
మాడభూషి శ్రీధర్
అవినీతి అంటే కేవలం లంచం తీసుకోవడం మాత్రమే కాదు. మరొకరి సొమ్మును దోచుకోవడం, అధికారాన్ని దుర్విని యోగం చేయడం కూడా అవి నీతి అవుతుంది.
విశ్లేషణ
పరిశోధనా గ్రంథ రచన మూల్యాంకన కాకముందు చౌర్యం లేదని పరిశీలించడానికి చదవడం, ముగిసిన తరువాత మున్ముందు పరిశోధనలకు ఆధార సామగ్రిగా గ్రంథాలయంలో ఉంచడం తప్పదు. ఎక్కడా అది రహస్యం కాదు.
అవినీతి అంటే కేవలం లంచం తీసుకోవడం మాత్రమే కాదు. మరొకరి సొమ్మును దోచుకోవడం, అధికారాన్ని దుర్విని యోగం చేయడం కూడా అవి నీతి అవుతుంది. ఇంట్లో భార్యను, పిల్లలను హింసించడం కూడా అవినీతే. సహచరుడి పరిశోధనా కృషిని హరించడ మూ, గ్రంథచౌర్యమూ అవినీతే. సమాచార కమిషన్‌లో నా కోర్టు ముందుకు సమాచార న్యాయనిర్ణయం కోసం ఒక అధ్యాపకురాలు తన పరిశోధనా రచనను తన సహ చర ఉపాధ్యాయిని తస్కరించిందనే అనుమానంతో సమాచారం కోరుతూ ఒక ఫిర్యాదు తెచ్చింది.
డాక్టర్ మీటా శర్మ డెహ్రారాడూన్‌లోని అటవీ పరిశో ధనా సంస్థలో పరిశోధనచేస్తున్నారు. సంస్థకు ఒక పరిశో ధనా ప్రాజెక్టు వచ్చింది. ఆమెతోపాటు ఆంచల్ శర్మ అనే మరో అధ్యాపకురాలు కూడా ఆ ప్రాజెక్టులో పనిచే స్తున్నారు. ఆంచల్ పి.హెచ్.డి. కోసం పరిశోధన చేసి సమర్పించిన గ్రంథంలో తన పరిశోధనను వాడుకున్నా రని మీటా శర్మ అనుమానించారు. ప్రాజెక్టుకు సంబం ధించిన కంప్యూటర్‌లో నుంచి తన రచనను ఆమె తీసు కున్నారని తనకు తెలిసిందని, కనుక ఆంచల్ పరిశోధనా గ్రంథ మూల్యాంకన సదస్సు వివరాలు తనకు తెలియ కుండా దాచారని డాక్టర్ మీటా శర్మ ఆరోపణ. ఆంచల్ శర్మ సమర్పించిన పరిశోధనా గ్రంథం ప్రతి తనకు ఇవ్వా లని, దీనిపై జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల ప్రతులను ఆ సమావేశంలో నిర్ణయ వివరాలను కూడా ఇవ్వాలని ఆమె ఆర్టీఐ కింద కేంద్ర సమాచార అధికారిని కోరారు.
పీహెచ్‌డీ అభ్యర్థి రచించిన పరిశోధనా గ్రంథం ప్రతి ఆ పరిశోధకుడి మేధో ఆస్తి అవుతుందని, అది వారి వ్యక్తిగత సమాచారమని, కనుక మూడో వ్యక్తి సమాచా రమైన ఆ ప్రతిని ఇవ్వడం సాధ్యం కాదని సమాచార అధికారి డాక్టర్ మీటా శర్మ అభ్యర్థనను తిరస్కరించారు. మొదటి అప్పీలులో కూడా ఆమెకు తిరస్కారమే ఎదు రైంది. కమిషన్ ముందు రెండో అప్పీల్ చేసుకున్నారు.
రచన ముగిసిన వెంటనే, ప్రచురణ అయినా కాక పోయినా ఆ రచనలో మేధో సంపత్తి హక్కు సహజం గానే రచయితకు వస్తుంది. అది ప్రచురించిన తరువాత ప్రజలకు చదివే అవకాశం వస్తుంది. మేధో సంపత్తి హక్కు అంటే తన రచనను మరొకరెవరూ చదవడానికి వీల్లేని నిషేధపు హక్కు కాదు. అది మరొకరెవరూ దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి వీల్లేదనే నిషేధపు హక్కు. ఒకరి రచనా కృషి ఫలితాన్ని మరొకరు నగదుగా మార్చుకోవడానికి వీల్లేదని కాపీరైట్ హక్కు చట్టం వివ రిస్తున్నది. రచయిత శ్రమ ఫలితాన్ని హక్కులో ఒక భాగం తనకు బదిలీ అయినందున మాత్రమే ప్రచురణ కర్త ప్రచురించగలుగుతారు. అందుకు ప్రతిఫలం కూడా ఇవ్వవలసి ఉంటుంది. అంతే కాని రచన రహస్యం కాదు. చదవడానికి వీల్లేని వ్యక్తిగత లేఖ కాదు. అయితే పరిశోధనా గ్రంథం కూడా రచనే అవుతుందా?అందులో కూడా పరిశోధకుడికే హక్కు లభిస్తుందా?
తాను సమర్పించిన పరిశోధనా గ్రంథం ఉపయు క్తమైందే కాక ఉత్తమ ప్రమాణాలతో కూడుకున్నదని, తానేదో కొత్త అంశాన్ని ప్రతిపాదించానని చెప్పడమే కాకుండా, అది తను సొంతంగా కష్టపడి రాసిన రచనే అనీ, తాను ఎవ్వరి పరిశోధనా ఫలాలను, గ్రంథ చౌర్యం చేయలేదని పరిశోధకుడు అకాడమీ ఏర్పాటు చేసిన నిపుణుల ముందు నిరూపించుకోవలసి ఉంటుంది. నిజానికి పి.హెచ్.డి.లో అదే పరీక్ష, వైవా వోసీ అనే పరిశీలనా సదస్సులో పెద్దలు, పరిశోధనా పర్యవేక్షకుల సమక్షంలో సహచరులు విద్యార్థుల ముందు పరిశోధకు రాలు తన రచనలో తాను రాసిన అంశాలను సమర్థించు కోవాలి. అప్పుడు ఆమె డాక్టర్ అవుతారు. మరొకరి రచ నను పూర్తిగాగానీ, కొంతగానీ యథాతథంగా రచయిత పేరును చెప్పకుండా వాడితే అది ప్లేజియారిజం అని ఆంగ్లంలో అంటారు. అది చౌర్య తీవ్రతను బట్టి కాపీరైట్ నేరం కూడా అవుతుంది.
ఒకసారి విశ్వవిద్యాలయ మూల్యాంకనం అయిన పరిశోధనా గ్రంథం ఉత్తీర్ణత పొంది పి.హెచ్.డి.కి అర్హత సంపాదించిందని పరిశీలకులు నిర్ధారించిన తరువాత ఆ గ్రంథం పరిశోధకురాలి హక్కు అవుతుంది. అయినా అది ఆమె స్వ సమాచారం కాబోదు. అందరూ చదవడా నికి వీలుంటుంది. విశ్వవిద్యాలయం కూడా ఆ గ్రంథా న్ని ఒక దస్తావేజువలె కాకుండా ఒక పుస్తకం వలె పరిగ ణించి గ్రంథాలయంలో ఉంచాలి. పి.హెచ్.డి. గ్రంథా లన్నీ డిజిటలైజ్ చేసి అందుబాటులో పెట్టడం ఇంకా మంచిది. అందువల్ల కొత్త పరిశోధకులకు ఈ అంశాల మీద మరింత పరిశోధన చేసి కొత్త విషయాలు తెలు సుకునే అవకాశం లభిస్తుంది. పరిశోధనాగ్రంథ రచన మూల్యాంకనం కాకముందు చౌర్యం లేదని పరిశీలించ డానికి చదవడం, ముగిసిన తరువాత మున్ముందు పరి శోధనలకు ఆధార సామగ్రిగా గ్రంథాలయంలో ఉంచ డం తప్పదు. ఎక్కడా అది రహస్యం కాదు. అది వ్యక్తి గతమైన అంశం కాదు. ఒకవేళ గ్రంథ చౌర్యం ఉంటే చర్య తీసుకోవాలని అసలు రచయిత కోరవచ్చు. గ్రంథ చౌర్యం లేకపోతే సమస్యే లేదు. ఒక సహచర పరి శోధకురాలిగా మీటా శర్మ కూడా ఆంచల్ శర్మ రచనను చదవవచ్చు. ఎన్.ఐ.సి. ద్వారా వీడియో సమావేశం జరిపి జోధ్‌పూర్‌లో ఉన్న అధ్యాపకురాలు డాక్టర్ మీటా శర్మ అభ్యర్థన, సి.పి.ఐ.ఒ. వాదం విన్న తరువాత మీటా శర్మ కోరిన విధంగా ఆంచల్ శర్మ పరిశోధనా గ్రంథం ప్రతిని ఇతర సమాచారాన్ని కూడా ఇవ్వాలని ఆదేశిం చడమే న్యాయం.
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com