ఆ ‘బంధం’ అవసరం
సర్వే
పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం ఉండడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు బంగారంలా ఉంటుందంటున్నారు కెనడాకు చెందిన సర్వేమంకీ సంస్థవారు. కేజి నుంచి ఇంటర్ వరకూ చదువుతున్న విద్యార్థులపై వారు చేసిన పరిశోధనలో తేలిన విషయమేమిటంటే...విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల చదువుతో, ఉపాధ్యాయులతో, పాఠశాలతో అనుబంధం ఏర్పరుచుకోవడం వల్ల విద్యార్థుల ఆలోచన విధానం మెరుగ్గా ఉంటుందన్నది వారి అభిప్రాయం.
వెయ్యి పాఠశాలల్లో చేసిన ఈ సర్వేలో పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సర్వే సారాంశాన్ని ప్రతి ఒక్క పాఠశాల వారూ అర్థం చేసుకుని విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు రప్పించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని హితవు పలికింది సర్వేమంకీ సంస్థ. దీని వల్ల వారికి పాఠశాలతో ఏర్పడే బంధం విద్యార్థి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందని చెబుతున్నారు.