నైనాల గోవర్ధన్
సందర్భం
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రావలసిన నీటి విషయంలో గత 40 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. ఇక్కడ వందల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు వంద ఎకరాలకు నీళ్లివ్వని దుస్థితి దాపురించింది.
ఆదిలాబాద్ జిల్లా అక్షరక్ర మంలో ముందున్నా, అభివృద్ధిలో అన్ని విధాలా వెనుకబడింది. దీనిని ఆదర్శ జిల్లాగా 1985లోనే నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. ప్రకటించినా, ఇతర జిల్లాలతో పోల్చినప్పు డు ఇక్కడ జరిగిన అభివృద్ధి నామమాత్రం. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, జిల్లా నుంచి మంత్రులు ఎవరైనప్ప టికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఏ జిల్లాకు లేని విధంగా ఒకవైపున గోదావరి, మరోవైపున ప్రాణహిత, ఇంకోవైపున పెన్‌గంగా, వార్ధానదులు ప్రవహిస్తున్నా యి. అనేక అంతరనదులు, వాగులు పారుతున్నాయి.
2013 వర్షాకాలంలో గోదావరి నది నుంచి అన్ని జిల్లాల గుండా సముద్రంలో కలిసిన నీరు మొత్తం 4,657 టీఎంసీలు. ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులగుండానే 1,500 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసింది. ప్రతిఏటా వం దల టీఎంసీల నీరు వృథాకాని కాలం ఉండదు. అతి చిన్న కడెం నది నుంచి గత 40 సంవత్సరాలలో 1,400 టీఎంసీల నీరొస్తే, 800 టీఎంసీల నీరు వృథాగా సము ద్రంలో కలిసింది. 2013లో ఈ ఒక్క నది నుంచి 50 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ఈ ఏడాది తెలంగాణ, తీవ్ర కరువు కోరల్లో చిక్కుకొంది. మూడో వంతు భూభాగానికి తడితగల లేదని ప్రభుత్వ మే అధికారికంగా ప్రకటించింది. భయంకర కరువులో కూడా పెనుగంగ, ప్రాణహిత నదుల తీవ్రమైన వరదలు రెండు మూడుసార్లు ముంచెత్తాయి.
ఇన్ని నీటి వనరులు రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేవు. ఆంధ్ర పాలకుల పక్షపాతం, జిల్లా బడా నాయకుల అల సత్వం, తగిన శ్రద్ధ అవగాహన లేకపోవుట, దారుణ నిర ్లక్ష్యం వల్ల జిల్లాకు తీరని నష్టం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు రావలసిన నీటి విషయంలో గత 40 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. శ్రీరాంసాగర్ నుంచి గత 30 సంవత్సరాలలో 2,900 టీఎంసీల నీరు కాలువలకు విడుదల చేస్తే, 2,700 టీఎంసీలకు పైగా కాకతీయ కాలువకు పోతే, ఆదిలాబాద్ కాలువకు 79 టీఎంసీలు మాత్రమే వచ్చింది. నిర్మాణంలో ఉన్న ‘ఎల్లంపల్లి’లోనూ తీవ్రమైన అన్యాయం జరిగింది.
ఉట్నూరు డివిజన్‌లో 2,43,961 ఎకరాలు సాగులో ఉండగా, సాగునీరు లభిస్తున్నది. రెండు వేల ఎకరాల కంటే తక్కువే. అనగా మొత్తం మీద సాగుకు వర్షమే ఆధారం. సాగునీరు లేక పోగా కనీసం తాగునీరు కూడా లేదు. వాగులు వంకలు చెలిమలే ఆధారం. కొన్నిచోట్ల 2 కి.మీ. నుంచి 5, 6 కి.మీ వరకు మంచినీటి కొరకు వెళ్లా ల్సిన దుస్థితి. అంతదూరం నుంచి తెచ్చినా అవి కలుషిత జలాలే. కలుషిత జలాలు తాగడం వల్ల, ప్రతి ఏడాది విషజ్వరాలు వచ్చి వందల మంది ఆదివాసీలు చనిపో తున్నారు. చివరకు బోర్ల ద్వారా చేతి పంపుల నుంచి వచ్చే భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండి, ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ‘ఆదిలాబాద్ ఆదివాసీ లు ఆఫ్రికా ప్రజల కంటె వెనుకబడ్డారు.’
ఆదిలాబాద్ జిల్లాకు దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెనుగంగ, తూర్పున ప్రాణహిత నదితో మూడు వైపుల నదులుంటాయి. జిల్లాలో అనేక నదులున్నాయి. జి5/ 32 నుంచి జి5/64 వరకు 33 భారీ ఉపనదులు బాసర్ నుంచి చెన్నూర్ వరకు గోదావరిలో కలిసే జి7/1 నుంచి జి7/8 పెనుగంగ నదిలో 8 భారీ ఉపనదులు కోజన్ గూడ నుంచి ఉమ్రి వరకు కలుస్తాయి. జి8/2 నుంచి జి8/5 వరకు 4 భారీ ఉపనదులు వార్దా నదిలో కలు స్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రముఖ సాధికార సంస్థ కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసీ) గుర్తించిన ప్రధాన ఉపనదు లు, జిల్లాలోని వివిధ ప్రధాన నదులలో కలుస్తాయి.
వందల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు వంద ఎకరాలకు నీళ్లివ్వని దుస్థితి దాపురించింది. కొమురం భీం ప్రాజెక్టు 450 కోట్లతో కట్టారు. అయినప్పటికీ నాలుగు ఎకరాలకు కూడా నీరు పారదు. 6 వేల ఎకరాలకు అందిస్తామని 35 కోట్లతో నిర్మించిన ర్యాలీ వాగు ప్రాజెక్టు 300 ఎకరాలకు కూడా నీరివ్వడం లేదు. ధనయజ్ఞంలో 30 వేల ఎకరా లకు నీరివ్వాలని 160 కోట్లతో నిర్మించిన గూడెం ఎత్తి పోతల పైపులైన్లు ట్రయల్న్‌ల్రో అవినీతి చెదలు తగిలి పేలిపోతున్నాయి.
శ్రీరాంసాగర్ దక్షిణ (కాకతీయ) కాలువ 345 కి.మీ.ల మేరకు నల్గొండ వరకు పోతే. అదే నెహ్రూ శంఖుస్థాపన చేసిన చెన్నూర్ ప్రాణహిత నది వరకు వెళ్లే ‘గోదావరి ఉత్తర కాలువ’ అడుగు కూడా కదలలేదు. ‘తెలంగాణ పల్లెలకు ‘స్వర్ణయుగం, జీవధార’గా ప్రభు త్వం ప్రచారం చేస్తోన్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ గురించి చెప్పుకుంటే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ చిట్టచివరి ప్రాజెక్టులో కూడా తీరని అన్యాయం జరుగు తోంది. 210 టీఎంసీలు ఇతర జిల్లాలకు తరలిస్తూ ముష్టి 7 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించారు. ప్రాణహిత ప్రాణం తొడుక్కొని గోదావరిలో ఇదే జిల్లాలో సంగమించిన జిల్లాకే తెలంగాణ ప్రభుత్వం నికర నీళ్లు నేటికీ కేటాయించలేదు. కోదండరాం మండ లానికి 600 ఎకరాలకే నీరివ్వాలనే నిర్ణయంలో వివక్ష వెల్లడవుతోంది. సాగునీటి విషయంలో జిల్లాకు గతం నుంచి జరుగుతున్న వివక్షత, అన్యాయాలకిది పరాకాష్ట. సొంత జిల్లాకు నీళ్లివ్వకుండా సుదూరం తరలించడం అన్యాయం. ఆర్భాటంగా చేపట్టిన జలయజ్ఞంలో జిల్లాకు దారు ణమైన అన్యాయం జరిగింది.
ఎల్లంపల్లి మొదటి దశ నుంచి రెండో దశకు మార్చి, తర్వాత ప్రాణహిత నుంచి ఇస్తామన్నారు. జిల్లాలో చిట్టచివరి ప్రాణహిత- చేవెళ్ల- ఎల్లంపల్లి నుంచి కూడా మొండి చేయి చూపిస్తు న్నారు. ఎత్తిపోతల పథకాలలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టులో 22 లిఫ్ట్‌లు ఉపయోగించి 500 మీటర్ల ఎత్తుకు ఎగువకు నీరు తరలిస్తున్నారు. మా ప్రతి చుక్క నీరు మాకు చెందకుండా ఎగువ జిల్లాలకే 16 లక్షల 40 వేల ఎకరాలకు నీరు తరలిస్తున్నారు. మంజీర (సింగూరు) నీళ్లు మెదక్ ఎండిన బీళ్లకు మళ్లిస్తామని కేసీఆర్, హరీష్ రావు అంటున్నారు. కానీ ఆదివాసులు అధికంగా మరణి స్తున్న, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదిలాబాద్‌కు ప్రాణహిత, గోదావరి నీళ్లు ముందు ఇవ్వాలో వద్దో సీఎం కేసీఆర్, హరీష్‌రావులు తేల్చాలి.
(వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకులు
మొబైల్: 9701381799)