ఇదీ... ఇన్‌స్టాగ్రమ్! | This is instagram! | Sakshi
Sakshi News home page

ఇదీ... ఇన్‌స్టాగ్రమ్!

Published Tue, Jan 6 2015 11:49 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఇదీ... ఇన్‌స్టాగ్రమ్! - Sakshi

ఇదీ... ఇన్‌స్టాగ్రమ్!

ఫేస్‌బుక్, వాట్స్‌యాప్‌లు విరివిగా వాడేస్తున్నారు... లైన్, వైబర్లలో ముచ్చట్లు మొదలవుతున్నాయి. ఈ హడావుడిలో ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతున్న మరో సోషల్‌నెట్ వర్కింగ్ సేవ ‘ఇన్‌స్టాగ్రమ్’. ఇప్పటికే ప్రముఖులు వాడేస్తుండటంతో దీనికి ఉచితంగా పబ్లిసిటీ కూడా దక్కుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర నుంచి అనేక మంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రమ్ యూజర్లే. మరి ఇందులో ఏముంది? దీని ప్రత్యేకత ఏంటి... అత్యంత విస్తృతంగా వినియోగదారుల సంఖ్య పెరుగుతున్న ఇన్‌స్టాగ్రమ్ సేవల గురించి...
 
ఫొటో షేరింగ్... ఇన్‌స్టాగ్రమ్ ఆత్మ. మరి ఫేస్‌బుక్‌లోనూ, వాట్స్‌యాప్‌లోనూ ఫొటోలనూ షేర్ చేయవచ్చు కదా.. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రమ్ ఎందుకు... అనే సందేహం వస్తే, ఇన్‌స్టాగ్రమ్‌లోకి లాగిన్ అయితే తేడా అర్థం అవుతుంది.
 
ఎలా లాగిన్ కావాలి?


చేతిలో ఐ ఫోన్ ఉన్నా, ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఐస్టోర్, ప్లేస్టోర్ల నుంచి ఇన్‌స్టాగ్రమ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒక యూజర్ నేమ్ పెట్టుకోవడం, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం సులభమే.
 
ఫేస్‌బుక్, ట్విటర్‌లకు ఒకే కీ ఇది!

 
ఏవైనా ఫొటోలను సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లు ఫేస్‌బుక్, ట్విటర్ ల ద్వారా ఒకే సారి షేర్ చేసేయవచ్చు ఇన్‌స్టాగ్రమ్ ద్వారా. ఇన్‌స్టాగ్రమ్‌లోకి అప్‌లోడ్ చేస్తే చాలు అవే ఫోటోలు ట్విటర్, ఫేస్‌బుక్ అకౌంట్లలోకి కూడా అప్‌లోడ్ అవుతాయి! దాంతో పాటు ఇన్‌స్టాగ్రమ్‌లోని స్నేహితులకు కూడా షేర్ కావడం బోనస్. ఇలా ఒకేసారి విభిన్నమైన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి షేర్ కావడానికి అవకాశం ఇవ్వడంతో ఇన్‌స్టాగ్రమ్ ఆదరణకు నోచుకొంటోంది. ఫేస్‌బుక్, ట్విటర్లలోకి మాత్రమే కాకుండా టంబ్లర్ వంటి బ్లాగ్‌సైట్‌లోకి, ఇంకా ఫ్లికర్, ఫోర్‌స్క్వయర్ వంటి సైట్లలోకి కూడా ఇన్‌స్టాగ్రమ్ నుంచి ఫోటోలను షేర్ చేయవచ్చు. ఇదే విధంగా వీడియోలను కూడా.
 
సూపర్ ఫ్రేమింగ్..!

 తాము దిగిన ఫొటోలను, సెల్ఫీలను ఇన్‌స్టాగ్రమ్ ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు సెలబ్రిటీలంతా. అందుకు అత్యున్నత ఈ సైట్ అందించే నాణ్యతే కారణం. ‘ఫిల్టర్స్’ అని పిలిచే ఫొటో ఫ్రేమ్ టెక్నిక్స్ ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఫొటోకు ఒక రిచ్‌లుక్ అందిస్తుంది ఇన్‌స్టాగ్రమ్. సాధారణంగా అందుబాటులో ఉండే ఫొటో ఎడిటింగ్ టెక్నిక్స్‌తో పోల్చలేనంత అందంగా ఉంటుంది ఇన్‌స్టాగ్రమ్ ఫ్రేమింగ్. అప్‌లోడ్ చేయదలచిన ఫొటోలను నచ్చిన  ఫిల్టర్లలో సెట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి అందరి ఛాయిస్ ఇన్‌స్టాగ్రమ్ అవుతోంది.

ప్రస్తుతానికి అయితే సెలబ్రిటీలదే!

 వినియోగదారుల విషయానికి వస్తే ఈ సేవ వినియోగదారుల్లో సెలబ్రిటీలే ముందున్నారు. ట్విటర్, ఫేస్‌బుక్‌లకు అనుసంధానం చేసి ఇన్‌స్టాగ్రమ్‌లో ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు వారంతా. అయితే వారు అప్‌లోడ్ చేసే ఫోటోలను చూడానికి ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ అవసరంలేదు. కాబట్టి ఈ సైట్‌లో అకౌంట్ల సంఖ్య అమాంతం పెరగడం లేదు. అయితే తమ ఫొటోలను సోషల్‌నెట్‌వర్కింగ్‌సైట్లలో  ప్రెజెంట్ చేసుకోవాలనుకొనే వారికి మాత్రం ఇన్‌స్టాగ్రమ్ చక్కటి మార్గం.

ఇక్కడా స్నేహితులను చేసుకోవచ్చు...

ఎలాగూ ఫేస్‌బుక్, ట్విటర్‌లతో అనుసంధానం అయి ఉండే సేవే కాబట్టి.. ఆయా సైట్‌లలో స్నేహితులందరినీ ఇక్కడా యాడ్ చేసుకోవచ్చు. వారితో టచ్‌లో ఉండవచ్చు. వాళ్లనే కాకుండా ‘ఫాలో’ కావడం ద్వారా ప్రముఖుల ఫోటోలను అందుకోవడంతోపాటు, కొత్తస్నేహాలనూ పెంపొందించుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement