తెలంగాణ లోగో ఎందుకు ధరించడం లేదు?
బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన టెన్నిస్ సానియా మీర్జా తెలంగాణ లోగోను ఎందుకు ధరించడం లేదు. లోగో ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడుంటే తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తంగా విస్తరించేదే కదా. సర్కారు ఔదార్యాన్ని కోట్ల రూపాయల్లో స్వీకరించిన ఈ క్రీడాకారిణికి లోగో ధరించాలనే నిబంధనను తెలంగాణా సర్కారు పెట్టలేదా? లేక సానియా నిరాకరించిందా? ఏదేమైనా క్రీడాకారుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయడంలో తెలంగాణా క్రీడా శాఖ విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర క్రీడా పాలసీలు వస్తేనే ఇలాంటి పొరబాట్లను సవరించే వీలుంటుందని క్రీడా సంఘ బాధ్యుడు కె.పి.రావు అన్నారు. యూఎస్ ఓపెన్ లో తెలంగాణ లోగో ధరించకుండా సానియా ఆడడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి సాయం పొందినప్పుడు ఎందుకు లోగో ధరించలేదని ఆయన ప్రశ్నించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ ఆరంభానికి ముందు సానియాకు రూ.కోటి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమెకు మరో కోటి రూపాయలు అందజేసింది.