తమలపాకుల ప్యాక్ | Betel Pack | Sakshi
Sakshi News home page

తమలపాకుల ప్యాక్

Published Sun, Jun 12 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

తమలపాకుల ప్యాక్

తమలపాకుల ప్యాక్

న్యూ ఫేస్
కావలసినవి: తమలపాకులు - 2, కొబ్బరి నూనె - 1 టీ స్పూన్, శనగపిండి - అర టీ స్పూన్
తయారీ: ముందుగా తమలపాకులను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి నూనె, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు కలుపుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌తో రోజులో ఎప్పుడో ఒకసారి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

క్రమం తప్పకుండా అలా చేస్తే మొటిమలు, నల్లమచ్చలు త్వరగా మాయమవుతాయి. అంతేకాదు, ముఖం మునుపటి కంటే ఎక్కువగా నిగారిస్తుంది.
* ఈ తమలపాకుల్లోని యాంటీ బాక్టీరియల్ లక్షణం ముఖంపై వచ్చే మొటిమలను నివారిస్తుంది. అలాగే కాలిన గాయాలను, వాటి ద్వారా ఏర్పడిన మచ్చలను త్వరగా తొలగించేందుకు తోడ్పడుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement