UNO report
-
పని ప్రదేశాల్లో వేధింపులు ఎక్కువే.. మహిళలపైనే అధికం!
ఐక్యరాజ్యసమితి: పని ప్రదేశాల్లో దిగువస్థాయి సిబ్బందికిపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయని ఓ సర్వేలో తేలింది. యువత, వలసదారులు, రోజువారీ వేతన జీవులు, ముఖ్యంగా మహిళలే ఇందుకు బాధితులుగా మారుతున్నారని వెల్లడైంది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి చేపట్టిన మొట్టమొదటి సర్వే ఇది. ఐరాస అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో), లాయిడ్స్ రిజిస్టర్ ఫౌండేషన్, గాల్లప్ సంస్థ కలిసి గత ఏడాది చేపట్టిన ఈ సర్వే ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 121 దేశాల్లోని 75 వేల మంది సిబ్బందిపై సర్వే జరపగా 22% మందికి పైగా ఏదో ఒక రకమైన వేధింపులు, హింసకు గురవుతున్నట్లు తెలిపారని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఒకరు పని ప్రదేశంలో ఏదో ఒకవిధమైన వేధింపులకు గురవుతున్నట్లు తెలపగా, 6.3% మంది భౌతిక, మానసిక, లైంగిక హింసను, వేధింపుల బారినపడ్డారు. 17.9% మంది మాత్రం ఉద్యోగం చేసుకునే చోట ఏదో ఒక రూపంలో వేధింపులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉపాధి పొందే చోట భౌతికంగా హింస, వేధింపులను ఎదుర్కొంటున్నట్లు 8.5% మంది పేర్కొనగా వీరిలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. ‘పని ప్రదేశాల్లో వేధింపులు ప్రమాదకరమైన అంశం. దీనివల్ల వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆదాయ నష్టం వాటిల్లి, వారి కెరీర్ దెబ్బతింటోంది’అని సర్వే అభిప్రాయపడింది. ప్రభావవంతమైన చట్టాలు, విధానాలను రూపొందించి ఈ సమస్యను పరిష్కరించవచ్చునని పేర్కొంది. ఇదీ చదవండి: ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష -
అది దురుద్దేశాల నివేదిక
న్యూఢిల్లీ/జెనీవా: కశ్మీర్లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. కశ్మీర్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు అటు పాకిస్తాన్ లేదా ఇటు ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సీమాంతర ఉగ్రవాదాన్ని విస్మరించారు.. ‘భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను ఉల్లంఘిస్తూ, కశ్మీర్లో మూల సమస్య అయిన సీమాతంర ఉగ్రవాదాన్ని విస్మరిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పాక్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదుల వల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోలేదు. ఇండియాకు, ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించే పాకిస్తాన్‌కు మధ్య కృత్రిమ పోలిక తేవాలన్న ప్రయత్నం ఈ తాజా నివేదికలో కనిపిస్తోంది. దీనిపై ఐరాస మానవహక్కుల కార్యాలయానికి ఇండియా తన తీవ్ర నిరసనను తెలిపింది. నివేదికను ఇలా విడుదల చేయడం వల్ల ఐరాస విశ్వసనీయత, చిత్తశుద్ధి దెబ్బతింది. భారత విధానాలు, ఆచరణలు, విలువలను విస్మరించిన ఈ నివేదిక తన విశ్వసనీయతనే ప్రమాదంలోకి నెట్టుకుంది’ అని చెప్పారు. -
జన విస్ఫోటం
భారత్‌లో జనాభా రోజురోజుకీ పెరిగిపోతోంది. చైనాను దాటి నంబర్‌వన్ స్థానంలోకి రావడానికి మరెంతో కాలం పట్టేలాలేదు. మరో ఎనిమిదేళ్లలోనే అంటే 2027 నాటికి చైనా జనాభాను భారత్ దాటేస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. 2019–50 మధ్యనాటికి భారత్‌లో జనాభా 27.3 కోట్లు అదనంగా పెరుగుతుందని, ఈ శతాబ్దం చివరివరకు భారతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుందని ఒక నివేదికలో వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల సంస్థకు అనుబంధంగా ఉండే జనాభా విభాగం ‘ప్రపంచ జనాభా అంచనాలు–2019’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలోని ఇతర ముఖ్య అంశాలు.. ► ప్రస్తుతం భారత్ జనాభా 137 కోట్లయితే, చైనా జనాభా 143 కోట్లుగా ఉంది. ► ప్రపంచవ్యాప్తంగా జనాభా 2019–50 మధ్య నాటికి మరో 200 కోట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ► ప్రస్తుత ప్రపంచ జనాభా770 కోట్ల నుంచి 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చు. ► 2010 నుంచి లెక్కలు తీస్తే 27 దేశాల్లో జనాభా ఒక్క శాతం తగ్గుతూ వస్తోంది. ► కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో జనాభా తగ్గిపోవడానికి సంతాన సాఫల్యత తగ్గిపోవడం, ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు పెరిగిపోవడమే కారణం. ► 2050 నాటికి చైనాలో జనాభా అత్యధికంగా తగ్గిపోతుంది. ఏకంగా 2.2 శాతం తగ్గుదల ఉంటుంది. అంటే చైనా జనాభా 3.14 కోట్లు తగ్గితే అదే సమయంలో భారత్‌లో జనాభా 27.3 కోట్లు పెరగనుంది. ► 2050 నాటికి జనాభా పెరిగే తొమ్మిది దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తుంది. ► 2050 నాటికి 65 ఏళ్లకు పైబడిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతీ 11 మందిలో ఒకరు 65 ఏళ్లకు పైబడి ఉంటే 2050 నాటికి ప్రతీ ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల వయసు దాటినవారే ఉంటారు. భారతీయ అమెరికన్ల జనాభా పైపైకి అమెరికాలో ఉంటున్న భారత సంతతి జనాభా గత ఏడేళ్లలో గణనీయంగా పెరిగిందని ఒక సంస్థ అధ్యయనంలో తేలింది. 2010–2017 సంవత్సరాల మధ్య భారత సంతతి జనాభా 38 శాతం మేర పెరిగినట్లు గుర్తించింది. సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్(సాల్ట్) సంస్థ పరిశీలన ప్రకారం.. 2010 భారత సంతతి అమెరికన్లు 31, 83, 063 మంది ఉండగా 2017నాటికి వారి సంఖ్య 44, 02, 363కు పెరిగింది. వారిలో కనీసం 6.30 లక్షల మంది అనధికారికంగా ఉంటున్న వారే. వీసా పరిమితి ముగిసినా అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారి సంఖ్యలో 2010తో పోలిస్తే 72 శాతం పెరుగుదల నమోదైంది. 2016 గణాంకాల ప్రకారం వీసా కాల పరిమితి ముగిశాక కూడా ఉంటున్న భారతీయులు 2.25 లక్షల మంది. 2010–2017 సంవత్సరాల మధ్య కాలంలో అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా దేశాల నుంచి వారి సంఖ్య కూడా 35 లక్షల నుంచి 54 లక్షలకు (40 శాతం) పెరిగింది. వీరిలో అత్యధికంగా నేపాలీలు (206.6 శాతం), భారతీయులు(38), భూటానీయులు(38), పాకిస్తానీయులు(33), బంగ్లాదేశీయులు(26), శ్రీలంక వాసులు (15 శాతం) ఉన్నారు. వీరితోపాటు బాల్యంలోనే అమెరికాకు వచ్చి ఇక్కడే ఉండేందుకు అనుమతి పొందిన దక్షిణాసియా దేశాల వారు 4,300 మంది కాగా భారతీయులు అత్యధికంగా 2,550 మంది ఉన్నారు. అమెరికాలో ఉంటున్న 50 లక్షల మంది దక్షిణాసియా వాసుల్లో 10 శాతం అంటే సుమారు 4.72 లక్షల మంది పేదరికంతో బాధపడుతున్నారు. పేదరికంలో ఉన్న భారతీయ అమెరికన్లలో 11 శాతం మంది ప్రభుత్వ సాయం అందుకుంటున్నారు. 1997 తర్వాత హెచ్–4 వీసా పొందిన హెచ్–1బీ వీసా దారుల జీవిత భాగస్వాముల సంఖ్య 17 లక్షలు. వీరిలో 86 శాతం మంది దక్షిణాసియా దేశాల ప్రజలే. 2017లో సుమారు 1.27 లక్షల మంది హెచ్–4 వీసా పొందారని సాల్ట్ తెలిపింది. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
ఉగ్రముద్రలో పుల్వామా పాత్ర
న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఐరాస: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి చేసిన నోటిఫికేషన్లో పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడాన్ని భారత్ తేలిగ్గా కొట్టేసింది. అజర్ ఉగ్ర కార్యకలాపాలన్నిటి గురించి ప్రకటనలో వివరంగా ఉందని పేర్కొంది. ఆ నోటిఫికేషన్ అజర్ బయోడేటా కాదని విదేశాంగ శాఖ ప్రతినిధి రావీశ్ మీడియాతో అన్నారు. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో పుల్వామా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. జైషే మొహమ్మద్‌కు సంబంధించిన ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడంతో పాటు నిధులందించినందుకు, సహాయం చేసినందుకు గాను అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్టు యూఎన్ నోటిఫికేషన్లో స్పష్టంగా ఉందన్నారు. తమకు తగిలిన దౌత్యపరమైన పెద్ద ఎదురుదెబ్బ నుంచి దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ అర్ధంలేని ప్రకటనలు చేస్తోందని అన్నారు. పుల్వామా దాడితో అజర్‌కు ముడిపెట్టే ప్రయత్నాలతో పాటు కశ్మీర్ సహా అన్ని రాజకీయ ప్రస్తావనలను ప్రతిపాదన నుంచి తొలగించిన తర్వాతే.. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు తాము అంగీకరించామన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వాల నిరంతర కృషి వల్లే: కాంగ్రెస్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక్క మోదీ ప్రభుత్వ ఘనతే అన్నట్టుగా చెప్పుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అది గత ప్రభుత్వాల హయాం నుంచీ జరిగిన నిరంతర కృషితో వచ్చిన ఫలితమని కాంగ్రెస్ ప్రతినిధి రాజీవ్ శుక్లా చెప్పారు. పాక్ సైన్యం సరైన నిర్ణయాలు తీసుకోవాలి పాక్ ప్రధాని ‘సరైన విషయాలు’ చెబుతున్నారు కానీ ఆయన సైనిక నాయకత్వమూ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చే పాక్ విధానాన్ని మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. కమిటీ విశ్వసనీయత పరిరక్షించబడింది అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ పవిత్రత, విశ్వసనీయత పరిరక్షించబడ్డాయని కమిటీ చైర్మన్, ఇండోనేసియా రాయబారి డియాన్ ట్రియాన్సా్యహ్ డ్జానీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సహకరించిన సభ్య దేశాలన్నిటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన బీజేపీ ఈ విషయంలో కాంగ్రెస్ తీరును బీజేపీ తప్పుపట్టింది. దేశం సాధించిన దౌత్య విజయంలో పాలుపంచుకునేందుకు విముఖత ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తింది. అలా చేస్తే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నట్టుగా ఉందని విమర్శించింది. మోదీ ప్రభుత్వ నిరంతర కృషి వల్లే దేశం ఈ అతిపెద్ద దౌత్య విజయం సాధించగలిగిందని బీజేపీ నేతలు జైట్లీ, నిర్మలా సీతారామన్ గురువారం నాడిక్కడ చెప్పారు. జాతి భద్రతలో కాంగ్రెస్, బీజేపీల వైఖరుల మధ్య వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోందని జైట్లీ అన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమని జైట్లీ అన్నారు. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం బీజేపీకి ఎన్నికల అస్త్రం ఎంతమాత్రం కాదంటూనే.. జాతీయవాదం అనేది తమ పార్టీ కి ఎప్పటికీ ప్రధానాంశమేనని నొక్కిచెప్పారు. -
మనం ఆనందంగా లేము...!
ప్రపంచంలో ఆనందమయ జీవనాన్ని సాగించే దేశాల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 156 దేశాల జాబితాలో మనదేశం 133 స్థానంతో (గతంలోని 122 ర్యాంక్ నుంచి) సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదీకాకుండా సార్క్దేశాలతో (దక్షిణాసియా) పోల్చితే కూడా యుద్ధసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్ (145 ర్యాంక్) కంటే మాత్రమే మెరుగైన స్థితిలో నిలిచింది. ఇదిలా ఉంటే మన పొరుగుదేశాలైన పాకిస్తాన్–75, భూటాన్–97, నేపాల్–101, బంగ్లాదేశ్–115, శ్రీలంక–116 భారత్ కంటే మంచి మార్కులనే సాధించాయి. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో తలసరి ఆదాయం , సామాజిక సహకారం, ఆరోగ్యకరమైన జీవనసాఫల్యం, సామాజిక స్వేచ్ఛ, ధాతృత్వం, అవినీతిరాహిత్యం వంటి అంశాల్లో జరిపిన పరిశీలన ఆధారం ఐరాస సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ (ఎస్డీఎస్ఎన్) 2018 వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్‌లో ఈ అంశాలు పొందుపరిచారు. ఈ నెల 20న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్’ను పురస్కరించుకుని ఈ వార్షిక నివేదిక విడుదలచేశారు. 170 పేజీల రిపోర్ట్‌లో...ప్రస్తుతం తలెత్తుతున్న ఊబకాయం, కుంగుబాటు, ఒపియాడ్ సంక్షోభం వంటి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ సమస్యలు అమెరికాలో ఎక్కువగా కనిపించడాన్ని గురించి ప్రస్తావించారు. అగ్రస్థానంలో ఫిన్లాండ్... గతంలో ప్రధమస్థానంలో ఉన్న డెన్మార్క్‌ను వెనక్కుతోసి ఈ ఏడాది సూచిలో అత్యంత సంతోషరకరమైన దేశంగా ఫిన్లాండ్(గతంలో అయిదోస్థానం) అగ్రస్థానానికి చేరుకుంది. 2015–17 సంవత్సరాల మధ్య ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలతో పాటు, ఎన్నికలకు సంబంధించిన సమాచారం ఆధారంగా ఆర్థికవేత్తలు ఈ నివేదిక రూపొందించారు. ప్రకృతి, భద్రత, పిల్లల సంరక్షణ, మంచి పాఠశాలలు, ఉచిత వైద్యసేవలు వంటి అంశాల్లో ఫిన్లాండ్ అత్యుత్తమ మార్కులు సాధించింది. అమెరికా 18వ స్థానంలో (గతేడాది 14), బ్రిటన్–19, యూనైటెడ్ అరబ్ ఎమిరైట్స్–20స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో సిరియా కంటే కూడా వెనుజువెలా దిగజారింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల నుంచి లక్షలాది మంది పట్టణప్రాంతాలకు వలస వెళుతున్నా వారి సంతోషమయ జీవితం ఏమాత్రం బాగుపడలేదని తేలింది. టాప్ టు బాటమ్... టాప్– 1)ఫిన్లాండ్ 2) నార్వే 3) డెన్మార్క్ 4) ఐస్లాండ్ 5) స్విట్జర్లాండ్ లాస్ట్–152)యెమన్ 153)టాంజానియా 154) దక్షిణ సూడాన్ 155) సెంట్రల్ ఆప్రికన్ రిపబ్లిక్ 156) బురుండి –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎటుచూసినా మనోళ్లే..
సాక్షి,ముంబయి: ప్రపంచంలో ఏ మూల చూసినా భారతీయులు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోనే అత్యధికంగా వేర్వేరు దేశాల్లో కోటి 56 లక్షల మంది నివసిస్తున్నారు. అంతర్జాతీయ వలసదారుల్లో భారతి సంతతి వారు ఏకంగా 6 శాతంగా ఉన్నారు. అంతర్జాతీయ వలసదారుల సంఖ్య 2010 నుంచి పది శాతం పెరిగి 2015 నాటికి 24.3 కోట్లకు చేరిందని తాజాగా విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2015లో అంతర్జాతీయ వలసల్లో సగం మంది ఆసియా దేశాలకు చెందిన వారేనని ప్రపంచ వలస నివేదిక (2018) పేర్కొంది. వలసదారుల్లో భారత్ తర్వాతి స్ధానం మెక్సికోది కాగా, రష్యా, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లు తర్వాతి స్ధానాల్లో నిలిచాయి. ముఖ్యంగా 24 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసున్న వారే వలసదారుల్లో అధికంగా 72 శాతం మేర ఉన్నారు. 1970 నుంచి అంతర్జాతీయ వలసలకు అమెరికానే గమ్యస్ధానంగా ఉంది. అమెరికా తర్వాత గల్ప్ దేశాలు భారత్ సంతతికి ప్రధాన కేంద్రంగా మారాయి. భారత సంతతిలో 22 శాతం మంది యూఏఈలో ఉన్నారు. -
సమాజంలో సంస్కరణే... అభివృద్ధి
సంపన్న సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. పరదేశీయులను వేధించకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమాజాల్లోని సామరస్యత వంటివాటిని భారత్‌లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం. ఐక్యరాజ్యసమితి తలసరి జీడీపీ విషయంలో ప్రపంచ దేశాల ర్యాంకుకు సంబంధించిన జాబి తాను ఇటీవలే విడుదల చేసింది. దాంట్లో భారత్‌కు 150వ ర్యాంకు దక్కింది. మన తలసరి జీడీపీ సంవత్సరానికి $1586. అంటే నెలకు భారతదేశం రూ. 8,800 విలువైన వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ ర్యాంకింగులో భారత్ కంటే దిగువన ఉన్న దేశాలేవంటే... ఎమెన్ ($1418), పాకిస్తాన్ ($1358), కెన్యా ($1358), బంగ్లాదేశ్ ($1,088), జింబాబ్వే ($ 965), నేపాల్ ($ 692), అఫ్గానిస్తాన్ ($ 688) కాంగో ($ 480). సోమా లియా ($131) అన్నిటికంటే దిగువన ఉంది. వీటితో పోలిస్తే అతి చిన్న యూరోపియన్ దేశాలైన మొనాకో ($187650), లీసెన్స్టెయిన్ ($157040), లగ్జెం బర్గ్ ($116560)లతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు సుసంపన్న జీవితానికి ప్రతీకలు. సింగపూర్ ($55910), యునెటైడ్ స్టేట్స్ ($ 54306), అత్యధిక ఆదాయం సాధిస్తున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తు న్నాయి. దక్షిణ కొరియా ($ 28 166) జపాన్ ($ 36298)ను సమీ పిస్తుండగా, జర్మనీ ($ 47966), యునెటైడ్ కింగ్డమ్ ($ 46461) సమీపస్థాయికి చేరుతున్నాయి. ఈ అంకెలు మంచి సూచికే కానీ మనం వీటిని మాత్రమే పరి గణనలోకి తీసుకోకూడదు. మొత్తం సగటు కంటే మధ్యగత ఆదాయం.. అంటే ఈ జాబితా మధ్యలో ఉన్న వారి ఆదాయం విషయంలో భారత్ కంటే పాకిస్తానే ఆధిక్యతలో ఉంది. అంటే పాకిస్తానీయుల ఆదాయం భారతీయులతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ అది భారత్ కంటే చక్కగా పంపిణీ అవుతోందని, భారత్ కంటే పాకిస్తాన్ ఆర్థికంగా తక్కువ అసమానత్వంతో ఉందని అర్థం. ఈ జాబితా ప్రకారం జాంబియా($1715), వియత్నాం ($ 2015), సూడాన్($2081), భూటాన్ ($25 69) దేశాలు భారత్‌కంటే ముందున్నాయి. ఇక తలసరి జీడీపీలో భారత్‌తో పోలిస్తే శ్రీలంక ($3635) రెట్టింపు ఆధిక్యతలో ఉంది. భారతీయుల కంటే శ్రీలంక ప్రజలు ఎంతో ఎక్కువ సౌభాగ్యంతో ఉంటున్న విషయం, శ్రీలం కను సందర్శించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించదు. ఇలాంటి పోలికలు తీసుకొస్తున్నప్పుడు దేశం పరి మాణం, దాని ఆదాయ మూలాలు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని ఈ సమాచారం కేసి చూస్తే మనం ఎక్కడ ఉంటున్నామనే అంశంపై మనకు మంచి అవగాహన కలుగుతుంది. బహుశా, భారత్‌ను అభి వృద్ధి చెందిన దేశంగా మలచడానికి మనం ఇంకా ఏం చేయాల్సి ఉంటుందో పరిశీలించగలం కూడా. అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదబంధాన్ని వాడ కూడదని, దానికి బదులుగా దేశాలను తలసరి ఆదా యంతో వర్గీకరించాలని ప్రపంచ బ్యాంకు ఇప్పుడు నిర్ణ యించింది. భారత్ ఒక స్వల్ప మధ్య స్థాయి ఆదాయ దేశం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం.. 1,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను స్వల్ప ఆదాయ దేశాలుగానూ, వెయ్యి నుంచి 4 వేల డాలర్ల మధ్య గల దేశాలు స్వల్ప మధ్యస్థాయి ఆదాయ దేశాలుగానూ, 4 వేల నుంచి 12 వేల డాలర్ల మధ్య గల దేశాలు అధిక మధ్య స్థాయి ఆదాయ దేశాలుగానూ, అంతకంటే ఎక్కువ ఆదా యం ఉన్న దేశాలు అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు గానూ పరిగణించాల్సి ఉంటుంది. పలు యూరోపియన్ దేశాలు అధిక ఆదాయ దేశాలుగా ఉంటున్నాయి. తలసరి ఆదాయం 600 డాలర్లు మాత్రమే ఉన్న సెర్బియా.. ఈ జాబితాలో అత్యంత దిగువ స్థానంలో ఉంది. దారిద్య్రం నుంచి విముక్తి కావడానికి భార త్‌కు ఎంత తలసరి జీడీపీ అవసరమనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ రఘురాం రాజన్ ఇటీవలే మాట్లాడారు. ‘‘ఒకస్థాయి లో మనం ఇప్పటికీ 1,500 డాలర్ల తలసరి ఆదాయం ఉన్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నాం. 1,500 నుంచి సింగపూర్ ఆర్జిస్తున్న 50 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడానికి మనం చేయవలసింది ఎంతో ఉంది. మనది ఇప్పటికీ సాపేక్షి కంగా పేద ఆర్థిక వ్యవస్థే. ప్రతి ఒక్కరి కంటి కన్నీరును తుడవాలంటే భారత్ కనీసం మధ్య ఆదాయదేశంగానైనా మారాలి. సహేతుకంగా పంపిణీ చేసినట్లయితే, 6 వేల నుంచి 7 వేల డాలర్ల తలసరి ఆదాయాన్ని సాధించ గలిగితే తీవ్ర దారిద్య్రంతో మనం తలపడగలుగుతాం. కనీసం ఒక మేరకు సంతృప్తికర స్థాయికి చేరుకోవాలంటే రెండు దశా బ్దాలు కృషి చేయవలసి ఉంటుంది.’’ ప్రస్తుతం చైనా తలసరి జీడీపీ 7,600 డాలర్లకు చేరు కుంది. అంటే రాజన్ చెప్పిన మధ్య ఆదాయ స్థాయిని అది ఈ మధ్యే చేరుకుందని అర్థం. భారత్‌తో పోలిస్తే చైనా అభి వృద్ధి విభిన్న దశలో జరిగిందని చైనాను సందర్శించిన వారికి బోధపడుతుంది. ఈ రెండు దేశాలను పోల్చి చూడటం సముచితం కాదు కూడా. మనకంటే చైనా ఎంతో ముందం జలో ఉంది మన జీవిత కాలంలో అంటే వచ్చే 30 ఏళ్లలో వారిని మనం అందుకోవడం సాధ్యపడుతుందని నేనయితే భావించడం లేదు. అందుచేత, ఇప్పుడున్న 1,500 డాలర్ల నుంచి 4 రెట్లకు అంటే 6 వేల డాలర్లకు మన జీడీపీ చేరుకోవాలంటే భారత్ చేయవలసింది ఏమిటి? ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశంపైనే భారత్‌లో ప్రధాన చర్చగా ఉంటోంది. ఏకీకృత వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా మనం మరింత అధి కంగా, మంచి చట్టాలను చేయవలసిన అవసరముందని మన ఆలోచన. రెండోది. మనకు సుపరిపాలన అవసరం, అంటే అవినీతి రహిత, సమర్థ పాలన అవసరం. అవినీతి, అసమర్థత మన సంస్కృతిలో భాగంగా ఉన్న దేశంలో రెండో అంశం సాధ్యపడుతుందని భావించ డానికి పై రెండు అంశాలను పరిపూర్తి చేయడంతోటే సరిపోదని నేననుకుంటున్నాను. అవసరమైన మార్పులలో ఈ రెండూ ప్రధాన అంశాలు కావు. అధిక ఆదాయాన్ని సాధించిన దేశాలలో పర్యటించిన వారికి అవి భారత్‌కంటే విభిన్న దశలో వ్యవహరిస్తున్నాయని బోధపడుతుంది. ఆ సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. కొత్తవారిని దెబ్బతీయకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమా జాల్లో కనిపించే సామరస్యతా ధోరణి వంటివాటిని భారత్ లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం. ప్రభుత్వంలో సంస్కరణ కాదు.. సమా జంలో సంస్కరణే దేశాలను సుసంపన్నం చేసింది, వారి తలసరి జీడీపీని అత్యున్నత స్థాయిలో నిలిపింది. ప్రభు త్వం తీసుకొచ్చిన మార్పులపై మాత్రమే మనం దృష్టి పెట్టి నంత కాలం, అభివృద్ధి సాధనలో భారత్ మందకొడితనం కొనసాగుతూనే ఉంటుంది. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com