
మదర్ ఎర్త్
ఫొటోలు అందరూ తీస్తారు. సెల్‌ఫోన్లు వచ్చాక ఈ హాబీ మరింత పెరిగింది. ఎంత అద్భుతమైన దృశ్యాలు క్లిక్‌మనిపించినా..
ఫొటోలు అందరూ తీస్తారు. సెల్‌ఫోన్లు వచ్చాక ఈ హాబీ మరింత పెరిగింది. ఎంత అద్భుతమైన దృశ్యాలు క్లిక్‌మనిపించినా.. వాటిని నలుగురితో షేర్ చేసుకోవడానికి.. మన టాలెంట్‌ను ప్రజంట్ చేసుకోవడానికి సరైన వేదిక దొరకడమంటే కష్టమే మరి! అలాంటి ఔత్సాహికులకు ఊతమిచ్చి.. వారిలోని అభిరుచిని ప్రోత్సహించేందుకు గోథెజంత్రమ్ ‘పర్‌స్పెక్టివెన్’ ఎగ్జిబిషన్ నిర్వహిస్తోంది. ‘మదర్ ఎర్త్’ థీమ్‌తో బెస్ట్ ఫొటోగ్రఫిక్ టాలెంట్‌నంతటినీ ఒకే చోటకు చేర్చే ప్రయత్నం ఇది.
ఇందులో ప్రదర్శించే ఫొటోగ్రాఫ్స్ ఎక్కువగా భూమండలం అందాలు, అద్భుతాలు, బాధలు, పర్యావరణ అసమతుల్యతలు, కాలుష్య మేఘాలు, రాళ్ల స్థితిగతుల వంటి అంశాలపైనే ఉంటాయి. నగరానికి చెందిన ముప్ఫైమంది ప్రొఫెషనల్, అమెచ్యూర్ కళాకారులు తమ ఫొటోగ్రాఫ్స్‌ను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రశాంతి కుమార్ మంచికంటి క్యూరేటర్‌గా వ్యవహరిస్తారు.
వేదిక: గోథెజంత్రమ్, రోడ్ నం.3, బంజారాహిల్స్
సమయం: ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు
ఫోన్: 040-23350473
ప్రవేశం: ఉచితం