క్లిక్..కింగ్ | click king | Sakshi
Sakshi News home page

క్లిక్..కింగ్

Published Tue, Mar 17 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

క్లిక్..కింగ్

క్లిక్..కింగ్

అతుల్ కస్బేకర్... వెటరన్ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. వరల్డ్‌వైడ్ ఫేమస్ అయిన కింగ్‌ఫిషర్ క్యాలెండర్‌తో ఫొటోగ్రఫీలో తనదైన ముద్ర వేసిన ఫ్యాషన్ ఐకాన్. ఇటీవల బంజారాహిల్స్ లామకాన్‌లో జరిగిన ఫొటోగ్రఫీ వర్క్‌షాప్‌కి గెస్ట్‌గా వచ్చారు. హైదరాబాదీ ప్రొఫెషనల్, ఆస్పైరింగ్ ఫొటోగ్రాఫర్స్‌కి కొన్ని టిప్స్ చెప్పారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ఇలా ముచ్చటించారు...
 ..:: కట్ట కవిత
 
స్కూల్, కాలేజ్‌లో నాకు మంచి ర్యాంకులు వచ్చేవి. అందుకే కెమికల్ ఇంజినీరింగ్ వైపు వెళ్లాను. అందులో చేరాక తెలిసింది... అదసలు నాకు ఇష్టంలేని సబ్జెక్టని. తరువాత ఓ ఫ్రెండ్‌ని అడిగితే... తను ‘రోజూ అందరూ పనిచేస్తారు. కానీ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేయరు. వాళ్లు చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు. పని చేయాలనుకుంటున్నావో... నచ్చిన పనిని ఎంజాయ్ చేస్తూ జీవించాలనుకుంటున్నావో నువ్వే డిసైడ్ చేసుకో’ అని చెప్పారు.

అలా డిసైడ్ అయ్యి ఈ ఫీల్డ్‌కి ఎంటరయ్యాను. ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోలేదు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్... న్యూటాలెంట్స్‌కి లాంఛ్‌పాడ్ లాంటిది. కత్రినాకైఫ్, యానాగుప్తా, దీపికా పడుకొనె, నర్గీస్ ఫక్రీలాంటివాళ్లను పరిచ యం చేసింది కూడా కింగ్‌ఫిషరే. అయితే కింగ్‌ఫిషర్‌కు కరెక్టుగా సరిపోయే ఐదుగురు మోడల్స్... మలైకా అరోరా, శిల్పాషెట్టి, దీపానిత, బిపాషాబసు... శీతల్ మల్హర్.
 
క్యాప్చరింగ్ ఇంపార్టెంట్..
విజువల్ మీడియా పెరుగుతోంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంటోంది. లేదంటే సెల్‌ఫోనే కెమెరాగా మారుతోంది. నాకు సెల్ఫీలంటే అస్సలు నచ్చదు. అయితే ఒక్కోసారి... అద్భుతమైన కెమెరాలు చేతిలో ఉన్న వాళ్లు కూడా చెత్త ఫొటోలు తీస్తారు. మామూలు కెమెరాతోనే అద్భుతమైన చిత్రాలు తీస్తున్నవాళ్లున్నారు. అయితే ఏ ఎక్విప్‌మెంట్‌తో తీశామన్నది కాదు... ఎలాంటి మూమెంట్‌ను క్యాప్చర్ చేశామనే దానిలోనే ఫొటో గొప్పతనం దాగి ఉంటుంది.
 
రానా ఇల్లంటే ఇష్టం..
నా కంటికి కనపడిందల్లా చదివేస్తాను. ఐపాడ్స్ అంటే ఇష్టం. అవి నా కోసమే తయారు చేశారనుకుంటా. ఏదీ తెలుసుకోకుండా మనకు మనమే ఏదైనా విషయం మీద ఓ నిర్ణయానికొచ్చేయొచ్చు... కానీ అజ్ఞానం డేంజరస్ కదా! అందుకే... కొత్త విషయాలను తెలుసుకోవడం నాకో వ్యసనం. నేను హైదరాబాద్‌లో చూసిన ప్రదేశాలేమీ లేవు. ఎక్కువగా స్టూడియోస్‌కి, ఫ్రెండ్స్ ఇళ్లకు మాత్రమే వెళ్తాను. రానా ఇల్లు బాగా నచ్చుతుంది.
 
వ్యాపారంలా చూడొద్దు..
నేను మర్చిపోలేని లొకేషన్ కపాడోషియా. ఈ భూమ్మీద దీనిని మించి అందమైన ప్రాంతం మరోటి లేదనుకుంటా. నేను ఔత్సాహిక ఫొటోగ్రాఫర్స్‌కి చెప్పే మాట ఒకే ఒకటి... ఫొటోగ్రఫీని వ్యాపారంలా చూడొద్దు. అందరూ ‘ కెమెరా ముందుకెప్పుడొస్తారు’ అని నన్ను అడుగుతూ ఉంటారు... కానీ నాకు అస్సలు పొసగని అంశం అది. అయితే సోనమ్ కపూర్ నటించనున్న ఓ సినిమాతో నిర్మాతగా మారుతున్నాను. 250 మంది ప్రాణాలను కాపాడి తాను హత్యకు గురైన ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోత్ కథాంశంతో రామ్ మధ్వాని దర్శకత్వంలో అది తెరకెక్కనుంది. సినిమా ఎలా ఉండబోతుందనేది ముందే చెప్పలేను కానీ... సాంకేతికపరంగా అద్భుతంగా ఉంటుందని హామీ ఇవ్వగలను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement