లవ్‌ డాక్టర్‌ న న్నడగొద్దు ప్లీజ్‌ | love doctor ram reddy special council for lovers | Sakshi
Sakshi News home page

లవ్‌ డాక్టర్‌ న న్నడగొద్దు ప్లీజ్‌

Published Tue, Jul 18 2017 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

లవ్‌ డాక్టర్‌  న న్నడగొద్దు ప్లీజ్‌ - Sakshi

లవ్‌ డాక్టర్‌ న న్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! ఒన్‌ ఇయర్‌గా నేను ఒక అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. నాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. ఈ విషయం తనకి కూడా తెలుసు. బట్‌ తను నన్ను పట్టించుకోవడం లేదు. తన ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్‌ కూడా చెప్పి చూశారు. అయినా తను వినలేదు. తనకోసం చాలా సార్లు నా ఆత్మభిమానాన్ని చంపుకున్నా. తనకోసం ఎంత కాలమైనా వెయిట్‌ చేస్తానని చెప్పాను. బట్‌ తను వేస్ట్‌ అంటున్నాడు. తన మనసులో వేరే అమ్మాయి లేదు. ఇంతకుముందు ఒక అమ్మాయిని లవ్‌ చేశాడు. బ్రేకప్‌ అయ్యింది. ఘోరంగా బాధపడ్డాడు. తను లేకుండా నేను ఉండలేను. ఎలా మరిచిపోవాలో అర్థం కావడం లేదు. తనకి ఇంప్రెస్‌ చెయ్యడమంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎలా సార్‌? బనానా జోక్స్‌ వద్దు సార్‌! మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌!! – మాధవి

‘యాపిల్‌ తెమ్మంటారా సార్‌’
 ‘ఏంటి సార్‌ సైలెంట్‌గా ఉన్నారు?’

‘ఎందుకు సార్‌ అంత కోపం  మీ మాధవి సిస్టర్‌ చెప్పింది కదా నో బనానా జోక్స్‌ అని’
వాడు యాపిల్‌. నా చెల్లెలు సింపుల్‌ బనానా. బనానాకి బనానాకి వర్క్‌ అవుట్‌ అవ్వుద్ది కానీ, వాట్‌ ఈజ్‌ దిస్‌ యాపిల్, బనానా స్టోరీ? వాడికి ఇంట్రెస్ట్‌ లేకపోతే మనం గౌరవంగా ఉండాల్సింది పోయి.. అన్నయ్యా... వాడే కావాలి! అంటే... హౌ ఇట్‌ ఈజ్‌ పాజిబుల్‌?
‘మరి ఏం చెయ్యాలి సార్‌ మాధవి?’

ఫుల్‌గా వాడిని ఇగ్నోర్‌ చెయ్యాలి. దెబ్బకు వాడే తోకాడిస్తూ వస్తాడు!!
‘ఆహా.. ఓహో... మీకు పౌరుషం వస్తే మీరు మనిషి కాదు సార్‌!’

‘జోక్‌ సార్‌! ఇదిగో అరటిపండు!!’ అని నవ్వింది నీలాంబరి.
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే
ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement