కాలాతీత రచన ఇది!
మై ఫేవరెట్ బుక్ -లిటిల్ ఉమెన్
అమెరికన్ రచయిత్రి మే అల్కాట్ రాసిన ‘లిటిల్ ఉమెన్’ నవల గురించి చాలామంది చెప్పగా విన్నాను. అలా నాకు కూడా ఆ పుస్తకం చదవాలనే ఆసక్తి పెరిగింది. పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోగానే బరువు కొంచెం భయపెట్టింది. ‘ఇంత పెద్ద పుస్తకాన్ని నేను చదవగలనా?’ అనుకున్నాను. వాక్యంలో సత్తా ఉంటే కొండలాంటి పుస్తకమైనా త్వరగా పూర్తవుతుందని చెప్పడానికి ఈ పుస్తకమే నిదర్శనం.
ముగ్గురు అక్కచెల్లెళ్ళ జీవితాన్ని గురించి రాసిన నవల ఇది. స్త్రీ జీవితంలోని భిన్నకోణాలను ప్రతిబింబించే పుస్తకం ఇది. రచయిత్రి తన సొంత అనుభవాలకు కాస్త కల్పన జోడించి ఈ నవల రాశారట. ఇది అక్షరాలా టైమ్‌లెస్ క్లాసిక్. ఎలాగోలా... వీలుచేసుకొని ఈ నవల చదవండి.
నవలలో ఒక పాత్ర అయిన ఎమిలీ సంభాషణలు చదువుతున్నప్పుడు ఈ కాలం టీనేజర్ మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ‘డ్యూడ్’ అనే పదాన్ని ఇప్పటి తరం పిల్లలు కూడా ఉపయోగిస్తున్నారు కదా! ఇది యువ పాఠకులను లక్ష్యంగా పెట్టుకొని రాసిన నవల అయినప్పటికీ అన్ని వయసుల వారూ హాయిగా చదువుకోవచ్చు. ఒక క్లాసిక్ అనేది తరాలకు అతీతంగా ఎప్పుడూ తాజాగా ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవడానికి ఈ నవల చదవడం అవసరం.
- దీపికా పదుకొనే, హీరోయిన్