జీప్ థ్రిల్స్ | they are jeep lovers | Sakshi
Sakshi News home page

జీప్ థ్రిల్స్

Published Wed, Oct 8 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

జీప్ థ్రిల్స్

జీప్ థ్రిల్స్

రోడ్డెక్కితే చిరుతలాంటి వేగం.. రూపంలో ఉట్టిపడే వైవిధ్యం, దర్పం.. రోడ్డున్నా.. లేకున్నా బేఫికర్. కొండలు.. గుట్టలు.. మట్టినేల.. బురద ఏదైనా బలాదూర్. స్టార్ట్ చేస్తే చాలు ఎక్కడైనా రయ్యిన దూసుకుపోవడమే నైజం. ఒక్కసారి ఎక్కితే చాలు హుషారెక్కిపోవాల్సిందే. దానిపై జర్నీ ఎంతో ఫన్నీ.. ఏదేమైనా జీప్ లుక్కే వేరు. అదంటే ఇష్టపడే, పిచ్చి ప్రేమగల వారంతా కలసి ‘జీప్ థ్రిల్స్ హైదరాబాద్ 4గీ4 క్లబ్’ ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగర రహదారులపై రోజుకో అధునాతన మోడల్ కారు పరుగులు తీస్తున్నా.. ఇక్కడి రోడ్స్‌కి, ఆఫ్‌రోడ్స్‌కి బెస్ట్ ఫ్రెండ్ జీపే అంటారు.
 
భారత్‌లో మొదటి ఆఫ్‌రోడ్ గ్రూప్ జీప్ థ్రిల్స్ హైదరాబాద్ 4గీ4 క్లబ్. శాంస్ అహమద్, షాఫత్ అలీ 2005లో దీన్ని ప్రారం భించారు. 2008లో రిజిస్టర్ అయిన ఈ క్లబ్  ఇప్పటి వరకు అంతర్జాతీయ మోటారు కంపెనీలతో కలసి పది కంటే ఎక్కువ మెగా ఈవెంట్లు ఆర్గనైజ్ చేసింది. 250కి పైగా ఆఫ్ ద రోడ్ (ఓటీఆర్) ట్రిప్స్ హైదరాబాద్ చుట్టు పక్కల నిర్వహించింది. ప్రతి రెండు వారాలకోసారి 10-15 వెహికల్స్‌తో చిన్న ట్రిప్పులు నిర్వహిస్తుంటారు. ఆఫ్‌రోడింగ్ అంటే ఆసక్తి గలవారిని ఎంకరేజ్ చేయటం,  44 జీప్ వెహికల్స్‌ని మెయింటైన్ చేయటంతో పాటు మాడిఫై చేయటానికి సంబంధించిన సందేహాలూ తీరుస్తుంటారు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులో 1942 నాటి నుంచి నేటి వరకు జీప్ మోడల్స్ ఈ క్లబ్‌లో ఉన్నాయి.
 
నేచర్ లవర్స్..
జీప్ అంటే ఇష్టం, ఆసక్తితో ఈ క్లబ్‌లో చేరే వారికి ఇక్కడి యాక్టివిటీస్ ఉచితం. ఈ క్లబ్‌లో అందరూ నేచర్ లవర్స్ ఉంటారు. ‘అందుకే జీప్ రైడ్‌తోపాటు క్యాంపింగ్, హైకింగ్, ఫొటోగ్రఫీ, ఫిషింగ్, బార్బెక్యూ లాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం. వీటిలో సోషల్ యాక్టివిటీస్ కూడా చేరుస్తుంటాం’ అని క్లబ్ ఫౌండర్ శాంస్ అహమద్ అంటారు. హిమాయత్‌సాగర్ వీరికి చాలా ఇష్టమైన ప్లేస్. ఆఫ్‌రోడింగ్‌కి, బార్బెక్యూ ఫుడ్ తినడానికి బెస్ట్ లేక్‌వ్యూ చక్కటి స్పాట్.  
 
ఆఫ్ రోడింగ్...
మన దేశంలో రహదారులున్న ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో, అంతకంటే ఎక్కువగా రోడ్లు లేనివీ ఉన్నాయి. అలా రహదారి లేని ప్రాంతాలను ఆఫ్‌రోడ్ అంటారు.
 
గుర్తింపే ధ్యేయం
నిజాం కాలం నుంచి మా ఇంట్లో జీప్ వాడకం ఉంది. మన దేశంలో ఎన్నో అవసరాలకు, ఎన్నో ప్రాంతాలకు జీపు మాదిరిగా మరే మోటారు వాహనం ఉపయోగపడలేదు. అందుకే జీప్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తెచ్చి, జీప్ అంటే ఇష్టం ఉన్న వారందరినీ ఒక చోటికి తీసుకురావాలని క్లబ్ స్టార్ట్ చేశాం. జీప్ క్రీడలకు గుర్తింపు తీసుకురావాలనేది కూడా ఈ క్లబ్ ఉద్దేశం. 18 నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ క్లబ్‌లో మెంబర్స్‌గా ఉన్నారు.   

- శాంస్ అహమద్, క్లబ్ ఫౌండర్
 
ఎకో ఫ్రెండ్లీ
మొక్కల పెంపకం, వన్యప్రాణి రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎక్కడికి వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించకుండా, రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా జాగ్రత్తలు పాటిస్తాం. సిటీలో ఉన్నా, టూర్లో అయినా చెత్త బుట్టలోనే చెత్త వెయ్యటం మా నియమం.

- శ్యామల్ జేత్వా, క్లబ్ జాయింట్ సెక్రటరీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement