ఆ రాతిరి... జాగారమే! | Shah Rukh Khan and Salman Khan did a FaceTime call with Aamir Khan after their patch up | Sakshi
Sakshi News home page

ఆ రాతిరి... జాగారమే!

Published Thu, Nov 20 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

ఆ రాతిరి... జాగారమే!

ఆ రాతిరి... జాగారమే!

సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ సంగీత్ రోజు రాత్రంతా ఆమిర్‌ఖాన్‌కు నిద్దరే లేదట. చాలా కాలం తరువాత ఒక్కటైన బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లిద్దరూ కలసి... తనకు నిద్దర లేకుండా చేశారని ఆమిర్ చెప్పాడు.

ఈ స్టార్లిద్దరూ కలిశారట కదా అని ఆమిర్‌ను అడిగితే... ‘అవును... మళ్లీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆ రోజు రాత్రంతా వారు నన్ను నిద్ర పోనివ్వలేదు. అర్ధరాత్రి ఒకటిన్నరకు నాకు కాల్ చేశారు. ఆ విషయాన్ని తొలుత నాకే చెప్పారు. రెండున్నరకు మరో కాల్... ఇక అక్కడి నుంచి తెల్లారే దాకా మాటలే. పడుకోనివ్వలేదు’ అంటూ ఆ ఎపిసోడ్ చెప్పుకొచ్చాడు ఆమిర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement