వేదన తీర్చిన కళ | High-Concept Shakespeare and a Dash of Hope | Sakshi
Sakshi News home page

వేదన తీర్చిన కళ

Published Fri, Dec 19 2014 12:41 AM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

వేదన తీర్చిన కళ - Sakshi

వేదన తీర్చిన కళ

అమెరికన్ రచయిత స్కాట్ క్యాంప్‌బెల్ నవల ఆఫ్టర్‌మాత్ ను జర్మన్ ఫిలిం మేకర్ కరొలిన్ లింక్ ‘ఎ ఇయర్ ఎగో ఇన్ వింటర్(ఏడాది క్రితం శీతకాలంలో)’గా రూపొందించారు. 2008లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో గోథే జెంత్రమ్‌లో బుధవారం సాయంత్రం ప్రదర్శించారు. తామెంతగానో ప్రేమించే ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబంలో ఒక పెయింటింగ్ ఎంతటి సాంత్వనను ఇస్తుందో ఈ చిత్రం చెబుతుంది.
 
మ్యూనిచ్ శివార్లలో రిచ్‌స్టర్ కుటుంబం జీవిస్తుంటుంది. రిచ్‌స్టర్ సైంటిస్ట్. ఆయన భార్య ఇలియానా ఇంటీరియర్ డెకరేటర్. చీకూ చింతాలేని జీవితం. కుమార్తె లిలీ ఫైనార్ట్స్ విద్యార్థిని. 19 ఏళ్ల అలెగ్జాండెర్ ఎందుకో ఆత్మహత్య చేసుకుంటాడు.  కడుపుకోతతో తల్లడిల్లుతున్న ఆ తల్లి తన కుమారుడి చిత్రం వేయాల్సిందిగా పొరుగున నివసించే మాక్స్ హాలెండర్ అనే ఆర్టిస్ట్‌ను కోరుతుంది. పియానో దగ్గర లిలీ-అలెగ్జాండర్‌లు ఉన్నట్లుగా పెయింటింగ్ వేస్తే ఇద్దరు పిల్లల మధ్య ఇంటిమసీ బాగుంటుందని సూచిస్తుంది.

లిలీకి మోడల్‌గా ఉండటం ఇష్టం ఉండదు. తన బాధను ఇంటీరియర్ డెకరేషన్‌గా మలచుకోవాలని భావిస్తుంది. జీవితంలో ఆర్ట్‌కున్న ప్రాధాన్యాన్ని, అది కుటుంబంపై కలిగించగల పరిణామాలను ఈ చిత్రం భిన్నకోణాల్లో చూపుతుంది. నటీనటులందరూ చక్కగా నటించిన సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న ఈ చిత్రం అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement