లండన్ : గింజ ధాన్యాలు, సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చని..అకాల మరణం ముప్పును ఇవి దాదాపు సగం తగ్గిస్తాయని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిన్‌ల్యాండ్‌లో పరిశోధకులు 2500 మంది పురుషుల ఆరోగ్యాన్ని 22 ఏళ్ల పాటు పర్యవేక్షించడం ద్వారా ఈ వివరాలు రాబట్టారు. వీరిలో బాదం వంటి గింజ ధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్, ఒమెగా 6 పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకున్న వారు నివారించదగ్గ వ్యాధుల కారణంగా అకాల మృత్యువాతన పడటం 43 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. గింజధాన్యాల్లో ఉండే లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ కారక వాపులకు దారితీస్తుందనే ఆందోళనలకూ తమ పరిశోధనలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. రక్తంలో ఎంత ఎక్కువగా లినోలిక్ యాసిడ్ స్ధాయి ఉంటే అకాల మృత్యువు రిస్క్ అంత తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని చెప్పారు.
రక్తంలో కొలెస్ర్టాల్ స్ధాయిలను మెరుగ్గా నిర్వహించడంలో ఒమెగా 6 ఆమ్లాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరోవైపు ఒమెగా 6 స్ధాయిలకు, క్యాన్సర్ కారక మృతులకు మధ్య నిర్థిష్టంగా ఎలాంటి సంబంధం లేదని ఈ అథ్యయనంలో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment