
క్లీన్ అండ్ గ్రీన్
సినీ తారలు ‘స్వచ్ఛ భారత్’కు సంకల్పించారు. నటి, నిర్మాత మంచు లక్ష్మి ఫిలింనగర్ రౌండ్ టేబుల్ స్కూల్ విద్యార్థులతో కలసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. మరో వైపు ఆమె సోదరుడు, హీరో మంచు మనోజ్ ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌ను క్లీన్ చేశారు. మంత్రి కేటీఆర్, హీరోలు రాంచరణ్, నాని, అల్లరి నరేష్ తదితరులు కూడా ఈ సామాజిక కార్యక్రమంలో పాల్గొనాలని మనోజ్ కోరారు.
బంజారాహిల్స్/ శేరిలింగంపల్లి