చంద్రబింబం: ఆగస్టు 17 నుండి 23 వరకు | Moon with the germinal: From 23 to 17 August | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: ఆగస్టు 17 నుండి 23 వరకు

Published Sun, Aug 17 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

Moon with the germinal: From 23 to 17 August

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)

ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. ఆప్తులు దగ్గరవుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
 
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)

 సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఊహించని రీతిలో ఆహ్వానాలు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పైస్థాయి ప్రశంసలు అందుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళారంగం వారికి అవార్డులు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం మధ్యలో అనారోగ్యం.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. మీసేవలకు తగిన గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

పనులు చకచకా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. గృహ నిర్మాణ, కొనుగోలు యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో రుణాలు చేస్తారు.
 
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)

 మొదట్లో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం.
 
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం.
 
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

 కొత్త విషయాలు గ్రహిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు.
 
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవులు. వారంమధ్యలో ఆలయాల దర్శనం. ఆరోగ్యభంగం.
 
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)

ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన కేసు అనుకూలంగా పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం.
 
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం మధ్యలో  అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)

పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటన వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం.
 - సింహంభట్ల సుబ్బారావు,  జ్యోతిష పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement