ఇది సూసైడే | number of suicides in drugs | Sakshi
Sakshi News home page

ఇది సూసైడే

Published Wed, Jul 12 2017 11:19 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

ఇది సూసైడే - Sakshi

ఇది సూసైడే

భారత్‌లో డ్రగ్స్‌ బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. గడిచిన పది సంవత్సరాల్లో 20 వేల మందికి పైనే డ్రగ్స్‌ మత్తులో ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.

డ్రగ్స్‌ అంటూ సాధారణంగా పిలిచే మాదకద్రవ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు గంజాయి, చరస్, హషీష్‌ ఆయిల్, భంగ్, కొకైన్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటివి అందులో కొన్ని. ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో బయటపడ్డవి ఇవే. వీటిల్లో ఒక్కోదానికి మళ్లీ వేర్వేరు మారుపేర్లు ఉన్నాయి. ఉదాహరణకు...

హెరాయిన్‌ మారుపేర్లు : బ్లాక్‌ ట్రా, చివా, నెగ్రా, హార్స్‌.
ఇలాతీసుకుంటారు : ఇంజెక్షన్, ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపుకొని కాల్చడం.
దుష్ప్రభావాలు : శ్వాసకోశవ్యాధులు, చర్మవ్యాధులతో పాటు కోమాలోకి వెళ్లచ్చు. ఎక్కువగా తీసుకుంటే మరణం కూడా.
కొకైన్‌ మారుపేర్లు : స్టఫ్, ఫ్లాకీ, స్నో, కోకా, సోడా.
ఇలా తీసుకుంటారు : ముక్కుతో పీల్చడం, సిగరెట్‌లో నింపి కాల్చడం, వైన్‌లో కలిపి తాగడం (స్పైకింగ్‌).
దుష్ప్రభావాలు : కేంద్రనాడీవ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. అలై్జమర్స్‌ వ్యాధి వచ్చే అవకాశం, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.
గాంజా, చరస్‌ : మాల్‌ అని వ్యవహరిస్తారు. ఈ చెట్టు నుంచి స్రవించే పదార్థం నుంచి చరస్‌ ఉత్పత్తి అవుతుంది.
ఇలా తీసుకుంటారు: ఆకులను సిగరెట్‌లో నింపుకొని కాలుస్తారు. చరస్‌ను నేరుగా తీసుకుంటారు లేదా సిగరెట్‌లో నింపుకొని తాగుతారు.
దుష్ప్రభావాలు : మెదడు, నాడీ వ్యవస్థ దెబ్బతింటాయి.

ఎందుకు తీసుకుంటారు...
డ్రగ్స్‌ తీసుకోవాలనుకునే కోరిక బలంగా ఎందుకు కలుగుతుందో చూద్దాం. సాధారణంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం, తెగింపు, పోరాటపటిమ, పట్టుదల వంటివి పాజిటివ్‌ లక్షణాలు. అవి నాయకత్వ లక్షణాలు. అవి కలిగి ఉన్నవారు తాము మిగతావారికంటే ఉన్నతులమని భావిస్తారు. లీడర్‌లా ఉంటారు. ప్రతి ఒక్కరినీ ఆ లక్షణాలు ఆకర్షిస్తుంటాయి. అయితే అవి స్వాభావికంగా ఉండటమో... లేదంటే వాటిని పెంపొందిచుకోవడమో జరగాలి. అలా పెంపొందించుకోవడం చాలా కష్టమైన పని. ఏళ్ల తరబడి సాధన తర్వాత కూడా సమకూరడం కష్టమే. అయితే ఇవన్నీ ఉన్న భ్రాంతి డ్రగ్స్‌ వల్ల కలుగుతుంది. అంతేకాదు... డ్రగ్స్‌ తీసుకోగానే ఒళ్లంతా తేలికవుతున్నట్లుగా ఫీలవుతారు. హాయిగొలుపుతున్న భ్రాంతికి గురవుతారు. ఆ తర్వాత వారి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చినట్లుగా తెలుస్తుంటుంది.

వాటిలో కొన్ని...
ముప్పును లెక్కచేయకపోవడం, తెంపరితనం కలుగుతంది. పిరికిపిల్లలు తాము ధైర్యవంతులుగా మారినట్లున్న ఈ భావనను వదులుకోవడానికి ఇష్టపడరు. అలాగే ఎంతటి ప్రమాదాన్నైనా తేలిగ్గా తీసుకోవడం, అధిగమించగలమనే అతివిశ్వాసాన్ని కలిగి ఉంటారు. తాము డ్రగ్‌ ప్రభావంలో లేని సమయంలో బేలగా ఉండిపోతారు. అది వారికి ఇష్టం ఉండదు. కాబట్టి పై క్వాలిటీస్‌ను ఎప్పటికీ పొందాలనే ఉద్దేశంతో డ్రగ్స్‌ను కొనసాగిస్తారు. అయితే డ్రగ్స్‌ వల్ల కలిగే ఆ హాయిగొలుపుతున్న భ్రాంతి, ధైర్యపు భావనలు చాలాసేపు కొనసాగాలన్న ఫీలింగ్‌తో మోతాదును పెంచుకుంటూ పోతారు. ఆ క్రమంలో ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది.

ఏయే డ్రగ్స్‌తో ఎలాంటి మార్పులు...
మార్జువానాతో : కళ్లు ఎర్రబారడం, పెద్ద గొంతుతో మాట్లాడటం, నిద్రలోకి జారుకుంటూనే పెద్దగా నవ్వడం, తన పట్ల తనకే ఆసక్తి తగ్గడం, మోటివేషన్‌ తగ్గడం, అకస్మాత్తుగా బరువు పెరగడం/ తగ్గడం.
వేలియం వంటి డ్రగ్స్‌ : కంటిపాప చిన్నగా మారడం, తాగినట్లుగా ప్రవర్తించడం, ఎదుటి వారికి చీదర కలిగేలా ఉండటం, సరైన సమయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, మాట ముద్దగా రావడం, మత్తుగా ఉండటం.

కొకైన్‌ వంటి స్టిమ్యులెంట్స్‌తో...  
కంటిపాప విప్పారడం, అతిచురుగ్గా మారడం, ఏదో తెలియని అతి ఆనందంలో కొట్టుకుపోవడం, త్వరగా కోపం రావడం, యాంగై్జటీ, చాలా కుంగిపోయినట్లుగా ఉండటం, అంతలోనే విపరీతంగా మాట్లాడటం, నిద్ర–తిండి లేకుండా చాలాసేపు గడపగలగడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం, నోరంతా ఎండిపోయినట్లుగా ఉండటం (కొన్ని సార్లు ముక్కు కూడా).

మిగతా కథన వాసన పీల్చే డ్రగ్స్‌ : కళ్లు నీళ్లతో నిండినట్లుగా, గాజుకళ్లలా మారడం, దృష్టి సరిగా నిలపలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఆలోచనలు సరిగా సాగకపోవడం, చొల్లు కారటం, తాగినట్లుగా మారడం, కండరాలపై నియంత్రణ కోల్పోవడం. ఆకలి తీరుతెన్నుల్లో మార్పురావడం, కోపం, యాంగై్జటీ.

ఎల్‌ఎస్‌డీ వంటి హ్యాలూసినోజెన్స్‌ : కంటిపాప విప్పారడం, విచిత్రమైన, ఆ సందర్భానికి పొసగని ప్రవర్తన, తెలియని సంతోషంలో కొట్టుకుపోతున్న భావన, అకస్మాత్తుగా ముంచుకొచ్చే కోపం, మూడ్స్‌ వెంటవెంటనే మారిపోవడం, మాట ముద్దగా రావడం, అయోమయం.

హెరాయిన్‌తో : కంట్లో వెలుగుపడ్డా కంటిపాప పెద్దగా స్పందించకపోవడం, నిద్రవేళల్లో మార్పులు రావడం, విపరీతంగా చెమటలు పట్టడం, దగ్గు వస్తుండటం, ఆకలి తగ్గడం, కండరాలు బిగుసుకుపోతుండటం, మాటిమాటికీ ముక్కుఎగబీల్చడం.

కొన్ని నొప్పి నివారణ మాత్రలు (అనాల్జిసిక్స్‌) కూడా అడిక్షన్‌కు దారి తీస్తాయి. తలనొప్పి లేదా మెడనొప్పి లేదా ఇతర నొప్పులు దీర్ఘకాలం ఉన్నప్పుడు నొప్పినివారణ మందు తీసుకోగానే హాయి అయిన భావన కలుగుతుంది. దాంతో వాటికీ అలవాటయ్యే ప్రమాదం ఉంది. దీన్నే ‘అడిక్షన్‌ ఫర్‌ అనాల్జసిక్స్‌’ అంటారు. దీనికి కారణం ఉంది. నొప్పి తగ్గిన భావనతో పాటు, కాస్తంత మత్తుగా ఉండటం, ఏదో తెలియని ఆనందం, తామే గొప్ప అన్న భ్రాంతి కలుగుతాయి.

చేయకూడనివి...
►డ్రగ్స్‌ అందనివ్వకుండా పారేయడం, దాచేయడం వంటివి చేస్తున్న కొద్దీ, వాటిని పొందడానికి వారు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అది వద్దు.

►శిక్షించడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం, ఉపదేశాలివ్వడం, వాదించడం సరికాదు.

►వారిని చిన్నబుచ్చడం లేదా వారిలో ఆత్మన్యూనత, అపరాధభావనను పెంపొందించడం ద్వారా వారిని డ్రగ్స్‌ అలవాటునుంచి దూరం చేయవచ్చని అనుకోవడం సరికాదు.

►డ్రగ్స్‌ అలవాటు ఉన్నవారి అలవాటు మాన్పించాలంటే కావాల్సింది సపోర్ట్‌. అంటే మేం నీవెంటే ఉన్నామన్న ఫీలింగ్‌ను పెంపొందించడం.

►‘నీ దురలవాటును మానేశాక దాని గురించి మా వద్ద నువ్వు సిగ్గు పడేలా (ఎంబరాస్‌మెంట్‌తో) ప్రవర్తించాల్సి పరిస్థితిని నీకు ఎప్పుడూ కల్పించబోము.

►అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాద’నే నమ్మకం  కలిగించాలి. ఇలాంటి వారికి ఎప్పుడూ ప్రోత్సాహమార్గమే బాగా పనిచేస్తుంది. డీ–అడిక్షన్‌ కార్యక్రమంలో సైకియాట్రిస్టులు చేసే పని ఇదే. దీంతో పాటు దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని మందులు సైతం వారు సూచిస్తారు.
– ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, సైకియాట్రిస్ట్, లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌

డ్రగ్స్‌కు అలవాటైన వారిని గుర్తించడం ఎలా :
►కళ్లల్లో ఎర్రజీరలు. కంటిపాప సాధారణం కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా చిన్నగా అయినట్లుగానో కనిపిస్తుంది.

►ఆకలి, నిద్ర వేళలు, తీరుతెన్నుల్లో మార్పులు. ఎక్కువగా తినడం లేదా ఆకలి మందగించడం. మత్తుగా నిద్రపోవడం లేదా అతిచురుగ్గా నిద్రకు దూరం కావడం.

► వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం.

►మంచి బట్టలు వేసుకోవడం, సామాజికంగా శుభ్రంగా కనపడాలన్న భావన సన్నగిల్లి మురికిగా కనిపిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టిసారించరు.

►ఒంట్లోంచిగానీ లేదా మాట్లాడుతున్నప్పుడుగానీ లేదా బట్టల్లోగాని చిత్రమైన వాసన రావచ్చు.

►ఒళ్లు వణుకుతుండటం, మాట ముద్దముద్దగా రావడం, ఆలోచనలకు చేసే పనికి పొంతన కుదరదు. అంటే తాము స్పందించాలనుకున్నంత వేగంగా కదలలేకపోవడం మెదడుకూ, చేతులకు సమన్వయం కొరవడటం జరుగుతుంది.

డ్రగ్‌ అలవాటైన వారితో డీల్‌ చేసే సమయంలో...
►డ్రగ్స్‌ అలవాటున్నవారి కోసం తగినంత, నాణ్యమైన సమయం వెచ్చించి మాట్లాడమే పరిష్కారం. అంతేగాని వారిని శిక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు.

► అనునయంతో మాత్రమే వారిని మార్చడం సాధ్యం. కాబట్టి ‘డ్రగ్స్‌ తీసుకుంటే అలా చేస్తాం, ఇలా చేస్తాం’ అంటూ వారిని బెదిరించకండి. ‘ఇకపై నువ్వు డ్రగ్స్‌ తీసుకుంటే మేం చస్తాం లేదా ఆత్మహత్య చేసుకుంటాం’ అంటూ ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడకండి.

►డ్రగ్స్‌ వల్ల వచ్చే దుష్పరిణామాల గురించి వారికి నచ్చేవిధంగా, వారిపై ప్రభావం చూపేలా వివరించడమే మంచి మార్గం.

► డ్రగ్స్‌ కారణంగా వారిలో వచ్చే ప్రవర్తనపూర్వకమైన  మార్పులను వాళ్లకే తెలిసేలా చేసి, వారెంత నష్టపోతున్నారో వారి అనుభవంలోకి తేవడం ఒక మార్గం.

►వారు కోల్పోయే ఆత్మగౌరవం, సామాజికంగా వారికి కలుగుతున్న గౌరవభంగం గురించి తెలిసేలా చేయాలి.

అడిక్ట్‌ అయ్యి డ్రగ్స్‌ తీసుకోకపోతే...
►వేగంగా మూడ్స్‌ మారిపోవడం, డిప్రెషన్, యాంగై్జటీ, క్రూరభావనలు పెరగడం, చాలా కోపంగా ప్రవర్తించడం.

►తమను తాము ప్రోత్సహించుకునే మోటివేషన్‌ కొరవడటం.

►రోజువారీ జీవితంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వకపోవడం. డ్రగ్స్‌ తప్ప మరేవీ ఆనందాన్ని ఇవ్వవనే భావన పెరగడం.

►పిచ్చివాడిలా మారిపోవడం, ఉన్మాదంగా ప్రవర్తించడం.

►భ్రాంతులకు, అయోమయానికి లోనుకావడం.

►ఏదో తెలియని భయానికి లోనుకోవడం, అకారణంగా ఆందోళన చెందడం.
http://img.sakshi.net/images/cms/2017-07/61499882582_Unknown.jpg

స్క్రీన్‌ చరస్‌
సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్‌కు దాచేస్తే దాగని అనుబంధం ఉంది. కొందరు డ్రగ్స్‌ వాడి న్యూస్‌లోకి వస్తే కొందరు డ్రగ్స్‌ను కథాంశం చేసుకొని ప్రేక్షకుల దగ్గరకు వచ్చారు. ఇది మొదలు కాదు. అంతమూ కాబోదు. బహుశా రాబోయే రోజుల్లో డ్రగ్స్‌తో ముడిబడ్డ భారతీయ సినిమాను మనం తరచూ చూడబోతున్నాం. డ్రగ్స్‌ అంటే ఏమిటో తెలియని చాలా రోజుల క్రితమే హిందీలో దేవ్‌ ఆనంద్‌ ‘హరే రామా హరే కృష్ణ’ అనే సినిమా తీశాడు. అందులో ‘గంజాయి’ ప్రధాన అంశం. ఆ తర్వాత ధర్మేంద్ర హీరోగా ఏకంగా ‘చరస్‌’ అనే సినిమాయే వచ్చింది. ఫిరోజ్‌ ఖాన్‌ డ్రగ్స్‌ను కథాంశంగా తీసుకొని శ్రీదేవి, డింపుల్‌ కపాడియాలతో ‘జాన్‌బాజ్‌’ తీశాడు. అనురాగ్‌ కశ్యప్‌ ‘దేవ్‌ డి’ నిన్న మొన్నటి షాహిద్‌ కపూర్‌ ‘ఉడ్‌తా పంజాబ్‌’ డ్రగ్స్‌ను సినిమాల్లోకి బలంగా తీసుకొచ్చాయి.

ఇక డ్రగ్స్‌ వాడి వార్తల్లోకి వచ్చిన నటీ నటులు లేకపోలేదు. సంజయ్‌ దత్‌ ఒకప్పుడు డ్రగ్‌ అడిక్ట్‌ అని దాని నుంచి బయటపడి ఇప్పుడు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. డ్రగ్స్‌ మీద సినిమా తీసిన ఫిరోజ్‌ ఖాన్‌ కుమారుడు ఫర్దీన్‌ ఖాన్‌ డ్రగ్స్‌తో 2001లో పట్టుబడ్డాడు. హీరోయిన్స్‌లో మనీషా కోయిరాలా డ్రగ్స్‌ బారిన పడినట్టు వార్తలొచ్చాయి. ఒకప్పటి హీరోయిన్‌ మమతా కులకర్ణి ఏకంగా డ్రగ్స్‌ సప్లయర్‌గా పోలీసుల దృష్టిలోకి వచ్చింది. హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజాన్, షారుక్‌ ఖాన్‌ భార్య గౌరీ ఖాన్‌ డ్రగ్స్‌ బారిన పడుండొచ్చని బాలీవుడ్‌లో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే గౌరి ఖాన్‌ దీనిని ఖండించింది.

తెలుగు నటీనటులు కూడా డ్రగ్స్‌ వాడకంలో ఉన్నట్టు గుసగుసలున్నాయి. చాలా పెద్ద హీరోలు కూడా డ్రగ్స్‌ను ‘టేస్ట్‌’ చేశారని అనుకునేవారున్నారు. ఇక రవితేజ సోదరుడు ఇటీవల మరణించిన భరత్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో ఒకసారి పోలీసులకు పట్టుబడ్డాడు. గ్లామరస్‌గా కనిపించాలంటే డ్రగ్స్‌ వాడాలి అనే అపోహ వల్ల కూడా కొందరు హీరోలు వీటిని పరిమితంగా వాడుతున్నట్టు చాలా కాలంగా ఉన్న ప్రచారం. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేసే నైజీరియన్‌ల డైరీలలో టాలీవుడ్‌ హీరోల పేర్లు ఒకరిద్దరివి అప్పట్లో కనిపించినా పక్కా ఆధారాలు లేక పట్టుకోలేకపోయారు. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో డ్రగ్‌ కల్చర్‌ బాగా విస్తరించింది. ఏది ఏమైనా దొరికే వరకే అందరూ దొరలు. దొరికితే డ్రగ్‌ అడిక్ట్‌లు.

మత్తుమూలాలుhttp://img.sakshi.net/images/cms/2017-07/61499883001_Unknown.jpg
మత్తు పదార్థాల వాడుక చరిత్రపూర్వ యుగం నుంచే ఉండేది. కొత్త రాతియుగం మానవులకు నల్లమందు తెలుసు. బహుశ మనుషులు ఎరిగిన తొలి మాదకద్రవ్యం ఇదే కావచ్చు. మత్తు కలిగించే ఒకరకం పుట్టగొడుగులు (మేజిక్‌ మష్రూమ్స్‌), పొగాకు, గంజాయి, కోకా ఆకులు, మాండ్రేక్‌ చెట్టు వేళ్లు, బ్లూ లోటస్‌ మొక్క ఆకులు వంటి వాటి వాడకం క్రీస్తుపూర్వం నాటి నుంచే ఉండేది. వీటి గురించిన ప్రస్తావనలు పురాణాల్లో, మతగ్రంథాల్లో, ప్రాచీన వైద్యశాస్త్ర గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి. నొప్పిని తగ్గించడం, నిద్ర కలిగించడం, ఇంద్రియాలు మొద్దుబారేట్లు చేయడం వంటి లక్షణాలు ఉండటం వల్ల సహజంగా సుఖాన్ని కోరుకునే మనుషులు ఈ పదార్థాలకు చేరువయ్యారు.గ్రీకు వైద్యుడు గాలెన్‌ తొలిసారిగా ఇలాంటి మత్తు పదార్థాలకు ‘నార్కోటిక్‌’ అని నామకరణం చేశాడు. నల్లమందు కోసం సుమేరియన్లు క్రీస్తుపూర్వం 3400 ప్రాంతంలోనే గసగసాల మొక్కలను విరివిగా సాగుచేసేవారు.

