
సండే బ్రంచ్
అకేషన్ ఏదైనా... ఫుడీస్‌కు వెరైటీ టేస్ట్‌లను రుచి చూపించడంలో ముందుంటాయి నగరంలోని హోటల్స్.
అకేషన్ ఏదైనా... ఫుడీస్‌కు వెరైటీ టేస్ట్‌లను రుచి చూపించడంలో ముందుంటాయి నగరంలోని హోటల్స్. విమెన్స్ డే సందర్భంగా ఆదివారం నోవాటెల్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ హోటల్ భిన్నమైన రుచులకు వేదికైంది. ఇక్కడి ‘ద స్క్వేర్’లో ఏర్పాటు చేసిన స్పెషల్ సండే బ్రంచ్ చవులూరించింది.
ప్రముఖ చెఫ్స్... నార్తిండియన్, సౌతిండియన్ ప్రత్యేక వంటకాలతో ‘ఆహా’ అనిపించారు. నోరూరే రుచులను అతిథులు వేడివేడిగా ఓ పట్టు పట్టారు. ఫుడ్ ప్రియులకు మరిన్ని వెరైటీ వంటకాలను అందించేందుకు వచ్చిన నయా చెఫ్‌ను అతిథులకు పరిచయం చేశారు. మహిళలు... పాకశాస్త్రంలో మెళకువలు అడిగి తెలుసుకున్నారు.
సాక్షి, సిటీ ప్లస్