మస్లిన్..మెరిసెన్
అత్యల్ప ధరలోనూ అద్భుతమైన డిజైన్లు సృష్టించవచ్చని హామ్‌స్టెక్ విద్యార్థులు నిరూపించారు. పన్నెండు నెలల డిజైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న 300 మంది ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ రూపొందించిన వెరైటీ కలె క్షన్స్‌ను హరిహర కళాభవన్‌లో ప్రదర్శించారు. ఫ్యాబ్రిక్స్‌లోకెల్లా అత్యంత తక్కువ ఖరీదైనదిగా పేర్కొనే మస్లిన్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించిన 20 కలెక్షన్లను విభిన్న థీమ్స్‌తో ప్రదర్శించారు. షార్ప్‌నర్స్, సైకిల్ పార్ట్స్, పెయింట్స్, డై టెక్నిక్స్, హుక్స్, జిప్పర్స్... వంటివి సైతం గార్మెంట్ మేకింగ్‌లో భాగం చేయడం ద్వారా స్టూడెంట్స్ క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించారు.
‘షో’వెనుక..
‘ఫ్యాషన్ అంటే అదేదో కాస్ట్‌లీ అఫైర్ అనే ఆలోచన సరైంది కాదని చెప్పాలనుకున్నాం’ అని ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు అజితారెడ్డి చెప్పారు. లినెన్‌లూ, షిఫాన్‌లు వంటి ఖరీదైన మెటీరియల్‌తో మాత్రమే కాకుండా రూ.30 ధరలోనే లభించే మస్లిన్ వంటి మెటీరియల్‌తోనూ వెరైటీ డిజైన్లు, స్టయిలిష్ కలెక్షన్లు క్రియేట్ చేయొచ్చని తమ స్టూడెంట్స్ ప్రూవ్ చేశారని చెప్పారు. ప్రదర్శనలో వినియోగించిన గార్మెంట్స్ ఒక్కోటి రూ.300, రూ.500.. మాత్రం ఖర్చుతోనే రూపొందాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే స్వయంగా నిర్వహించే ‘ది హెచ్ లేబుల్ డాట్‌కామ్’ పోర్టల్‌ను ఆమె ప్రారంభించారు.