చైనాలోనైతే 19వ శతాబ్దిలో ఏకంగా ‘నల్లమందు యుద్ధాలు’ జరిగాయి. ప్రాచీన ఈజిప్షియన్, గ్రీకు, రోమన్‌ తదితర నాగరకతల కాలంలో గంజాయిని మానసిక ఉత్తేజం కోసం వాడేవారు. మతపరమైన క్రతువుల్లో మద్యంతో పాటు గంజాయి, పొగాకు, నల్లమందులను కూడా విరివిగా వాడేవారు. ప్రాచీన వైద్యులు నొప్పితో బాధపడే రోగులకు ఇలాంటి మత్తు పదార్థాలను ఔషధంగా ఇచ్చేవారు. మతవిశ్వాసులు వీటిని దేవుని వరప్రసాదాలుగా భావించేవారు. మత విశ్వాసాలు ఎలా ఉన్నా, మత్తుపదార్థాల అనర్థాలను కూడా కొందరు ప్రాచీనులు గుర్తించారు. ‘బ్లూ లోటస్‌ మానసిక శక్తులను నిర్వీర్యం చేస్తుంది’ అని ప్రాచీన గ్రీకు కవి హోమర్‌ రాశాడు. అయితే, పంతొమ్మిదివ శతాబ్దిలోను, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలోను చాలామంది ఆధునిక వైద్యులకు ఆ మాత్రం అవగాహన కూడా లేకపోయింది. కృత్రిమంగా తయారయ్యే కొకైన్, హెరాయిన్‌ వంటి మాదకద్రవ్యాలు అందుబాటులోకి వచ్చిన కాలంలో కూడా వీటిని వైద్యులే రకరకాల వ్యాధులకు విరుగుడుగా రోగులకు సూచించేవారు.

సిగరెట్లకు కొందరు పాశ్చాత్య డాక్టర్లే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉండేవారు. హెరాయిన్‌ వ్యాపార ప్రకటనలు అక్కడి పత్రికల్లో విరివిగా కనిపించేవి. మత్తు పదార్థాలను అరికట్టే ప్రయత్నాలు పంతొమ్మిదో శతాబ్దంలోనే మొదలైనా అవి పెద్దగా ఫలితాలనిచ్చిన దాఖలాల్లేవు. ఈ దిశగా గట్టి ప్రయత్నాలు మాత్రం ఇరవయ్యో శతాబ్ది ద్వితీయార్ధంలోనే ప్రారంభమయ్యాయి.

► ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి పైగా డ్రగ్స్‌ బారిన పడుతుంటారని బిజెఎస్‌ వెల్లడించింది. ఇందులో కేవలం సుమారు 45లక్షల మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.

► డ్రగ్స్‌ మనిషి ఆలోచనను పూర్తిగా పాడు చేస్తాయి. మెదడుపై దీని ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మత్తులో పడిపోయి, విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియకుండా డ్రగ్స్‌ తీసుకునే వారు క్రైమ్‌కు పాల్పడుతూ ఉంటారు.   

►రేప్, మర్డర్‌ కేసుల్లో ఎక్కువగా డ్రగ్స్‌ ప్రభావం ఉన్న కేసులే ఉంటున్నాయని ఎన్‌సిఆర్‌బి తెలిపింది. నమోదైన కేసుల్లోనే ఇలా ఉంటే, ఇంకా నమోదు కానివి, డ్రగ్స్‌ భారిన పడి నేరాలకు పాల్పడుతున్న వారి లెక్క చాలా ఎక్కువే ఉండొచ్చని ఈ సంస్థ స్పష్టం చేసింది.

► మనదేశంలో 50వేలకు పైనే నైజీరియన్లు ఉన్నారు. ఇందులో చదువుకోవ డానికి వచ్చిన వారే ఎక్కువ. ఇక లెక్కల్లో లేకుండా, అక్రమంగా చొరబడ్డ వారు ఎందరో. వీరిలో కొందరు డ్రగ్స్‌ను ఉత్తర అమెరికా నుంచి భారతదేశానికి, ఆఫ్రికన్‌ దేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు.

►ఆత్మహత్య చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రగ్స్‌కు ప్రభావితమైన వారేనని బిజెఎస్‌ లెక్కలు. అమెరికాలో ఏటా సగటున 25వేల మంది డ్రగ్స్‌ మత్తులో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యల్లో మొదటి స్థానం ఆఫ్రికన్‌ దేశాలదే
(ఏటా 55,000).

► భారత్‌లో సగటున రోజుకు పది మరణాలు డ్రగ్స్‌ ప్రభావం వల్లనే జరుగుతూ ఉండడం విషాదకరం.

►డ్రగ్స్‌ – క్రైమ్‌లది విడదీయలేని బంధం. డ్రగ్స్‌ తీసుకోవడమన్నదే ఓ పెద్ద నేరమైతే, డ్రగ్స్‌ తీసుకున్నాక ఆయా వ్యక్తులు పాల్పడే నేరాలకు ఇక లెక్కే లేదు.

► మహారాష్ట్రలో డ్రగ్స్‌ వల్ల జరుగుతున్న నేరాలు అత్యధికంగా ఉన్నాయి. వాణిజ్య రాజధాని అయిన ముంబై కేంద్రంగా డ్రగ్స్‌ రాకెట్స్‌ పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.

డ్రగ్స్‌ క్రైమ్స్‌ ప్రధానంగా మూడు రకాలు
1. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేయడం, తయారీ.
2. డ్రగ్స్‌ తీసుకొని మత్తులో పడి చేసే నేరాలు.
3. డ్రగ్స్‌ లైఫ్‌స్టైల్‌ను వ్యాప్తి చేయడం.

► మహారాష్ట్రతో పాటు హర్యానా, మిజోరం, త్రిపుర, తెలంగాణ, పంజాబ్‌ లాంటి రాష్ట్రాల్లో డ్రగ్స్‌ సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో చెబుతోంది.

► డ్రగ్స్‌ మత్తులో జరిగే నేరాలను చూస్తే, ఆత్మహత్య, హత్య, అత్యాచారం,  దొంగతనం లాంటివి ఎన్నో కనిపిస్తాయి.

► ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 లక్షల మందికి పైగా డ్రగ్స్‌ బారిన పడుతుంటారని బిజెఎస్‌ వెల్లడించింది. ఇందులో కేవలం సుమారు 45లక్షల మంది మాత్రమే పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.

► డ్రగ్స్‌ మనిషి ఆలోచనను పూర్తిగా పాడు చేస్తాయి. మెదడుపై దీని ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. మత్తులో పడిపోయి, విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియకుండా డ్రగ్స్‌ తీసుకునే వారు క్రైమ్‌కు పాల్పడుతూ ఉంటారు.   

► రేప్, మర్డర్‌ కేసుల్లో ఎక్కువగా డ్రగ్స్‌ ప్రభావం ఉన్న కేసులే ఉంటున్నాయని ఎన్‌సిఆర్‌బి తెలిపింది. నమోదైన కేసుల్లోనే ఇలా ఉంటే, ఇంకా నమోదు కానివి, డ్రగ్స్‌ భారిన పడి నేరాలకు పాల్పడుతున్న వారి లెక్క చాలా ఎక్కువే ఉండొచ్చని ఈ సంస్థ స్పష్టం చేసింది.

►మనదేశంలో 50వేలకు పైనే నైజీరియన్లు ఉన్నారు. ఇందులో చదువుకోవ డానికి వచ్చిన వారే ఎక్కువ. ఇక లెక్కల్లో లేకుండా, అక్రమంగా చొరబడ్డ వారు ఎందరో. వీరిలో కొందరు డ్రగ్స్‌ను ఉత్తర అమెరికా నుంచి భారతదేశానికి, ఆఫ్రికన్‌ దేశాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు.

► ఆత్మహత్య చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు డ్రగ్స్‌కు ప్రభావితమైన వారేనని బిజెఎస్‌ లెక్కలు. అమెరికాలో ఏటా సగటున 25వేల మంది డ్రగ్స్‌ మత్తులో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యల్లో మొదటి స్థానం ఆఫ్రికన్‌ దేశాలదే
(ఏటా 55,000).

చదవండి (ఇది సూసైడ్ కాదు)

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement