
అల్ట్రా బూస్ట్
స్పోర్ట్స్ షూస్‌లో బెస్ట్ బ్రాండ్ అడిడాస్... కొత్త మోడల్‌తో ముందుకొచ్చింది. విప్లవాత్మక మార్పులతో రూపొందించిన ఈ సరికొత్త రన్నింగ్ షూస్ ‘అల్ట్రా బూస్ట్’ను టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా లాంచ్ చేసింది. జూబ్లీహిల్స్ అడిడాస్ స్టోర్‌లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సానియాతోపాటు ఐదుగురు రన్నర్స్ కూడా పాల్గొన్నారు.
షూస్ ధరించి పరుగెత్తడంలో సరికొత్త అనుభూతిని ఆస్వాదించారు. షూస్‌తోపాటు... శరీర దృఢత్వం, పనితీరు ఇతర శారీరక అంశాలను సూచించే ‘మై కోచ్ స్మార్ట్ రన్’ పరికరాన్ని కూడా ప్రవేశపెట్టింది అడిడాస్. జీపీఎస్ సిస్టమ్‌తో పనిచేసే ఈ పరికరం స్పోర్ట్స్ పర్సన్స్‌కు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు నిర్వాహకులు.