సాక్షి,ముంబయి: ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయులు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా వేర్వేరు దేశాల్లో కోటి 56 లక్షల మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారతి సంతతి వారు ఏకంగా 6 శాతంగా ఉన్నారు. అంతర్జాతీయ వలసదారుల సంఖ్య 2010 నుంచి పది శాతం పెరిగి 2015 నాటికి 24.3 కోట్లకు చేరిందని తాజాగా విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది.
2015లో అంతర్జాతీయ వలసల్లో సగం మంది ఆసియా దేశాలకు చెందిన వారేనని ప్రపంచ వలస నివేదిక (2018) పేర్కొంది. వలసదారుల్లో భారత్ తర్వాతి స్ధానం మెక్సికోది కాగా, రష్యా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి.
ముఖ్యంగా 24 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న వారే వలసదారుల్లో అధికంగా 72 శాతం మేర ఉన్నారు. 1970 నుంచి అంతర్జాతీయ వలసలకు అమెరికానే గమ్యస్ధానంగా ఉంది. అమెరికా తర్వాత గల్ప్ దేశాలు భారత్ సంతతికి ప్రధాన కేంద్రంగా మారాయి. భారత సంతతిలో 22 శాతం మంది యూఏఈలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment