ఈ వారం యూట్యూబ్ హిట్స్ | YouTube hits this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Sun, Jul 12 2015 10:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఫ్యాన్ : టీజర్
నిడివి : 1 ని. 03 సె.
హిట్స్ : 23,71,302

 
 ‘దునియా కె సబ్‌సె బడే సూపర్‌స్టార్ కా సబ్‌సె బడా ఫ్యాన్’! షారుక్ నటిస్తున్న ‘ఫ్యాన్’ చిత్రం తొలి టీజర్ ఇది. బ్యాండ్ బాజా బారాత్ దర్శకుడు మనీష్ శర్మే మళ్లీ దర్శకత్వం వహిస్తున్న ‘ఫ్యాన్’లో షారుఖ్ ఖాన్ షారుక్ అభిమానిలా నటిస్తున్నారు. ముంైబె లోని తన ఇంటి బయట ఎదురు చూసే ఫ్యాన్స్ మొదలు, వివిధ దేశాలలో షారుఖ్‌ను కలుసుకున్న అభిమానుల దృశ్యమాలికే... ఈ టీజర్. చిత్రం విడుదల వచ్చే ఏడాది ఏప్రిల్.
 
 201 డేస్ ఆఫ్ ది
 ఎక్స్-ఫైల్స్
 నిడివి : 40 సె.
 హిట్స్ : 19,79,816

 
 ఎక్స్-ఫైల్స్ అభిమానులకు శుభవార్త! ఫాక్స్ చానెల్‌లో 2016 జనవరి 24 నుంచి ఆరు భాగాలుగా సరికొత్త ఎక్స్-ఫైల్స్ సీరిస్ మొదలవబోతోంది. అయితే అంతకన్నా శుభవార్త వేరొకటుంది. కొత్త సీరీస్‌కు కౌంట్ డౌన్‌గా.. ఇప్పటివరకు ప్రసారం అయిన మొత్తం 201 ఎక్స్- ఫైల్స్‌ని (సైన్, ఫిక్షన్, హారర్, డ్రామా) ఈ నెల 7వ తేదీ నుండి ఫాక్స్ వరుసగా వేసి చూపిస్తోంది. ఆ విషయం చెబుతూ ఫాక్స్ టీవీ గత వారం ఈ క్లిప్పింగ్‌ను విడుదల చేసింది.
 
 వెల్‌కమ్ బ్యాక్: ట్రైలర్
 నిడివి 3 ని. 42 సె.
 హిట్స్ : 16,32,808

 
 బాలీవుడ్ మూవీ ‘వెల్‌కమ్’కు ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్‌గా వస్తున్న ‘వెల్‌కమ్ బ్యాక్’ మూవీ ట్రైలర్ ఇది. ‘ది ఫన్నీయెస్ట్ మాబ్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వెల్‌కమ్‌లోని నానా పటేకర్, అనిల్ కుమార్.. వెల్‌కమ్ బ్యాక్‌లోనూ కనిపిస్తారు. అయితే అక్షయ్‌కుమార్, కత్రీనాలకు బదులుగా సీక్వెల్‌లో జాన్ అబ్రహాం, శృతీహాసన్ కనువిందు చేస్తారు. వీరి లవ్‌స్టోరీని పాడు చేయడమే మాబ్ ధ్యేయం. చిత్రం విడుదల సెప్టెంబర్ 4.
 
 రంగబోతి
 నిడివి : 6 ని. 57 సె.
 హిట్స్ : 13,88,840

 
 ఎంటీవీలో ‘కోక్ స్టూడియో’ ప్రోగ్రామ్ కోసం గాయని సోనా మహాపాత్ర, సంగీతకారుడైన ఆమె భర్త రామ్ సంపత్ కలిసి రూపొందించిన ‘రంగబోతి’ పాట యూట్యూబ్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఒడిషా జానపద గేయమైన రంగబోతిని ఇలా ఆధునికతతో తగలేయడం ఏమిటని సంస్కృతీ సంప్రదాయాల ప్రేమికులు కన్నెర్రచేసి పోలీసు కేసు పెట్టడం కూడా ఈ సాంగ్‌కి అమితమైన ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. ఇందులోని సోనా మహాపాత్ర వాయిస్ మనల్ని అక్కడికక్కడ ఖైదు చేసేస్తుంది.
 
 మేరా నామ్ మేరీ : బ్రదర్స్
 నిడివి : 2 ని. 17 సె.
 ిహ ట్స్ : 9,83,500

 
 తీస్‌మార్‌ఖాన్‌లో ‘మై నేమీజ్ షీలా...’ అనే పాటను గుర్తుకు తెచ్చే ‘మే రా నామ్ మేరీ’ అనే పాటను మీరు ఈ వీడియోలో వీక్షించవచ్చు. షీలాకు ఏ మాత్రం తగ్గకుండా కరీనా కపూర్ ఇందులో (బ్రదర్స్ చిత్రంలో) ఆడారు, పాడారు, కిక్కెక్కించారు కూడా. అక్షయ్ కుమార్, సిద్థార్థ్ మల్హోత్రా నటిస్తున్న ఈ ఇండియన్ మార్షల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్  ఆగస్టులో విడుదల కాబోతోంది. పాటలో కరీనాను కొంచెమే చూపించారు. మిగతా కొంచాన్ని సినిమాలో చూడ్డం తప్ప వేరే దారి లేదు.
 
 స్ప్లిట్స్‌విల్లా 8
 ఎపిసోడ్ 2
 నిడివి : 44 ని. 35 సె.
 హిట్స్ : 4,58,491

 
 ఎం.టి.వి.లో వస్తున్న ఇండియన్ రియాలిటీ షో.. స్ప్లిట్స్‌విల్లా. అమెరికన్ డేటింగ్ రియాలిటీ షో ‘ఫ్లేవర్ ఆఫ్ లవ్’ ప్రేరణతో తయారైన స్ప్లిట్స్‌విల్లా ప్రస్తుతం 8వ సీజన్‌లో ఉంది. అందులోని రెండో ఎపిసోడే ఇది. సన్నీ లియోన్ ఎంట్రీ ఇవ్వడంతో స్ప్లిట్స్‌విల్లా కొంచెం వేడెక్కిందనే చెప్పాలి.  ఈ షో అంతా బాయ్స్, గాళ్స్ చుట్టూ తిరుగుతుంది. వీళ్లంతా ఒక విల్లాలో స్పేస్ కోసం పోటీ పడుతుంటారు. చివరికి గెలిచిన ఒక అమ్మాయిని, అబ్బాయిని స్ప్లిట్స్‌విల్లా జంటగా ప్రకటిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement