ప్రకృతిని చదివిన విద్యార్థులు | nature of reading students | Sakshi
Sakshi News home page

ప్రకృతిని చదివిన విద్యార్థులు

Published Fri, Apr 17 2015 10:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

ప్రకృతిని చదివిన విద్యార్థులు

ప్రకృతిని చదివిన విద్యార్థులు

‘మొబైల్ యాప్స్ ఫర్

కై ్లమేట్ చేంజ్’.. విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌తో కలిసి వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్ రూపొందించిన ప్రాజెక్ట్! ఈ పర్యావరణ అధ్యయనాన్ని ‘అర్బన్ ఐ నేచర్‌వాచ్ చాలెంజ్’ పేరుతో విద్యార్థుల ప్రాజెక్టు వర్క్‌లో భాగం చేశారు. డిసెంబర్‌లో లాంఛ్ చేసిన ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్న తీరును తెలుసుకునే కార్యక్రమాన్ని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సంస్థ శుక్రవారం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లోని పటోడియా ఆడిటోరియంలో నిర్వహించింది.

ఇందులో భాగంగా మెరిడియన్, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్, భారతీయ విద్యాభవన్, చిరక్ ఇంటర్నేషనల్, ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, ఇక్బాలియా ఇంటర్నేషనల్ తదితర 8 స్కూల్స్‌కు చెందిన 500 మంది విద్యార్థుల నుంచి తమ అర్బన్ ఐ నేచర్ వాచ్ చాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని, మెరిడియన్ స్కూల్ విద్యార్థి ధృవ్.. ఈ చాలెంజ్‌ను స్వీకరించి, ఈ విషయంలో తాను తన స్కూల్‌కు సారథ్యం వహిస్తానని ప్రారంభంలోనే తెలిపి తన స్కూల్ విజయానికి కారణమయ్యాడని నిర్వాహకులు ప్రకటించారు. విద్యార్థులు.. ఈ ఛాలెంజ్ సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలను, ప్రకృతిలో తాము పరిశీలించిన అంశాలను పంచుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ స్థానిక ప్రతినిధి ఫరీదా, ఎల్వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వైస్ చైర్మన్ డాక్టర్ తారాప్రసాద్‌దాస్ పాల్గొని మాట్లాడారు.
 ..:: సిటీప్లస్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement