భారత్‌లో క్రికెట్ ప్రపంచ కప్ కంటే పెద్ద పండగ ఉండదేమో!
భారత్‌లో క్రికెట్ ప్రపంచ కప్ కంటే పెద్ద పండగ ఉండదేమో! నాలుగేళ్లకోసారి వచ్చే ఈ నలభై ఐదు రోజుల సంబరాలు ఈసారి తారస్థాయికి చేరాయి. అందుకు
కారణాలూ లేకపోలేదు... చాంపియన్లుగా టీమ్ ఇండియా బరిలోకి దిగడం... ఆరంభంలోనే హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించడం. మరి ఇంత టెంపో ఉంటే మార్కెట్ జనులు ఊరుకుంటారా? దీన్ని క్యాష్
చేసుకొనేందుకు అన్ని రకాల అస్త్రాలూ అభిమానుల పైకి సంధిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, మెగామాల్స్, స్మాల్ షాప్స్... అది ఇదని తేడా లేకుండా అంగడి ఏదైనా వరల్డ్ కప్ థీమ్‌తో ఆఫర్లు అదరగొడుతున్నారు. కాఫీ కప్పుల నుంచి క్యాప్‌ల వరకు అన్నీ క్రికెట్ మయం చేసి అమ్మేస్తున్నారు.
ఇక ప్రపంచ కప్ నిర్వహిస్తున్న ఐసీసీ కూడా తన వెబ్‌సైట్ ద్వారా ఇదే కాన్సెప్ట్‌తో వెరైటీస్‌ను విక్రయిస్తోంది. ఈ ట్రెండీ ఐటెమ్స్‌పై ఓ లుక్కేద్దాం...
..:: హనుమా