Lowest price
-
ఆహా ఏమి కారు.. రూ. 30 ఖర్చుతో 300 కి.మీ ప్రయాణం..!!
-
ఇక్కడ చికెన్ చీప్ గురూ!
సాక్షి, కామారెడ్డి: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎంత పోటీ పడినా, ధర విషయంలో మాత్రం కలిసే నిర్ణయిస్తాయి. వాళ్లు చెప్పిన ధరే చెల్లుబాటవుతుంది. రోజూ లైవ్ బర్డ్, డ్రెస్స్డ్ చికెన్, స్కిన్లెస్ చికెన్ ధరలను నిర్ణయించి పత్రికల ద్వారా వెల్లడిస్తారు. ఆ రేట్ల ప్రకారమే రాష్ట్రమంతటా విక్రయాలు జరుగుతాయి. కానీ కామారెడ్డి మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా ‘ఈ రోజు పేపర్ రేటుపై కిలోకు రూ. 30 తక్కువ’అన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో పాటు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. కిలో చికెన్ కొంటే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తుంటారు. రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గింపు.. కామారెడ్డి పట్టణంలో హోల్‌సెల్ చికెన్ సెంటర్లు దాదాపు 40 ఉండగా, రిటైల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. కామారెడ్డి మినహా మిగతా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్తే పత్రిక ధర ప్రకారమే చికెన్ విక్రయాలు సాగుతాయి. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా కొంత ఎక్కువకే అమ్ముతారు. కామారెడ్డిలోని చికెన్ వ్యాపారులు మాత్రం ధర తగ్గించుకుని విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గింపు ఇస్తున్నారు. కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న సిరిసిల్ల వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నాలుగైదేళ్లుగా ఇదే పోటీ.. కామారెడ్డి పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా ఈ పోటీ నెలకొంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిన చికెన్ వ్యాపారి.. తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితంగా అందించాడు. మరో వ్యాపారి పత్రిక ధరపై కిలోకు రూ.35 తక్కువ అన్న బోర్డు పెట్టాడు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల జిమ్మిక్కులతో చిరు వ్యాపారులు నలిగిపోతున్నారు. పెద్ద ఎత్తున అమ్మకాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఆర్డర్‌పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. కామారెడ్డికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా చికెన్ కోసం వస్తారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని సమీప గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరం ఉంటే కామారెడ్డికి వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. -
మార్కెట్లోకి ‘కొడాక్ సీఏ సిరీస్’ టీవీలు
న్యూఢిల్లీ: గూగుల్ సర్టిఫికేట్ పొందిన అండ్రాయిడ్ టెలివిజన్లలో అత్యంత చౌక ధరలకే కొడాక్ తన కొత్త తరం టీవీలను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఈ బ్రాండ్ విక్రయానికి లైసెన్సు కలిగి ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్).. ‘కొడాక్ సీఏ సిరీస్’ పేరిట వీటిని సోమవారం మార్కెట్లోకి విడుదలచేసింది. డాల్బీ విజన్, 4కే హెచ్డీఆర్10, ఆండ్రాయిడ్ 9.0 ఇంటర్ఫేస్, డీటీఎస్ ట్రూసరౌండ్ కలిగిన డాల్బీ డిజిటల్ ప్లస్, యుఎస్బీ 3.0, బ్లూటూత్ వీ5.0 (తాజా వెర్షన్), అమెజాన్ ప్రైమ్ వంటి ఆప్షన్లు కలిగిన యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ వంటి అధునాతన ఫీచర్లు కొత్త సిరీస్‌లో ఉన్నాయి. 43, 50, 55, 65 అంగుళాల సైజుల్లో టీవీలు లభిస్తుండగా.. ప్రారంభ ధర రూ. 23,999, హై ఎండ్ రూ. 49,999కే లభిస్తున్నట్లు ఎస్పీపీఎల్ డైరెక్టర్, సీఈఓ అవనీత్ సింగ్ మార్వ్ ప్రకటించారు. మార్చి 19 నుంచి ఈ సీరిస్ టీవీలు ఫ్లిప్‌కార్టులో అందుబాటులో ఉండనున్నాయి. -
అతి తక్కువ ధరకే టికెట్లు: గోఎయిర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గోఎయిర్ కూడా డిస్కౌంట్ ధరలో విమాన టికెట్లకు ఆఫర్ చేస్తోంది. అధికారిక వెబ్సైట్ (goair.in) అందించిన సమాచారం ప్రకారం అతితక్కువ ధరల్లో దేశీయ మార్గాల్లో టికెట్లను అందిస్తోంది. రూ.991 ప్రారంభధర (అన్నీకలుపుకుని)గా వివిధ మార్గాల్లో టికెట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఏప్రిల్ 5,2018 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ ప్రత్యేక ఛార్జీల పథకంలో మరో ఆఫర్ కూడా ఉంది. గోఎయిర్యాప్లో ప్రోమో కోడ్ 'GOAPP10' ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హైదరాబాద్ - బెంగళూరు.. రూ.1699 బెంగళూరు- హైదరాబాద్.. రూ.2,034 అహ్మదాబాద్-ముంబై రూ.1608 బాగ్డోగ్ర- గువహతి.. రూ.991 గోవాహతి- బాగ్డోగ్రా.. రూ.1,346 పాట్నా- కోలకతా.. రూ.1,505 ప్రారంభధరలుగా ఉన్నాయి. -
మస్లిన్..మెరిసెన్
అత్యల్ప ధరలోనూ అద్భుతమైన డిజైన్లు సృష్టించవచ్చని హామ్స్టెక్ విద్యార్థులు నిరూపించారు. పన్నెండు నెలల డిజైనింగ్ కోర్సు పూర్తి చేసుకున్న 300 మంది ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ రూపొందించిన వెరైటీ కలె క్షన్స్ను హరిహర కళాభవన్‌లో ప్రదర్శించారు. ఫ్యాబ్రిక్స్లోకెల్లా అత్యంత తక్కువ ఖరీదైనదిగా పేర్కొనే మస్లిన్ను ఆధారంగా చేసుకుని రూపొందించిన 20 కలెక్షన్లను విభిన్న థీమ్స్‌తో ప్రదర్శించారు. షార్ప్నర్స్, సైకిల్ పార్ట్స్, పెయింట్స్, డై టెక్నిక్స్, హుక్స్, జిప్పర్స్... వంటివి సైతం గార్మెంట్ మేకింగ్‌లో భాగం చేయడం ద్వారా స్టూడెంట్స్ క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించారు. ‘షో’వెనుక.. ‘ఫ్యాషన్ అంటే అదేదో కాస్ట్లీ అఫైర్ అనే ఆలోచన సరైంది కాదని చెప్పాలనుకున్నాం’ అని ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు అజితారెడ్డి చెప్పారు. లినెన్లూ, షిఫాన్లు వంటి ఖరీదైన మెటీరియల్‌తో మాత్రమే కాకుండా రూ.30 ధరలోనే లభించే మస్లిన్ వంటి మెటీరియల్‌తోనూ వెరైటీ డిజైన్లు, స్టయిలిష్ కలెక్షన్లు క్రియేట్ చేయొచ్చని తమ స్టూడెంట్స్ ప్రూవ్ చేశారని చెప్పారు. ప్రదర్శనలో వినియోగించిన గార్మెంట్స్ ఒక్కోటి రూ.300, రూ.500.. మాత్రం ఖర్చుతోనే రూపొందాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులే స్వయంగా నిర్వహించే ‘ది హెచ్ లేబుల్ డాట్‌కామ్’ పోర్టల్‌ను ఆమె ప్రారంభించారు.