మధుమేహం టైపు 2 రావడానికి కారణాలు:
మైదా, రిఫైన్డ్ చక్కెర పదార్థాల వాడకం, పీచు పదార్థం లేని ఆహార దినుసులను ముఖ్య ఆహారంగా తీసుకోవడం, అధికంగా తెల్ల చక్కెర పదార్థాలు వేసిన డ్రింకులు తీసుకోవడం, ఆహారం తినటం, పీచు పదార్థం లేనిదైన మాంసం, అల్కహాల్‌ల సేవనం. వందల కొద్దీ రసాయనాలు వేసిన– ప్యాక్ చేసిన ఆహారం కొనుక్కొని తినడం, తీవ్ర ఒత్తిడితో కూడిన జీవన శైలి, ఉద్రేకాలు, ఉద్వేగాలు క్లోమ గ్రంధిని ఆవహించిన ఇన్పెక్షన్‌లు, యాంటీ బయాటిక్‌ల విపరీత ఫలితాలు ఇందుకు చెప్పుకోదగ్గ కొన్ని కారణాలు. గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ‘మధుమేహం’ మరో పది రోగాలను ఆహ్వానిస్తుంది. ఇది కళ్లు, మూత్ర పిండాలు, ఎముకలు, మెదడుకూ కూడా రోగాలు తెచ్చి పెడుతుంది.
మధుమేహం టైప్ 2 రోగాన్ని తగ్గించుకొని, ఆరోగ్యవంతులవడానికి పది సూత్రాలు:
1. 1.8 నుంచి 12.5% పీచు పదార్థం కలిగిన సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా స్వీకరించడం. సిరిధాన్యాలలో పీచుపదార్థం ధాన్యపు కేంద్రం నుంచి బయటి వరకూ, పిండిపదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండటం వల్ల మనకు ఆరోగ్యం చేకూర్చటంలో పూర్తి దోహదం చేస్తాయి. రోజుకొకటే సిరిధాన్యాన్ని బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలకు వాడాలి. ఇలా 5 ధాన్యాలనూ రోజుకొకటి తినాలి. కుటుంబంలో అందరికీ చిన్న నాటి నుండే అవగాహన పెంచాలి.
2. రోజూ 50 నుండి 70 నిమిషాలు నడవటం అవసరం.
3. అధికంగా ఆకుకూరలు, సేంద్రియ ఆహారం సహజ రూపంలో తినడం.
4. మునగకాయలు, మెంతులు, మెంతికూర, కలబంద, కాకరకాయ, బెండకాయ, జామకాయల వాడకం పెంచుకోవాలి. జామ, మామిడి ఆకుల కషాయాన్ని ఉదయాన్నే త్రాగాలి.
5. పాల వాడకం మానివేయాలి. కొని తినే ప్యాకెట్ ఆహారాలను దూరం పెట్టాలి.
6. మైదా, మైదా వేసిన ఆహారాలూ, రిఫైన్డ్ నూనెలను దూరంగా ఉంచాలి.
7. మన ఉద్రేకాలు, ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి.
8. వరి అన్నం, గోధుమలు, మైదాతో కూడిన పదార్థాలను అతి తక్కువ వాడటం లేదా పూర్తిగా దూరంగా ఉంచాలి.
9. జిజఛిటపై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, తెల్ల చక్కెర వేసిన రెడీ మేడ్ ఆహారాల నుండి మనలను మనం రక్షించుకోవాలి.
10. మధుమేహం టైప్ 2 అందరికీ వచ్చేదే కదా అనే ‘అల్ప ధోరణి’ లేకుండా ఈ వ్యాధిని శాశ్వతంగా దూరంగా ఉంచే మార్గాలు పాటించడం. వ్యాధి వస్తే సరైన ఆహారం, మారిన జీవనశైలితో పోరాడటం.
