సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మరో రేస్ చేరింది.
సిటీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో మరో రేస్ చేరింది. నగరంలోని లియోనియాలో ‘చికేన్ సర్క్యూట్’ పేరుతో 1.2 కిలోమీటర్ల కార్టింగ్ ట్రాక్ ప్రారంభమైంది. కొత్తగా ఏర్పాటైన ఈ ట్రాక్‌పై డెమో రన్స్‌తో రేసర్ అర్మాన్ ఇబ్రహిం ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇతర ప్రొఫెషనల్ రైడర్స్ తమ స్టంట్స్‌తో.. చికేన్ ఓ ట్రాక్ మాత్రమే కాదు, మోటార్‌స్పోర్ట్స్ అన్నింటికి సరైన వేదిక అని నిరూపించారు. ఫీనిక్స్ లైవ్ నిర్వహించిన ఈ ప్రారంభ వేడుకల్లో ఫీనిక్స్ మనేజింగ్ పార్ట్‌నర్ భరత్‌వర్మ, ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఐ కార్టింగ్ కమిషన్ ఛైర్మన్ సజీవ్ రాజన్, మెకో రేసింగ్ వ్యవస్థాపకులు అక్బర్ ఇబ్రహిం, లియోనియా జనరల్ మేనేజర్ ప్రవేశ్ కుమార్ దాస్ పాల్గొన్నారు.