రికార్డును ఎత్తి కుదేసింది
తిక్క లెక్క
రికార్డును ఎవరైనా బద్దలు కొడతారు గానీ, ఎత్తి కుదేస్తారేంటి అనుకుంటున్నారా..? ఈ ఫొటోలో కనిపిస్తున్న పోలిష్ భామ మాత్రం అక్షరాలా మనుషులను ఎత్తి కుదేసింది. ఈమె పేరు అనేటా ఫ్లోర్జిక్. అతి తక్కువ వ్యవధిలోనే మనుషులను ఇలా ఎత్తి కుదేయడం ద్వారా ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ ప్రదర్శనలో ఈమె ఏకంగా పన్నెండు మంది మనుషులను కేవలం రెండు నిమిషాల్లోనే ఎత్తి కుదేసింది. ఇలాంటి ఘనకార్యాలు చేస్తే రికార్డులు బద్దలుకాకుండా ఉంటాయా?