ఆహారానికి ముందూ, ఆహారం తిన్న గంటకీ రక్తపరీక్షలు కాకుండా జిb్చ1ఛి రీడింగ్ 4 నెలలకూ లేదా 6 నెలలకూ తీసుకుని మధుమేహాన్ని శాస్త్రీయంగా సరైన పద్ధతిలో తెలుసుకోవాలి. రోగాలు ముఖ్యంగా దీర్ఘవ్యాధులు మన ఆనందాలను హరిస్తాయి. ఎందుకంటే వైద్యానికి పోయి మరిన్ని పరీక్షలూ, మరింత సంక్లిష్టమైన అర్థం కాని రోగాల విషవలయంలో ఇరుక్కొని, వ్యాధి నివారణ కనుచూపు మేరలో లేకుండా పోతున్నది. అశాంతికి కారణమవుతోంది.అందుకే మన ఆరోగ్యాన్ని మేలైన ఆహారం ద్వారా మనమే సాధించుకోవాలి. పోలిష్ చేయని సిరి ధాన్యాలు మనకు శక్తిని ప్రసాదిస్తాయి.నేటి ఆహార అలవాట్ల వల్ల వచ్చేది ‘డయాబెటిస్/చక్కెర/ మధుమేహం వ్యాధి. ఇది ఒక చేదు ‘ఆరంభం’ మాత్రమే. క్రమంగా మన నేత్రాలు, మూత్ర పిండాలు, ఎముకలు, రక్త పీడనం (బీపీ), పునరుత్పత్తి మండలం, హృదయ ఆరోగ్యం... అన్నింటిపై దీని ప్రభావం ఉంటుంది. పలు రోగాలకు కారణమవుతుంది. ఆహారం నుండి మన రక్తంలోకి వచ్చే గ్లూకోజ్ యొక్క నియంత్రణే మన ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. సిరిధాన్యాలే సమర్ధవంతంగా, సరైన ఫైబర్ కలిగి, మన రక్తంలోని గ్లూకోజ్ నియంత్రణ చేయగలవు. అతి తక్కువ ఫైబర్ లేదా, పూర్తిగా ఫైబర్ లేని మైదా, వరి అన్నం, గోధుమలు మన ఆరోగ్యానికి దోహదం చేయవు.చక్కెర వ్యాధి, అధిక రక్తపోటు, మోకాళ్ల నొప్పులూ, ఊబకాయం, రక్తంలో పెరిగే ట్రైగ్లిసెరైడ్స్, కొలెస్ట్రాల్, మూర్ఛలూ, గాంగ్రీసులు, క్యాన్సర్లు, మూత్రపిండ వ్యాధులూ, గర్భాశయ వ్యాధులూ, చర్మ వ్యాధులూ – ఎటువంటి వ్యాధులు ఉన్నా, సిరి ధాన్యాల సరైన పోషణ ద్వారా ఆరోగ్యం వైపు మీరు ప్రయాణిస్తారు.పోలిష్ చేయని సిరిధాన్యాల వాడకం ద్వారా ఎముక మజ్జను ఉత్తేజపరచటం, రక్తశుద్ధి, థైరాయిడ్, కాలేయం, క్లోమ గ్రంధుల మెరుగుపాటు, మెదడు, జీర్ణ మండల వ్యాధులూ మొదలైన కష్టాలన్నీ తీర్చుకోవచ్చు.వీటితో అన్నం వండుకోవచ్చు. రొట్టెలు చేసుకోవచ్చు. ఉప్మా, పొంగల్, ఇడ్లీ, దోసె, బిర్యానీ, బిసిబేళబాత్ కూడా చేసుకోవచ్చు. (అండుకొర్రలు నాలుగు గంటలు, మిగిలిన ధాన్యాలన్నీ కనీసం రెండు గంటల ముందు నానబెట్టికుని వండుకోవాలి) సిరి ధాన్యాలతో పాటు కొన్ని రకాల ఆకుల కషాయాలను సేవించడం ద్వారా క్యాన్సర్ వంటి పెద్ద రోగాల బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమే.
మధుమేహానికి బానిసలు కానక్కరలేదు
Published Sun, Dec 30 2018 12:54 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment