నా పేరు ప్రతిష్టలు వాళ్లు చూడలేదు! | Yaddanapudi Sulochana Rani Stories | Sakshi
Sakshi News home page

నా పేరు ప్రతిష్టలు వాళ్లు చూడలేదు!

Published Wed, May 30 2018 1:34 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Yaddanapudi Sulochana Rani Stories - Sakshi

కథ పేరు, నా పేరు మళ్ళీ మళ్ళీ చూసుకుని ముద్దుపెట్టుకున్నాను. ఎన్నిసార్లు చూసినా తనివి తీరలేదు.. తర్వాత తీసుకెళ్ళి నా పుస్తకాల అరలో పుస్తకాల మధ్య ఉన్న సరస్వతీదేవి ఫొటో దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను.

ఆ ఫొటో మా అమ్మ పూజ పీఠం దగ్గర అన్ని దేవుళ్ళతో కలిసి ఉండేది. నేను 6వ తరగతి చదివేటప్పుడు తీసుకొచ్చి నా పుస్తకాల దగ్గర పెట్టుకున్నాను. రోజూ దొడ్లో విరబూసిన గరుడవర్ధనం, వాటి మధ్య ఎర్రటి కాశీరత్నం పూలు కలిపి దండ అందంగా గుచ్చి ఫొటోకి వేసు కునేదాన్ని.

కథ పడిందన్న ఆనందంతో నా పాదాలు గాలిలో తేలిపోతున్నట్టు ఉంది. నాకు ఇంగ్లీష్‌ వ్రాయటం, చదవటం బాగా వచ్చు! నాన్న నన్ను చూసి ముచ్చట పడేవారు! లైబ్రరీ నుంచి ఇంగ్లీష్‌ పుస్తకాలు తెచ్చి చదు వుకోమని ప్రోత్సహించేవారు.. నాన్న, అన్నయ్యలు నన్ను గారాబంగా చూడటంవల్ల ఇంట్లో కుటుంబసభ్యులు అందరు అభిమానంగా చూసే వారు.. ఇప్పుడు ఈ ఆంధ్రపత్రికలో ఈ కథ పడటంతో ఇంట్లో నాకు మరీ ప్రత్యేకత వచ్చింది. నా విలువ బాగా పెరిగి పోయింది. నేను కుటుంబసభ్యుల మధ్య స్టార్‌ని అయిపోయాను.

ఈ ఉత్సాహంలో ఇంకో కథ వ్రాయాలని ఆలోచించసాగాను.

మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది. అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచురణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీ ఆర్డర్‌ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయింది...

ఆ రోజు మధ్యాహ్నం నాన్న భోజనం చేసి నిద్రపోతున్నారు. ఆయన నిద్రపోతుంటే ఇల్లు అంతా నిశ్శబ్దంగా ఉండాల్సిందే. చిన్న చప్పుడు చేయకూడదు. మాటలు కూడా మేము రహస్యంగా మాటా డుకునేవాళ్ళం. నేను కూడా పడుకున్నాను. ఇంతలో వాకిట్లోంచి బిగ్గరగా ‘‘ఈ ఇంట్లో యద్దనపూడి సులోచనారాణి ఎవరండీ?’’ అని పోస్ట్‌మ్యాన్‌ అరవటం వినిపించింది. ఎవ్వరం పట్టించుకోలేదు. అతను మళ్ళీ బిగ్గ రగా కేక పెట్టాడు.

అందరూ లేచారు. సత్యం సడెన్‌గా నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు.

‘‘పిన్నీ నువ్వే నువ్వే! తొందరగా రా!!’’ అని నా చేయిపట్టి లాగాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. అది నా పేరే!

రెండేళ్ళ క్రింద పెళ్ళైంది కాబట్టి నా ఇంటి పేరు ముందు యద్దనపూడి అని వచ్చింది. వరండాలో ఉన్న పోస్ట్‌మ్యాన్‌ దగ్గరికి పరిగెత్తాము. 
సత్యం : ‘‘ఇదిగో మా పిన్ని!’’ 
పోస్ట్‌మ్యాన్‌ నమ్మలేదు.. ‘‘ఈ అమ్మాయిగారా?’’ అన్నాడు.
‘‘అవును నేనే. నాకేదైనా ఉత్తరం ఉందా?’’ అని అడిగాను. 
‘‘అమ్మాయిగారూ, మీకు మనీఆర్డర్‌ ఉందండి!’’ అన్నాడు.
సత్యం, నేను అయోమయంగా మొహాలు చూస్కున్నాం.. 
‘‘ఎక్కడిది, ఎంత డబ్బు?’’ వాడు ఆత్రంగా అడిగాడు.. 
‘‘ఆంధ్రపత్రిక నుంచి.. 15 రూపాయలు అమ్మాయిగారూ!’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్‌. ‘‘ఇదిగోండి, ఇక్కడ సంతకం పెట్టండి!’’ అని ఫారం ఇచ్చాడు. వేలుతో చూపించాడు.. ‘‘యద్దనపూడి సులోచనారాణి’’ అని చేసిన

నా తొలి సంతకం అది! 
ఇంతలో అందరూ అక్కడికి వచ్చారు! ఆ డబ్బు తీస్కుంటుంటే నా కళ్ళు ఆశ్చర్యంతో పత్తికాయలు అయినాయి. అది ఆనందమో, ఆశ్చ ర్యమో, లేక మరో అద్భుతమో లేక ఈ మూడూ కలిసిన భావమో నాకు ఏమీ తెలియటం లేదు.
ఇంతలో నాన్న వచ్చారు. ‘‘ఏంటి గొడవ?’’ 
‘‘పిన్ని వ్రాసిన కథకి మనీఆర్డర్‌ వచ్చింది’’ అని అన్నాడు సత్యం. ‘‘15 రూపాయలు!’’ అన్నాడు రాముడు.
‘‘అమ్మాయిగారూ మీ కథకు 15 రూపాయలు తెచ్చాను. నాకు కాఫీ తాగటానికి ఇవ్వాలి’’ అన్నాడు పోస్ట్‌మ్యాన్‌.

నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు. నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది.

నాన్న జేబులోంచి తీసి చిల్లర అతని చేతిలో పెట్టారు. నేను నాన్న చేతికి 15 రూపాయలు ఇచ్చేసాను.. 

నాన్న డబ్బు తీసుకోలేదు. నన్ను దగ్గరికి తీసుకున్నారు. ‘‘నువ్వు ఏదైనా కొనుక్కో’’ అంటూ ప్రేమతో తలమీద నిమిరారు. ఇంతలో కరణం గారూ! అంటూ రైతులు వస్తే నాన్న వెళ్ళిపోయారు. మా రంగం అక్కయ్య ‘‘నాకు నువ్వేమీ అప్పు తీర్చ క్కర్లేదు. నన్ను గుర్తుపెట్టుకో’’ అంది.

అసలు కథ వ్రాయటమే అపురూపం. అది ప్రచు రణ అవ్వడం ఇంకో అదృష్టం. దానికి తోడు ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉన్న నన్ను వెతుక్కుంటూ 15 రూపాయలు మనీఆర్డర్‌ రావటం ఇంకా అద్భుతం, ఇలా నా జీవితంలో అద్భుతం మీద అద్భుతం జరిగిపోయి, ఇంట్లో వారంతా నన్ను అదృష్టవంతురాలని మెచ్చుకునేలా చేసినాయి.

మర్నాడు నేను రాముడు, సత్యంతో కలిసి కమలత్తయ్య మొగుడు రాజు మావయ్య దగ్గరికి వెళ్ళి, నాన్నకి 15 రూపాయలతో జరీపంచెలు తెమ్మని చెప్పాను. ఎవ్వరికీ చెప్పొద్దన్నాను. మామయ్య పంచెలు తెచ్చారు. నేను నాన్నకి అవిచ్చి ఒంగి కాళ్ళకి నమస్కారం చేసాను. ‘‘నాకెందుకమ్మా?’’ అన్నారు. నాన్న అవి కట్టుకుని పొలం వెళుతూ కమలత్తయ్య దగ్గరికి వెళ్ళి, ‘‘పాప తన సంపాదనతో ఈ జరీ పంచెలు కొనిం’’దని మురి పెంగా చెప్పారని అత్తయ్య మర్నాడు వచ్చి నాకు చెప్పింది. నాకు సంతోషం వచ్చేసింది.

ఆ తర్వాత నేను వేలు, లక్షలు సంపాదించాను. నాన్నకి నేనిచ్చిన నా మొదటి సంపాదన పంచెలు మాత్రమే. ఆ తర్వాతి సంవత్సరం నాన్న పోయారు.

నేను రచయిత్రిగా ఎదిగిన తర్వాత వేలు, లక్షలు సంపాదించాను. కానీ నా తల్లిదండ్రులు నా పేరు ప్రతిష్ఠలు చూడలేదు. వారికి నేనేమీ ఇవ్వలేకపోయాను. ఈ బాధ నా గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది.

– యద్దనపూడి సులోచనారాణి
(సమాప్తం)

తెలుగు నవలా రారాణి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గురించి కాసేపు మాట్లాడుకుందాం...
వేదిక : ఎన్టీఆర్‌ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌
సమయం : నేటి సాయంత్రం 6 గంటలకు
ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయితలు, కవులు, అభిమానులు పాల్గొంటారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement