పిల్లలపై ఒక కన్నేసే హీరోజీపీఎస్!
ఇంటి ఆవరణలో, స్నేహితులతో ఆడుకొనే పిల్లల విషయంలో తల్లిదండ్రుల ఆందోళనను తగ్గిస్తుంది హీరోజీపీఎస్ వాచ్. దీన్ని పిల్లల చేతికి ట్యాగ్ చేస్తే చాలు.. వారు ఎక్కడుండేదీ ఇట్టే తెలిసిపోతుంది. ఈ జీపీఎస్ వాచ్‌లు వారెక్కడున్నారనే విషయాన్ని తెలియజేస్తాయి. స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబెట్‌తో ఈ వాచ్‌లు పెయిరప్ అవుతాయి.
ఆండ్రాయిడ్, ఐ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు అనువుగా ప్రత్యేకమైన వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. కేవలం పిల్లలు ఎక్కడున్నారే విషయం గురించి చెప్పడమే కాదు... పిల్లలు వరసగా ఐదు సార్లు చేతిని షేక్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌కు అలర్ట్ కూడా వస్తుంది. దీని ధర దాదాపు 150 డాలర్లు.