పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్ | Puri Jagannath director Hunt | Sakshi
Sakshi News home page

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్

Published Fri, Jan 2 2015 11:17 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్ - Sakshi

పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్

స్టోరీ: పూరి
డెరైక్షన్: మీరే!!
 
10 డేస్...
10 స్టోరీ ఐడియాస్
10 స్టోరీ ఐడియాస్
 
నిన్న మొదటి కథ చెప్పా. ఇవాళ రెండో కథ. ఇలా మొత్తం పది కథలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్‌తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
 
ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి.  మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!
 
నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmailకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డెరైక్టర్‌ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్‌లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్‌పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
 
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే ... నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో!
 
అయితే కొన్ని కండిషన్స్...  చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు  ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా..  లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి.


 గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.
 - పూరి జగన్నాథ్

బహుమతులు అందించేవారు... 'ఉమెన్స్ వరల్డ్'

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement