ఒక్కోసారి బ్యూటీపార్లర్‌కి వెళ్లే టైమ్ దొరకనప్పుడు ఇంట్లో లభించే సాధనాలతోనే తేలిగ్గా పదినిమిషాల్లో తాజాగా కనిపించవచ్చు ఇలా...
►ఒక టొమాటోని తీసుకుని గుండ్రగా కట్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని తరిగిన టొమాటొ ముక్కలతో ముఖాన్నంతా వలయాకారంలో సుతిమెత్తగా అయిదు నిమిషాల పాటు మర్ధనా చేయాలి.
►తరవాత ఒక టీ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, చిటికెడు గంధం, రెండు మూడు చుక్కల తేనె ఒకదారి తరవాత ఒకటి వేసి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరవాత కడిగేస్తే తాజాగా నిగనిగలాడే అందం మీ సొంతం!
సౌందర్య పోషణలో నిమ్మరసం ప్రత్యేకత ఎంతో ఉంది. ముఖంపై బ్లాక్‌హెడ్స్, వైట్ హెడ్స్‌తో చర్మరంధ్రాలు మూసుకుపోయినా, మొటిమల నివారణకయినా నిమ్మరసం చక్కని సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది.
►టీ స్పూ నిమ్మరసంలో కాటన్ ముంచి ముఖానికంతా అప్లై చేసి, 10 నిమిషాల తరువాత చన్నీటితో కడిగేయాలి.
►నిమ్మరసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా నిగనిగలాడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment