్తులతో ఎక్కుసేపు గడుపుతారు. వినూత్నంగా ఆలోచించేవారితో మీ ఆలోచనలను పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
4. కొత్తకొత్త వస్తువులు తయారు చేస్తుంటారు. పాడైన వస్తువులను రిపేర్ చేయటం అంటే మీకిష్టం.
ఎ. అవును బి. కాదు
5. కళలతో మీకు టచ్ ఉంటే వాటిలో వైవిధ్యం చూపించటానికి ప్రయత్నిస్తారు. భిన్నత్వం చూపటానికి ట్రై చేస్తూ ఉంటారు.
ఎ. అవును బి. కాదు
6. మీ అభిరుచులు, నైపుణ్యాలను స్నేహితులతో పంచుకుంటారు.
ఎ. అవును బి. కాదు
7. మీకు కావలసిన దాని గురించి పూర్తిస్థాయిలో జ్ఞానాన్ని సంపాదిస్తారు. అసంపూర్తిగా వదిలేయరు.
ఎ. అవును బి. కాదు
8. మీ ఆలోచనలకే పరిమితం కాకుండా ఇతరుల ఆలోచనలను ఆచరణలో పెట్టటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’ లు నాలుగు వస్తే మీలో ఊహాశక్తి ఉంటుంది. కాని అది పూర్తిస్థాయిలో ఉండదు. ప్రాక్టీస్ మేక్స్ మేన్ పెర్‌ఫెక్ట్ అన్నారు. సాధించలేని పనిని పదేపదే రకరకాలుగా చేయటానికి ట్రై చేయండి. ‘ఎ’ లు ఆరు దాటితే మీలో ఊహాశక్తి అధికం. దీనివల్ల జీవితంలో వైవిధ్యతకి, ప్రత్యేకతకి తెరతీస్తారు. క్రియేటివ్‌గా ఉంటారు.