రోబో WONDERS | Robo wonders at Srinidhi Engineering College | Sakshi
Sakshi News home page

రోబో WONDERS

Published Mon, Aug 18 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

రోబో WONDERS

రోబో WONDERS

 ఈ తరం విద్యార్థుల ప్రతిభ ఘట్‌కేసర్ సమీపంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిబింబిస్తోంది. కాలేజ్‌లో జరుగుతున్న రోబో వేదా-2014 విద్యార్థుల సృజనకు వేదికగా నిలిచింది. విద్యార్థి దశలోనే వీరు రూపొందించిన రోబోలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డిఫరెంట్ థీమ్స్‌తో అలరిస్తున్న రోబోలు నెక్ట్స్ జనరేషన్‌ను కళ్లముందు ఆవిష్కృతం చేస్తున్నాయి.
 
కో-ఆర్డినేషన్ రోబో
రోబోలు సమన్వయం కోల్పోతే జరిగే ఉత్పాతం ఎలా ఉంటుందో వునం చాలా సినివూల్లో చూశాం. అవి మన అదుపాజ్ఞలో
నడవాలంటే మెదడుకు పదునుపెట్టాల్సిందే. ఆ ఆలోచనల నుంచి వచ్చిందే ‘సమన్వయ రోబో’.. హ్యూమన్ కంట్రోల్‌లో నడిచే ఈ రోబో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. హ్యూవున్ కంట్రోలింగ్‌తో ఒక రోబో పాత్ ఫాలో అవుతుంది. ఆ రోబో వెళ్లి వురో రోబోను టచ్ చేస్తుంది. రెండో రోబో కూడా ఆటోమేటిక్‌గా వుుందు వునం ఇచ్చిన పాత్‌లో వెళ్లడమే.. కో ఆర్డినేషన్ రోబోల్లో ప్రత్యేకత.
 
సంవిదిత రోబో
ఈ రోబో మెటల్ కాయిన్స్ ని డిటెక్ట్ చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.

నియంత్రణ్ రోబో
మనిషి చేతి కదలికలకు అనుగుణంగా ఈ రోబో కంట్రోల్ అవుతుంది. యాక్సిలరో మీటర్ చేతికి పెట్టుకొని మనిషి ఆపరేట్ చేస్తున్నప్పుడు రోబో ఒక పాత్‌లో వెళ్తుంది. ఆర్మీకి వీటి సేవలు అవసరం ఉంటాయి.      -వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement