మీ నిద్రే... మీకు ఒక మెడికల్ టెస్ట్!
మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి. మీ నిద్రే ఒక వైద్యపరీక్షగా మారి మిమ్మల్ని డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందిగా నిశ్శబ్దంగా ఆదేశిస్తుందేమో పరిశీలించుకోండి.
ప్ర: నిద్రలో గుండెల్లో మంటగా ఉందా?...
జ: అది జీఈఆర్‌డీ లేదా బ్యారెట్స్ సిండ్రోమ్ కావచ్చు.
నిద్రపోతూ ఉండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసిందా? గుండెలో మంటగా, ఛాతీలో ఇబ్బందిగా ఉంటే అది బ్యారెట్స్ సిండ్రోమ్ అయ్యే అవకాశం ఉంది. మన సమాజంలో దాదాపు 45 శాతం మందిలో ఈ లక్షణం ఏదో ఒక సమయంలో కనిపిస్తుంది. అయితే నిద్రలో కనిపించినప్పుడు వాళ్ల ఆందోళన అధికమవుతుంది. ఛాతీలో మంటతో పాటు చెమట పట్టడం, ఎడమ భుజం/చేతిలో నొప్పి వంటి లక్షణాలు లేకపోతే అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ లక్షణం దీర్ఘకాలం కనిపిస్తుంటే డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. చాలామంది దీన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. తొలిదశల్లో అయితే ఇది కడుపులోని గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఉండే దశగా భావించవచ్చు. అయితే కొన్నిసార్లు ఈసోఫేగస్‌లో కింద ఉండే కణాలు మార్పు చెందడం వల్ల వచ్చే కాలమ్నార్ ఎపిథీలియమ్ లైన్‌డ్ లోయర్ ఈసోఫేగస్ అనే కండిషన్ వల్ల కావచ్చు.
సాధారణంగా అక్కడ ఉండే కణ నిర్మాణానికి బదులు పైన పేర్కొన్న కాలమ్నార్ కణాలుగా కణాలు మార్పులు చెందితే దాన్ని బ్యారట్స్ సిండ్రోమ్‌గా పేర్కొనవచ్చు. అది గ్యాస్‌ను పైకి ఎగజిమ్మే సాధారణ జీఈఆర్‌డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సిండ్రోమ్) అయితే పర్వాలేదు. ఒకవేళ అది బ్యారెట్స్ సిండ్రోమ్‌గా మార్పు చెందుతుంటే మాత్రం తక్షణం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. గ్యాస్ ఎక్కువగా కనిపిస్తుంటే మాత్రం తొలి దశలో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గ్యాస్/జీఈఆర్‌డీ సమస్యను అధిగమించవచ్చు.
ప్ర: నిద్రలో పళ్లు కొరుకుతున్నారా?
జ: అది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు.
త నిద్రలో పళ్లు కొరకడమనే ఈ లక్షణం ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంటుంది. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సవుస్య ఉండవచ్చు. దీన్నే బ్రక్సిజం అంటారు. పిల్లల్లో ఇది సర్వసాధారణం. పిల్లల్లోనైతే ఇది మొదటి ఐదేళ్లలో మొదలయ్యే సమస్య. పిల్లల్లో సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వం ఉన్నప్పుడు ఇలా పళ్లు కొరకడం ద్వారా వ్యక్తమయ్యే బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక పెద్దలలోనైతే తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల ఇది కనిపిస్తుంది. పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతూ ఉంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి.
నిద్రకు ఉపక్రమించే వుుందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయుత్నించాలి. వారి వునసుల్లో ఉన్న భయూలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, చాక్లెట్లు వంటివి వారికి పెట్టకూడదు. సవుస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే వత్ గార్డ్స్, వత్‌పీసెస్ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సవుస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్) సవుస్యలు - వూల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు పడిపోవడం, దడవ ఎవుుక జారుుంట్ (టెంపోరో వూండిబులార్ జారుుంట్) సవుస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో డెంటల్ సర్జన్‌ను కలవాల్సి ఉంటుంది. ఇక పెద్దల్లోనైతే మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు అవసరమైన ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌ల వంటివి చేయడం మంచిది.
ప్ర: నిద్రలో గురక ఎక్కువగా వినిపిస్తోందా?
జ: స్లీప్ ఆప్నియా కావచ్చు. అదలా కొనసాగడం ప్రమాదకరమూ కావచ్చు.
మనకు కొద్దిసేపు శ్వాస ఆడకపోయినా, మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. శ్వాసకు అంతరాయం కలిగించే ఈ సమస్యను వైద్యపరిభాషలో అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ అంటారు. గురక పెట్టే సమయంలో శ్వాసనాళంలో కలిగే అంతరాయం వల్ల ఇది ఎక్కువగా సంభవిస్తుంది.
మనం నిద్రపోయినప్పుడు మన గొంతు కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది చాలామందిలో శ్వాసకు అవరోధం కాదు. కొందరిలో వేలాడబడినట్లుగా (ఫ్లాపీ) అయి, శ్వాసనాళం కుంచించుకుపోయినట్లుగా అవుతుంది. కొందరిలో పూర్తిగా మూసుకుపోతుంది. ఇలా శ్వాసనాళం కుంచించుకుపోవడం వల్ల మొదట గొంతు నుంచి శబ్దం వస్తుంది. అదే గురక. శ్వాసనాళం పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి ఒక్కోసారి 10 సెకండ్లకు పైగా ఉండవచ్చు. అలాంటి పరిస్థితిని మెదడు పసిగట్టి నిద్రలేచేలా ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు మేల్కొని తగినంత శ్వాస తీసుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంటాం. శ్వాస అందని ఆప్నియా స్థితి నిద్రలో అనేకసార్లు వస్తుంది. దాంతో రాత్రివేళల్లో అనేకసార్లు నిద్రాభంగం కలుగుతుంది.
అందువల్ల పగటి వేళ మందకొడిగా ఉంటుంది. రాత్రుళ్లు గురకపెడుతూ, పగటివేళల్లో మాటిమాటికీ నిద్రలోకి జారిపోతూ ఉంటే ఆప్నియా ఉన్నట్లు స్పష్టంగా గుర్తించవచ్చు. ఒక్కోసారి స్లీప్ ఆప్నియా ఎంతో ప్రమాదకరంగా పరిణమించవచ్చు. రక్తంలో ఉండాల్సిన ఆక్సిజన్ పాళ్లు తగ్గి, మెదడుకు అవసరమైన మోతాదులో ప్రాణవాయువు అందకపోవడం వల్ల గుండె స్పందనల్లో మార్పులు రావడం, రక్తపోటు పెరగడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. గుండెజబ్బులు ఉన్నవారికైతే ఇలా రక్తపోటు పెరగడం గుండెపోటు లేదా యాంజినాకు దారితీయవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. నిద్రకు ముందు ఆల్కహాల్‌ను తీసుకోకూడదు. ధూమపానాన్ని, నిద్రమాత్రలు వాడే అలవాటును మానేయాలి.
ప్ర: రాత్రుళ్లు నిద్రలో తీవ్రంగా చెమటలు పడుతున్నాయా?
జ: అది క్షయ (ట్యూబర్క్యులోసిస్) కావచ్చు.
సాధారణంగా క్షయవ్యాధి (ట్యూబర్క్యులోసిస్) ఉన్నవారి శరీర ఉష్ణోగ్రత ఉదయం వేళలతో పోలిస్తే... సాయంత్రం నుంచి రాత్రివేళల్లో మరింతగా పెరుగుతుంటుంది. ఒక్కోసారి శరీర ఉష్ణోగ్రత ఎంతగా పెరుగుతుందంటే, రాత్రివేళల్లో తీవ్రంగా చెమటలు పట్టి, పక్కబట్టలు కూడా తడిసి, వాటిని మార్చాల్సినంత ఎక్కువగా ఉండవచ్చు. క్షయవ్యాధి మైకోబ్యాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇది ఊపిరితిత్తులతో పాటు మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, యుటెరస్, పేగులు, కాలేయం వంటి కీలక అవయవాలనూ ప్రభావితం చేస్తుంది. కొన్నిరోజులు మందులు వాడగానే రోగ లక్షణాలు తగ్గడంతో మందులు మానేస్తుంటారు. దాంతో మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ’ కేసులు ఎక్కువ.
టీబీని పూర్తిగా నయం చేయడానికి క్రమం తప్పకుండా పూర్తిగా వైద్యపర్యవేక్షణలో మందులు వాడటం అత్యవసరం. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో డాట్స్ (డెరైక్ట్‌లీ అబ్‌జర్వ్‌డ్ థెరపీ షార్ట్ కోర్స్) చికిత్స కార్యక్రమం కింద కార్యకర్తల ఆధ్వర్యంలో రోగి క్రమం తప్పకుండా మందులు తీసుకునేలా చూస్తున్నారు. అలాగే మందుల వల్ల వస్తున్న దుష్ర్పభావాలు (సైడ్‌ఎఫెక్ట్స్) వంటి వాటిని (ఉదాహరణకు... చర్మంపై ర్యాషెస్, అసిడిటీ, కాలేయం స్రవించే ఎంజైముల పెరుగుదల, చూపుతగ్గడం, వినికిడి శక్తిలో మార్పులు, మూత్రపిండాల పనితీరులో మార్పుల వంటివి) కూడా పరీక్షించి దానికి అనుగుణంగా మందులను, వాటి మోతాదులను నిర్ణయించాల్సి ఉంటుంది.
ప్ర: నిద్రలో కాళ్లకండరాలు అకస్మాత్తుగా పట్టేసి నొప్పితో విలవిలలాడుతుంటే?
జ: సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తగుపాళ్లలో ద్రవాలు (హైడ్రేషన్) సమకూరకపోవడం కారణాలు కావచ్చు.
రాత్రి నిద్రలో కాళ్ల కండరాలు, పిక్కలు పట్టేసి, ఒకపట్టాన వదలకుండా చాలాసేపు బాధిస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారంలో పొటాషియమ్, మెగ్నీషియమ్ మరియు విటమిన్ల లోపం వల్ల, లవణాలు, తగినంత ద్రవాలు లేకుండా ఉన్నాయని అర్థం. అంటే మనం అన్ని పోషకాలు లభించేలా సమతులాహారం తీసుకోవడం లేదని పరిగణించాల్సి ఉంటుంది. ఇదేమీ ప్రమాదకరమైన పరిణామం కాదు. దీనివల్ల కండరాలు పనిచేయడానికి అవసరమైన పాళ్లలో మెగ్నీషియమ్ లభించడం లేదని భావించి, అది పుష్కలంగా లభించే గుమ్మడి గింజలు, చేపలు, ఆకుపచ్చటి రంగులో ఉండే ఆకుకూరల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పొటాషియమ్ అన్నది అరటిపండ్లలో, కొబ్బరినీళ్లలో ఎక్కువ. దీనికి తోడు తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లతో పాటు ద్రవాహారం లేదా కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకుంటుంటే ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది.
-నిర్వహణ: యాసీన్
రాత్రుళ్లు ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా?
డయాబెటిస్... లేదా పురుషుల్లోనైతే ప్రోస్టేట్ సమస్య కావచ్చు.
రాత్రివేళల్లో చాలాసార్లు నిద్రలేచి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే బహుశా అది చక్కెర వ్యాధి /డయాబెటిస్ లక్షణం కావచ్చేమోనని అనుమానించాలి. చక్కెర వ్యాధిలో రక్తంలోని చక్కెర పాళ్లు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. దాంతో రక్తంలోని ఈ ఎక్కువైన చక్కెరను బయటకు పంపించేందుకు మూత్రపిండాలు ఎక్కువగా మూత్రవిసర్జన చేసి, ఎక్కువైన చక్కెరను మూత్రం ద్వారా విసర్జించడానికి ప్రయత్నిస్తాయి. అందుకే అలా ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఇక కొందరిలోనైతే ఇలా మూత్రం వచ్చినట్లు అనిపిస్తూ, అది ధారగా కాకుండా చుక్కలు చుక్కలుగా పడుతుండటం, వారి వయసు యాభై దాటి ఉండటం తటస్థిస్తే వారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు కూడా అయి ఉండవచ్చు.
ఈ లక్షణం పిల్లల్లో ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే అంతకుముందు చాలా రోజులు పక్క తడపకుండా ఉండి, ఆ తర్వాత పక్క తడుపుతుంటే, అది టైప్-1 డయాబెటిస్‌కు గాని లేదా తీవ్రమైన మానసిక వేదనకు గాని చిహ్నం అయ్యేందుకు అవకాశం ఉంది.
పెద్దల్లో సమస్య టైప్-2 డయాబెటిస్ అయితే క్రమం తప్పకుండా చక్కెరపాళ్లను పరీక్షించుకుంటూ... నిత్యం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ వారు సూచించిన... చక్కెర నియంత్రణ మందులు క్రమం తప్పక వాడుతుండాలి. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథి వాపు అయితే డాక్టర్ సలహా మేరకు మొదట వుందులు వాడి, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎండోస్కోపీ ద్వారా టీయుూఆర్‌పీ అనే శస్త్రచికిత్స చికిత్స చేయించాల్సి వస్తుంది. ఒకవేళ పిల్లల్లోనైతే తప్పక డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవాలి.
-డాక్టర్ సి.హేమంత్
సీనియర్ జనరల్ ఫిజీషియన్,
యశోదా హాస్పిటల్స్,
సోమాజిగూడ, హైదరాబాద్.