మన జీవనానికి ఆధారాలు... ఆవాలు
తిండి గోల
ఆవాలు మన ఇంటి పోపుల డబ్బాలో తప్పక ఉంటాయి. తెలుగురాష్ట్రాలలో ఆవపిండి ని నిల్వపచ్చళ్లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకుపోకుండా సహాయపడుతుంటాయి. అందుకే కొంచెం ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తుంటారు. గొంతునొప్పి, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపొడి, తగినంత తేనె వేసి తాగితే సమస్య తగ్గుముఖం పడుతుంది. అరబకెట్ వేడి నీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
తెల్ల ఆవనూనెను శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. ఆవాలు క్రీస్తు పూర్వం నుంచే మన దగ్గర వాడుకలో ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ఇండియాలో క్రీస్తు పూర్వమే ఆవాలు ఉన్నట్టు గౌతమబుద్ధుని కథనాల ద్వారా మనకు తెలుస్తుంది. ఆవాల ఉత్పత్తిలో అగ్రగామిలో ఉన్న దేశాలు కెనడా, హంగేరీ, గ్రేట్ బ్రిటన్, ఇండియా.