
వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్
అమీర్‌పేటలోని ‘ధీ ఆర్ట్ స్పేస్ గ్యాలరీ’లో గురువారం ప్రారంభమైన వుడ్ కట్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కళాభిమానుల మనసు దోచుకుంటోంది. 13 మంది ప్రముఖ ఆర్టిస్టులు రూపొందించిన అద్భుత చిత్రాలు ఇక్కడ కొలువుదీరాయి. తెలంగాణ వనితను కాన్వాస్‌పై కళాత్మకంగా ఆవిష్కరించారు ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం. వ్యవసాయం వదిలిపెట్టి రైతులు పరిశ్రమల్లో పనిచేసేందుకు ఎలా వస్తున్నారనే థీమ్‌తో యంగ్ ఆర్టిస్టు పీసీ శేఖర్ చిత్రాలు భారత గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టాయి. నెమలిని గాంధీజీ అప్యాయతతో దగ్గరకు తీసుకుంటున్నట్టుగా చెక్కపై జగదీశ్ తమ్మినేని చెక్కిన చిత్రం... గాంధీకి పక్షులంటే ఎంత ప్రేమో చెప్పకనే చెబుతోంది. చెరువులు, వాగులు, కుంటల్లో కనిపించే చేపల చిత్రాలను వుడ్‌కట్ ఆర్ట్‌లో అద్భుతంగా మలిచారు మరో ఆర్టిస్టు శ్రీకాంత్ గురు. బరోడాలో సెటిల్ అయిన సిటీ అమ్మాయి గాయత్రి మాట్లాడుతూ... డైలీ లైఫ్‌లో ఎదురయ్యే డిఫరెంట్ సమస్యలకు చిత్రరూపమిచ్చే ప్రయత్నం చేశానన్నారు.
‘ఐ యామ్ లిజనింగ్... చెట్టు ముందు కూర్చొని నేను వింటున్నాను అనే థీమ్‌తో ప్రతాప్ మోడీ వుడ్‌కట్స్ ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆర్టిస్టు పద్మారెడ్డి మాట్లాడుతూ... భారత సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రధానమైన వివాహ వేడుకలనే సబ్జెక్ట్‌గా ఎంచుకొని ‘ది వెడ్డింగ్ గౌన్’కు చిత్ర రూపమిచ్చానని చెప్పారు. డెకరేటివ్ మోటార్స్ యూజ్ చేసుకుంటూ బ్యూటిఫుల్‌గా పిక్చర్ చేశానంటున్నారు. వచ్చే నెల 16 వరకు ఈ అపురూప చిత్ర ప్రదర్శన అందుబాటులో ఉంటుంది.
సాక్షి, సిటీ ప్లస్