సిటీవాసులు కొందరు కాలక్షేపానికి రవీంద్రభారతికి, కాస్త తలపండిన వారు త్యాగరాయగాన సభకు వె ళ్తుంటారు.
సిటీవాసులు కొందరు కాలక్షేపానికి
రవీంద్రభారతికి, కాస్త తలపండిన వారు త్యాగరాయగాన సభకు వె ళ్తుంటారు. లలిత కళలకు వేదికగా నిలిచిన ఆ ప్రదేశాలు
అందరికీ చిరపరిచితమే. వీటి సరసన ఐదేళ్ల కిందట ఓ కొత్త వేదిక వచ్చి చేరింది. మాల్స్, ప్రీమియర్ థియేటర్స్, హెవీ ట్రాఫిక్‌తో సిటీ రిచ్‌నెస్‌ని కళ్లకుకట్టే బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ దాటుకుని అలాగే ముందుకు వస్తే ఒక చిన్న సందు, ఆ వీధి చివర ఒక చిన్న ఇల్లు.. వారంలో ఆరు రోజులూ ఆ ఆవాసం ఆర్టిస్టులకు, ఆర్ట్ లవర్స్‌కు
నివాసంగా ఉంటుంది. తమ కళలను
ప్రదర్శించడానికి సరైన నెలవు లేని
కళాకారులకు నిలయం లామకాన్. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఈ కళల సౌధం ముచ్చట్లు..
..:: ఓ మధు
చిన్న చిన్న వేడుకలకు కూడా కన్వెన్షన్ సెంటర్లు వేదికవుతున్న వేళ.. పై కప్పు కూడా లేకుండా వచ్చింది లామకాన్. ఈ ఓపెన్ సెంటర్ తలుపులు లలిత కళలకు ఆల్వేస్ ఓపెన్‌గా ఉంటాయి. ఆర్ట్ లవర్స్‌కి అడ్డంకులు ఉండవిక్కడ. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు, ఛాయ్ పానీతో పాటు.. మనిషి, మనిషికి సంబంధించిన అన్ని సంగతులు మాట్లాడుకునేందుకు అవకాశం ఇస్తుందీ నిలయం. కేవలం మాటలే కాదు, చేతల్లో, కళల్లో, చర్చల్లో తమకు చేతనైన పద్దతుల్లో తమ వాదన, నిపుణతను చాటుకోవడానికి ఉన్న ఓపెన్ కల్చరల్ సెంటర్ ఇది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అరుదుగా ఉండే ఓపెన్ సెంటర్లలో లామకాన్ ఒకటి.
ఆ నలుగురు..
ఫరాన్, హుమేరా, బీజ్యు మాథ్యూ, ఇలాలే.. అనే నలుగురు 2010లో లామకాన్ ప్రారంభించారు. ఫరాన్ ప్రముఖ కళాకారిని పద్మశ్రీ జిలాని భాను కుమారుడు. ప్రముఖ కళాకారుడు, ఫొటోగ్రాఫర్, ఫిలింమేకర్ సైంటిస్ట్ అయిన మోయిద్ హసన్ ఫరాన్‌కు మేనమామ. హసన్ మరణానంతరం.. ఆయన నివాసాన్ని కల్చరల్ సెంటర్‌గా మలిచారు ఫరాన్.
హైదరాబాదీ స్టైల్..
లామకాన్‌లోకి ఎంటరవ్వగానే.. అడుగులు వడివడిగా ఇరానీ ఛాయ్, గరమ్ సమోసాలకేసి వెళ్లిపోతాయి. గతంలో ఒక్క ఇరానీ ఛాయ్ కొడితే కేఫ్‌లో మూడు గంటలు కూర్చునే ఛాన్స్ ఉండేది. అలాంటి థీమ్‌తోనే ఈ చోటుని తీర్చిదిద్దారు. మెనూ మొదలుకుని మార్బుల్స్, ఫర్నిచర్.. మొత్తం ఇరానీ కేఫ్ స్టయిల్‌లోనే ఉంటాయి. ఇరానీ ఛాయ్, సమోసాకు దోస్తీగా కిచిడీ, మిర్చి, ఆమ్లెట్, దహీవడ ఘుమఘుమలు అదనం. వీటన్నింటినీ లాగిస్తూ.. రాజకీయాలు, సినిమాలు, మత ధర్మాలు, ఆర్టిస్టులు, పుస్తకాలు.. ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ గడిపేస్తుంటారు. లండన్‌లో కూడా ఇలాంటి సెంటర్ ఒకటుంది. దానికి కూడా బీజు మాథ్యూ పార్టనర్‌గా ఉన్నారు. కూల్ డ్రింక్స్, బర్గర్స్ లాంటివి ఇక్కడ ఉండవు. దాహానికి కుండలోని చల్లని నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
ఎ కంప్లీట్ స్పేస్..
లిబరల్, సెక్యులర్, అణగారిన వారి హక్కుల గురించి మాట్లాడుకోవడానికి.. అలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ స్పేస్ వినియోగించుకోవచ్చు. ‘ఒక అంశాన్ని కేవలం చర్చ ద్వారా మాత్రమే చైతన్య పరచలేం. దానికి కాన్వాస్‌పై కొలువుదీరిన చిత్రాలు కావాలి.. నాటకాలు, నృత్య రూపకాలు ఇలా పలు రకాల మాధ్యమాలు తోడవ్వాలి. అప్పుడే దాన్ని ప్రభావవంతంగా చూపించగలం. అలాంటి ఆస్కారమున్న అంశాలను ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాం’ అని తెలిపారు లామకాన్ మేనేజర్ సుబ్బారెడ్డి. ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నుంచి రిటైరయ్యాక లామకాన్ పనులు ప్రారంభించాం. అందరికీ ఫ్రీగా, ఫ్రీడంతో ఉండే చోటు ఏర్పాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో దీన్ని రూపొందించాం. ప్రభుత్వం, కార్పొరేట్ సహకారం లేకుండా దీనిని ఇండిపెండెంట్‌గా నిర్వహిస్తున్నాం. స్వేచ్ఛగా చేయాలనుకున్నది చేసే అవకాశం ఉందిక్కడ. లామకాన్‌పై సిటీవాసులు చూపిస్తున్న ఆదరణ ఆనందంగా ఉంది. ఐదేళ్లు గడిచాయి. ఇంకా ఎన్నో చేయాల్సి ఉంద’ని అంటారు లామకాన్ ఫౌండర్లలలో ఒకరైన ఫరాన్.
పర్మినెంట్ వెన్యూ..
కుర్చీలు, ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్, మైక్స్ ఇలా అన్నీ ఇక్కడ ఉచితంగా అందిస్తారు. ఆడియన్స్, ఆర్టిస్టులకు రుసుం లేకుండా దొరికే వేదికిది. నిషుంభిత, సమాహార, ఉడాన్ ఇలా అనేక నాటక సంస్థలకు లామకాన్ పర్మినెంట్ వెన్యూ. విబ్జియార్, అక్టోపస్ స్టూడియోస్, హైదరాబాద్ డాక్యుమెంటరీ సర్కిల్ ఏర్పాటు చేసే షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలు ఇలా చాలా కార్యక్రమాలు ఇక్కడికి వచ్చే వారిని కదలనివ్వవు.
- ప్రత్యూష, నటి
యూత్ అడ్డా..
కాఫీడేస్.. ఐమాక్స్.. మాల్స్ యూత్‌కి అడ్డా అనుకుంటాం. కానీ, కెరీర్ డిస్కషన్స్‌కి, థియేటర్ ప్రాక్టీస్‌కి, పెయింటింగ్స్‌కి, డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చూడటానికి ఎంతోమంది యువతీయువకులు లామకాన్‌కు వస్తున్నారు. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ జాయ్, ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్స్.. అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్ లవర్స్.. ఇదీ లామకాన్ చేస్తున్న సేవ.
- మాధవి లత, పప్పెటర్