సమాజంలో సంస్కరణే... అభివృద్ధి
సంపన్న సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. పరదేశీయులను వేధించకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమాజాల్లోని సామరస్యత వంటివాటిని భారత్‌లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం.
ఐక్యరాజ్యసమితి తలసరి జీడీపీ విషయంలో ప్రపంచ దేశాల ర్యాంకుకు సంబంధించిన జాబి తాను ఇటీవలే విడుదల చేసింది. దాంట్లో భారత్‌కు 150వ ర్యాంకు దక్కింది. మన తలసరి జీడీపీ సంవత్సరానికి $1586. అంటే నెలకు భారతదేశం రూ. 8,800 విలువైన వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ ర్యాంకింగులో భారత్ కంటే దిగువన ఉన్న దేశాలేవంటే... ఎమెన్ ($1418), పాకిస్తాన్ ($1358), కెన్యా ($1358), బంగ్లాదేశ్ ($1,088), జింబాబ్వే ($ 965), నేపాల్ ($ 692), అఫ్గానిస్తాన్ ($ 688) కాంగో ($ 480). సోమా లియా ($131) అన్నిటికంటే దిగువన ఉంది.
వీటితో పోలిస్తే అతి చిన్న యూరోపియన్ దేశాలైన మొనాకో ($187650), లీసెన్‌స్టెయిన్ ($157040), లగ్జెం బర్గ్ ($116560)లతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాలు సుసంపన్న జీవితానికి ప్రతీకలు. సింగపూర్ ($55910), యునెటైడ్ స్టేట్స్ ($ 54306), అత్యధిక ఆదాయం సాధిస్తున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తు న్నాయి. దక్షిణ కొరియా ($ 28 166) జపాన్ ($ 36298)ను సమీ పిస్తుండగా, జర్మనీ ($ 47966), యునెటైడ్ కింగ్‌డమ్ ($ 46461) సమీపస్థాయికి చేరుతున్నాయి.
ఈ అంకెలు మంచి సూచికే కానీ మనం వీటిని మాత్రమే పరి గణనలోకి తీసుకోకూడదు. మొత్తం సగటు కంటే మధ్యగత ఆదాయం.. అంటే ఈ జాబితా మధ్యలో ఉన్న వారి ఆదాయం విషయంలో భారత్ కంటే పాకిస్తానే ఆధిక్యతలో ఉంది. అంటే పాకిస్తానీయుల ఆదాయం భారతీయులతో పోలిస్తే తక్కువగానే ఉన్నప్పటికీ అది భారత్ కంటే చక్కగా పంపిణీ అవుతోందని, భారత్ కంటే పాకిస్తాన్ ఆర్థికంగా తక్కువ అసమానత్వంతో ఉందని అర్థం.
ఈ జాబితా ప్రకారం జాంబియా($1715), వియత్నాం ($ 2015), సూడాన్($2081), భూటాన్ ($25 69) దేశాలు భారత్‌కంటే ముందున్నాయి. ఇక తలసరి జీడీపీలో భారత్‌తో పోలిస్తే శ్రీలంక ($3635) రెట్టింపు ఆధిక్యతలో ఉంది. భారతీయుల కంటే శ్రీలంక ప్రజలు ఎంతో ఎక్కువ సౌభాగ్యంతో ఉంటున్న విషయం, శ్రీలం కను సందర్శించిన వారికి ఆశ్చర్యాన్ని కలిగించదు. ఇలాంటి పోలికలు తీసుకొస్తున్నప్పుడు దేశం పరి మాణం, దాని ఆదాయ మూలాలు, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని ఈ సమాచారం కేసి చూస్తే మనం ఎక్కడ ఉంటున్నామనే అంశంపై మనకు మంచి అవగాహన కలుగుతుంది. బహుశా, భారత్‌ను అభి వృద్ధి చెందిన దేశంగా మలచడానికి మనం ఇంకా ఏం చేయాల్సి ఉంటుందో పరిశీలించగలం కూడా.
అభివృద్ధి చెందుతున్న దేశం అనే పదబంధాన్ని వాడ కూడదని, దానికి బదులుగా దేశాలను తలసరి ఆదా యంతో వర్గీకరించాలని ప్రపంచ బ్యాంకు ఇప్పుడు నిర్ణ యించింది. భారత్ ఒక స్వల్ప మధ్య స్థాయి ఆదాయ దేశం. ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం.. 1,000 డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలను స్వల్ప ఆదాయ దేశాలుగానూ, వెయ్యి నుంచి 4 వేల డాలర్ల మధ్య గల దేశాలు స్వల్ప మధ్యస్థాయి ఆదాయ దేశాలుగానూ, 4 వేల నుంచి 12 వేల డాలర్ల మధ్య గల దేశాలు అధిక మధ్య స్థాయి ఆదాయ దేశాలుగానూ, అంతకంటే ఎక్కువ ఆదా యం ఉన్న దేశాలు అత్యధిక ఆదాయం కలిగిన దేశాలు గానూ పరిగణించాల్సి ఉంటుంది. పలు యూరోపియన్ దేశాలు అధిక ఆదాయ దేశాలుగా ఉంటున్నాయి. తలసరి ఆదాయం 600 డాలర్లు మాత్రమే ఉన్న సెర్బియా.. ఈ జాబితాలో అత్యంత దిగువ స్థానంలో ఉంది.
దారిద్య్రం నుంచి విముక్తి కావడానికి భార త్‌కు ఎంత తలసరి జీడీపీ అవసరమనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ గవ ర్నర్ రఘురాం రాజన్ ఇటీవలే మాట్లాడారు. ‘‘ఒకస్థాయి లో మనం ఇప్పటికీ 1,500 డాలర్ల తలసరి ఆదాయం ఉన్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నాం. 1,500 నుంచి సింగపూర్ ఆర్జిస్తున్న 50 వేల డాలర్ల స్థాయికి చేరుకోవడానికి మనం చేయవలసింది ఎంతో ఉంది. మనది ఇప్పటికీ సాపేక్షి కంగా పేద ఆర్థిక వ్యవస్థే. ప్రతి ఒక్కరి కంటి కన్నీరును తుడవాలంటే భారత్ కనీసం మధ్య ఆదాయదేశంగానైనా మారాలి. సహేతుకంగా పంపిణీ చేసినట్లయితే, 6 వేల నుంచి 7 వేల డాలర్ల తలసరి ఆదాయాన్ని సాధించ గలిగితే తీవ్ర దారిద్య్రంతో మనం తలపడగలుగుతాం. కనీసం ఒక మేరకు సంతృప్తికర స్థాయికి చేరుకోవాలంటే రెండు దశా బ్దాలు కృషి చేయవలసి ఉంటుంది.’’
ప్రస్తుతం చైనా తలసరి జీడీపీ 7,600 డాలర్లకు చేరు కుంది. అంటే రాజన్ చెప్పిన మధ్య ఆదాయ స్థాయిని అది ఈ మధ్యే చేరుకుందని అర్థం. భారత్‌తో పోలిస్తే చైనా అభి వృద్ధి విభిన్న దశలో జరిగిందని చైనాను సందర్శించిన వారికి బోధపడుతుంది. ఈ రెండు దేశాలను పోల్చి చూడటం సముచితం కాదు కూడా. మనకంటే చైనా ఎంతో ముందం జలో ఉంది మన జీవిత కాలంలో అంటే వచ్చే 30 ఏళ్లలో వారిని మనం అందుకోవడం సాధ్యపడుతుందని నేనయితే భావించడం లేదు. అందుచేత, ఇప్పుడున్న 1,500 డాలర్ల నుంచి 4 రెట్లకు అంటే 6 వేల డాలర్లకు మన జీడీపీ చేరుకోవాలంటే భారత్ చేయవలసింది ఏమిటి? ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశంపైనే భారత్‌లో ప్రధాన చర్చగా ఉంటోంది. ఏకీకృత వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) వంటి ఆర్థిక సంస్కరణల ద్వారా మనం మరింత అధి కంగా, మంచి చట్టాలను చేయవలసిన అవసరముందని మన ఆలోచన. రెండోది. మనకు సుపరిపాలన అవసరం, అంటే అవినీతి రహిత, సమర్థ పాలన అవసరం.
అవినీతి, అసమర్థత మన సంస్కృతిలో భాగంగా ఉన్న దేశంలో రెండో అంశం సాధ్యపడుతుందని భావించ డానికి పై రెండు అంశాలను పరిపూర్తి చేయడంతోటే సరిపోదని నేననుకుంటున్నాను. అవసరమైన మార్పులలో ఈ రెండూ ప్రధాన అంశాలు కావు. అధిక ఆదాయాన్ని సాధించిన దేశాలలో పర్యటించిన వారికి అవి భారత్‌కంటే విభిన్న దశలో వ్యవహరిస్తున్నాయని బోధపడుతుంది. ఆ సమాజాలు వ్యక్తులను గౌరవిస్తాయి. కొత్తవారిని దెబ్బతీయకుండా ఉండటంపై వారు పెట్టే శ్రద్ధ, ఆ సమా జాల్లో కనిపించే సామరస్యతా ధోరణి వంటివాటిని భారత్ లోని అత్యుత్తమ నగరాల్లో కూడా మనం ఏదో ఒక మేరకు కోల్పోయాం. ప్రభుత్వంలో సంస్కరణ కాదు.. సమా జంలో సంస్కరణే దేశాలను సుసంపన్నం చేసింది, వారి తలసరి జీడీపీని అత్యున్నత స్థాయిలో నిలిపింది. ప్రభు త్వం తీసుకొచ్చిన మార్పులపై మాత్రమే మనం దృష్టి పెట్టి నంత కాలం, అభివృద్ధి సాధనలో భారత్ మందకొడితనం కొనసాగుతూనే ఉంటుంది.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com