రంగుల తోట
నేచర్‌ని మించిన ఫ్యాషన్ లేదు. పూలతోటను మించిన సెల్ఫ్ డిజైనర్ లేదు. రంగులను ఎలా చిందాలో ఎలా ఎగజిమ్మాలో దానికి తెలుసు. ఫలానా పువ్వును ముందుకు తోసి ఫలానా పువ్వుని మెల్లగా ఉంచి ఫలానా పువ్వును సున్నితమైన సొగసుతో చూపి... రంగులే బ్యూటీ. ఈ వస్త్రాల వరుస కూడా పూల నుంచి ఎంచుకున్నదే. తోట నుంచి ఇన్‌స్పైర్ అయినదే. తరుణ్ తహ్లియానీ రూపుదిద్దిన తరుణీమణుల తాజా ఫ్యాషన్ దుస్తులు ఇవి.
కాంట్రాస్ట్ కలర్స్‌తో చూపుతిప్పుకోనివ్వని విధంగా ఉన్న ఈ లెహంగాను బెనారస్, వెల్వెట్ ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేశారు. పెన్సిల్ షేప్ లెహెంగా, మోకాలు కింది భాగం పెరిగేలా చూశారు. కాంతిమంతమైన రంగులు వాడటంతో ఇట్టే ఆకట్టుకుంటోంది.స్ప్రింగ్ సమ్మర్ 2016 కలెక్షన్‌లో భాగంగా తరుణ్ తహ్లియాన్ని డిజైన్‌చే సిన వస్త్రాలంకరణలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్.
తరుణ్ తహ్లియాని డిజైనరీ దుస్తుల్లో భారతీయ కళలు-సంస్కృతితో పాటు యురోపియన్ చిత్రకళ కూడా కళ్లకు కడుతుంది. సంప్రదాయపు సొగసును చూపిస్తూనే ఆధునికతతో ఆకట్టుకోవడం తహ్లియాని ప్రత్యేకత. నవ వధువు దుస్తుల డిజైనర్‌గా పేరుపొందిన తహ్లియాని దాదాపు పాతికేళ్ల క్రితం ఢిల్లీలో భార్య శైలతో కలిసి మల్టీ డిజైనర్ బొటిక్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మూడేళ్ల కాలంలోనే అంతర్జాతీయంగా ప్రముఖులు ఆకట్టుకునే ప్రసిద్ధ డిజైనర్‌గా ఎదిగారు. సెలబ్రిటీల డిజైనర్‌గా పేరొందిన తరుణ్ తహ్లియాని వివాహ వస్త్రాలను వైభవోపేతంగా తీర్చిదిద్దడంలో ప్రసిద్ధులు.