
చెర్రీ చమకులు
చెర్రీ పూల చెట్లకు పుట్టిళ్లు హిమాలయాలే. గుబురుగా పెరిగి పుష్పిస్తూ గుప్పుమనే వీటి అందాన్ని చూసి దశాబ్దాల క్రితమే వీటిని వివిధ దేశాల వారు తీసుకెళ్లి నాటుకొన్నారు. అలా నాటిన చెట్లు అల్లుకుపోయి ఆయా దేశాలకు కొత్త శోభను తీసుకొచ్చాయి. ప్రస్తుతం జపాన్‌లో చెర్రీబ్లోసమ్ సీజన్ నడుస్తోంది. ఈ పుష్పాల అందాలను చూడటానికి లక్షల మంది పర్యాటకులు టోక్యో తదితర నగరాలను సందర్శిస్తున్నారు. రిక్షాపై ప్రయాణిస్తూ వాటిని వీక్షించడంలో మరింత మజా. అలాంటి ఓ దృశ్యమిది.