నా హబ్బీయే.. నా జేమ్స్‌బాండ్ | Sania Mirza to run 'PIX School of BONDing' on Sony Pix | Sakshi
Sakshi News home page

నా హబ్బీయే.. నా జేమ్స్‌బాండ్

Published Fri, Nov 21 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

నా హబ్బీయే..  నా జేమ్స్‌బాండ్

నా హబ్బీయే.. నా జేమ్స్‌బాండ్

టెన్నిస్ కోర్టులో దుమ్మురేపే సానియా మీర్జా.. ఆరేళ్ల వయసులో రాకెట్ పట్టింది. పదిహేనేళ్ల వయసులో ఫస్ట్ సక్సెస్ కొట్టింది.టెన్నిస్ స్టార్‌గా సెలబ్రిటీ లిస్ట్‌లో చేరిన సానియా.. తర్వాత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగింది. ప్రజెంట్ సోని పిక్స్ బాండ్ ఫెస్ట్ కోసం టీచర్‌గా మారింది. జేమ్స్‌బాండ్ స్టైల్స్‌ను వివరిస్తూ ఆమె నటించిన ప్రత్యేక షూట్‌ను బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ స్టార్ హోటల్‌లో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సానియాను ‘సిటీప్లస్’ పలకరించింది.
 
నేను పుట్టింది ముంబైలో అయినా.. ఐదు రోజుల పాపగా ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. నా స్కూలింగ్ అంతా ఖైరతాబాద్‌లోని నాసర్ స్కూల్‌లోనే సాగింది. టెన్నిస్‌లోనే కాదు చదువులోనూ యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇంటర్ యూసుఫ్‌గూడలోని ‘సెయింట్ మేరీస్ కాలేజ్’లో చదువుకున్నాను. పూర్తి టైం టెన్నిస్ మీదికి షిఫ్ట్ చేసే సరికి నా చదువుకు ఫుల్‌స్టాప్ పడింది.
 
15 ఏళ్లకే ఫస్ట్ కిక్..
నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి మా నాన్న టెన్నిస్ ట్రైనింగ్‌కు తీసుకెళ్లేవారు. నన్ను ఓ స్టెఫీగ్రాఫ్‌గా చూడాలని ఆశపడ్డారు. ప్రొఫెషనల్ కోచ్ దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్లినప్పుడు ఇంత చిన్న వయసులో ‘ఎలా నేర్చుకుంటుంది..?’ అని మొదట రెఫ్యూజ్ చేశారు. తర్వాత టెన్నిస్‌పై నాకున్న ఏకాగ్రత, ఇష్టాన్ని చూసి ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ చేసుకున్నారు. తర్వాత సికింద్రాబాద్‌లోని ‘సిన్నేట్ టెన్నిస్ అకాడమీ’లో నా ప్రొఫెషనల్ ట్రైనింగ్ మొదలైంది. తర్వాత కొన్నాళ్లు అమెరికాలో కూడా కోచింగ్ తీసుకున్నాను. టెన్నిస్ కోర్టులో నా ఫస్ట్ సక్సెస్ 15 ఏళ్ల వయసులో సాధించాను.
 
ఈజీగా బతికేయొచ్చు..

హైదరాబాద్ ఈజ్ గ్రేట్ సిటీ. ఇక్కడ పేద, గొప్ప తేడా లేకుండా ఎవరైనా ఈజీగా బతికేయొచ్చు. ప్రతి ఒక్కరినీ ఆదరించే గొప్పగుణం ఈ సిటీకి ఉంది. రంజాన్, న్యూ ఇయర్‌కి హైదరాబాద్‌లోనే ఉండాలనుకున్నా బిజీ షెడ్యూల్‌తో వీలుపడదు. గతేడాది మాత్రం రంజాన్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే అవకాశం దక్కింది. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సిటీ పూర్తిగా మారిపోయింది. ఫ్యాషన్, ఎడ్యుకేషన్, కెరీర్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముంబై, బెంగళూరుతో పోలిస్తే మన సిటీయే బెస్ట్ ఆప్షన్ అంటాను. ఇక ఫ్రెండ్స్‌తో కలసి ఓల్డ్ సిటీలోని రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసుకుని కారులోనే కూర్చుని తినడం సరదాగా ఉంటుంది. పిస్తా హౌస్‌లో హలీమ్ టేస్టీగా ఉంటుంది. నాకు మొబైల్స్ అంటే ఫుల్ క్రేజ్. ఏ మొబైల్ లేటెస్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చినా అప్‌డేట్ అయిపోతాను. స్మార్ట్ గాడ్జెట్స్, స్పోర్ట్ కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువే.

దీపికా అయితే ఓకే..
నా ఆటో బయోగ్రఫీ రాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2011లో మొదలుపెట్టాను. పూర్తి కావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. నా బయోపిక్ సినిమా తీస్తే అందులో నా రోల్ దీపికా పడుకొనే చేయాలని కోరుకుంటున్నాను. నాకైతే యాక్టింగ్ అంటే సిగ్గు. నేను సినిమాల్లోకి వచ్చే చాన్సే లేదు. ఇప్పుడు పిక్స్ స్కూల్ ఆప్ బాండింగ్ షూట్ కోసం మూడు రోజులు కష్టపడ్డాను. నాకు స్వతహాగా జేమ్స్ బాండ్ స్టైలంటే ఇష్టం. అందుకే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఒకటిన్నర నిమిషం నిడివున్న ఈ యాడ్‌లో బాండ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను, ఆయన ఆడవారి మనసులను దోచుకోవడం వెనుకున్న కిటుకులను నేర్పించే టీచర్‌గా నటించాను. ఇక నా లైఫ్ జేమ్స్‌బాండ్ మా వారే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement