ఓ మెడికో ఆకాంక్ష
షార్ట్ ఫిలిం ఫెస్టివల్
బుల్లి సినిమా మేకర్స్ కోసం మరో ‘షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ ఆహ్వానం పలుకుతోంది. ఐక్లిక్ మూవీస్.కామ్ షార్ట్ ఫిలిం మేకర్స్ కోసం నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌లో మీ చిన్న సినిమాతో పెద్ద బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్‌లో సాధారణంగా థీం, జానర్ ప్రకటిస్తుంటారు.
ఐక్లిక్ అలాంటి నిబంధనలేమి లేకుండా, అన్ని రకాల జానర్ చిత్రాలను ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 12 నుంచి 15 నిమిషాల నిడివితో రూపొందించిన చిత్రాలను ఈ పోటీకి పంపవచ్చు. పోటీలో గెలిచిన 3 ఉత్తమ చిత్రాలకు చక్కటి నగదు బహుమతులు అందిస్తున్నారు. మొదటి ఉత్తమ చిత్రానికి లక్ష రూపాయలు, రెండో చిత్రానికి రూ.50 వేలు, మూడో చిత్రానికి రూ.25 వేల నగదు బహుమతి అందిస్తున్నారు. ఆఖరు తేదీ నవంబర్ 23. ఎంట్రీ ఫీజు రూ.300. వివరాలకు ఐక్లిక్ మూవీస్.కామ్‌ను సందర్శించవచ్చు.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్
చాలావుంది నిరుపేదలు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోలేక నానా ఇక్కట్లు పడుతుండటం మెడికో విద్యార్థి అరుున కార్తీక్‌ను కలచి వేసింది. నగరంలోని గాంధీ మెడికల్ కాలేజీలో సెకండియుర్ చదువుకుంటున్న కార్తీక్, తాను కళ్లారా చూసిన కొన్ని ఉదంతాల నుంచి ప్రేరణ పొంది, ఈ సందేశాత్మక లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఇందులో కౌశిక్, హర్ష ప్రధాన మిత్రులు. ఇద్దరూ భిన్న ధ్రువాలు. కౌశిక్‌ది ఇతరుల కష్టాలకు త్వరగా చలించిపోయే స్వభావం.
హర్షది సగటు కుర్రాళ్ల వూదిరిగానే జీవితాన్ని వీలైనంత వరకు ఎంజాయ్ చేయూలనే స్వభావం. కొన్ని సంఘటనలతో హర్షను కూడా కౌశిక్ సేవాభావం వైపు వుళ్లిస్తాడు. వైద్యులందరూ నిరుపేదలకు తవువంతు సాయుం అందించాలనే సందేశంతో రూపొందించిన ఈ లఘుచిత్రంలో సందర్భోచితమైన పాట కూడా ఆకట్టుకుంటుంది. పూర్వానుభవం లేకపోరుునా, కార్తీక్ కథలో బిగి సడలకుండా ఈ లఘుచిత్రాన్ని రూపొందించడం విశేషం.