
ఆవిష్కరణ
ఏప్రిల్ 23 గురువారం సాయంత్రం 6 గం.లకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో మనసు ఫౌండేషన్ ప్రచురణ- శ్రీపాద సర్వలభ్య రచనల సంకలనం ఆవిష్కరణ. కేతు విశ్వనాథరెడ్డి, కాళీపట్నం రామారావు, పోరంకి దక్షిణామూర్తి, మృణాళిని, వివినమూర్తి తదితరులు పాల్గొం టారు. శ్రీపాద మనవడు వై.గోపాలకృష్ణ ప్రత్యేక అతిథి.
‘ఆంధ్రజాతికి ఆత్మగౌరవమూ, ఆత్మవిశ్వాసమూ ఇంకా గుర్తుకి రాలేదు. అప్పటికి కాదు, ఇప్పటికి కూడా సారస్వత నిర్మాతలకు ఆంధ్రదేశంలో స్వతంత్ర జీవనమార్గాలు ఏర్పడనే లేదు. మనవాళ్లు ఇప్పుడిప్పుడు కొందరు రచయితల విశిష్టత గుర్తించి ఆదరించడం నేర్చుకుంటున్నారు. ఆదరించడం అంటే మెడలో ఒక పూలదండ వెయ్యడం, కొన్నిచోట్ల వొక ఖద్దరు దుప్పటి భుజాల మీద కప్పడం ఇంతే.
అంతేగానీ ఆ రచయితలు నౌకరీ చేసి పొట్ట పోసుకుంటున్నారో అదీ చేతగాక పస్తే ఉంటున్నారో యెవరూ యోచించడం లేదు. కొందరి రచనలు ఆనందం కలిగిస్తున్నాయనుకుంటున్నారేగాని అలాంటి పుస్తకాలతోనే సాహిత్యం ఉన్నతి పొందుతుందనీ ఉన్నత సాహిత్యం సంపాదించుకున్న జాతే స్వేచ్ఛా ఆనందాలను అనుభవించగలుగుతుందనిన్నీ వారు గుర్తించడం లేదు. అయితే సుగంధపుష్పాలు ఆస్వాదించేవారి కోసం యెదురుచూడవు. కీకారణ్యాలలో, ముళ్లడొంకల్లో కూడా అవి పుడుతూనే ఉంటాయి. అది సృష్టి రహస్యం. ప్రకృతం’
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి